Share News

గుండ్లకమ్మ నదిలో ఇసుక తవ్వకాలు

ABN , Publish Date - Jan 30 , 2024 | 10:43 PM

కొండను తవ్వి ఎలుకను పట్టి న చందంగా వైసీపీ నేతల తీరు ఉందని పలువురు భ వనాల నిర్మాణదారులు పెదవి విరుస్తున్నారు. అద్దంకి సమీపంలోని గుండ్లకమ్మ నది నుండి గత నాలుగు నె లలుగా ఇసుక రవాణా నిలిపివేశారు. రాష్ట్ర వ్యాప్తంగా కొత్త కాంట్రాక్టర్‌ ఇసుక సీనరేజ్‌ వసూలు ప్రారంభిం చినప్పటి నుంచి గుండ్లకమ్మ నది నుంచి ఇసుక రవా ణా నిలిపివేశారు. గతంలో సైతం అద్దంకి సమీపంలో గుండ్లకమ్మ నది నుంచి ఇసుక రవాణాకు అధికారిక రీ చ్‌ లేకపోయినప్పటికీ ఇసుక తవ్వకాలు మాత్రం య థావిధిగా సాగాయి.

గుండ్లకమ్మ నదిలో ఇసుక తవ్వకాలు
గుండ్లకమ్మ నదిలో ఇసుకను ట్రాక్టర్‌ కు లోడింగ్‌ చేస్తున్న కూలీలు

ప్రారంభమైన రవాణా

సీనరేజ్‌ తగ్గించినా భవన

నిర్మాణదారులకు చేరేసరికి అదే ధర

వైసీపీ నేతల తీరపై పెదవివిరుపు

అద్దంకి, జనవరి 30: కొండను తవ్వి ఎలుకను పట్టి న చందంగా వైసీపీ నేతల తీరు ఉందని పలువురు భ వనాల నిర్మాణదారులు పెదవి విరుస్తున్నారు. అద్దంకి సమీపంలోని గుండ్లకమ్మ నది నుండి గత నాలుగు నె లలుగా ఇసుక రవాణా నిలిపివేశారు. రాష్ట్ర వ్యాప్తంగా కొత్త కాంట్రాక్టర్‌ ఇసుక సీనరేజ్‌ వసూలు ప్రారంభిం చినప్పటి నుంచి గుండ్లకమ్మ నది నుంచి ఇసుక రవా ణా నిలిపివేశారు. గతంలో సైతం అద్దంకి సమీపంలో గుండ్లకమ్మ నది నుంచి ఇసుక రవాణాకు అధికారిక రీ చ్‌ లేకపోయినప్పటికీ ఇసుక తవ్వకాలు మాత్రం య థావిధిగా సాగాయి. అనంతరం కూడా అదే పంధాలో కొనసాగించేందుకు కొత్త కాంట్రాక్ట్‌ పొందిన కార్పొరేట్‌ సంస్థ ప్రయత్నాలు ప్రారంభించినప్పటికి ప్రజలలో ఇసుక సీనరేజ్‌ వసూలు పట్ల ఉన్న వ్యతిరేఖత ను పొగొట్టాలని స్థానిక వైసీపీ నేతలు సీనరేజ్‌ వసూలుకు ససేమిరా అన్నారు. దీంతో ఇసుక రవాణా పూర్తిగా ని లిచిపోయింది. కొత్తగా ఇన్‌చార్జ్‌గా బాధ్యతలు చేపట్టిన హనిమిరెడ్డి సైతం ఖచ్చితంగా సీనరేజ్‌ లేకుండా ఇసు క రవాణాకు అనుమతులు ఇప్పిస్తానని స్థానిక వైసీపీ నేతలకు హామీ ఇచ్చినట్లు సమాచారం. అయితే, టెండ ర్‌ సంస్థ మాత్రం ససేమిరా అనటంతో పాటు తగ్గిం చేందుకు కూడా నిరాకరించినట్లు సమాచారం. ఈక్ర మంలో ఇసుక కష్టాలు మరింత పెరిగాయి.

నిబంధనల మేరకు ట్రాక్టర్‌ ఇసుక లోడింగ్‌తో సహా రూ.1950 సీనరేజ్‌గా చెల్లించాల్సి ఉంది. అయితే, గుం డ్లకమ్మ నదిలో ఇసుకను కూలీల ద్వారా జల్లెడ పట్టిం చి రవాణా చేస్తుంటారు. ఈక్రమంలో సీనరేజ్‌ సంస్థకు లోడింగ్‌తో పని ఉండదు. దానిప్రకారం రూ.1450 మా త్రమే తీసుకోవాలి. ఇసుక సీనరేజ్‌ వసూలు ప్రారంభిం చిన ప్రారంభంలో రెండువేల రూపాయలు ఉండగా, అనంతరం రూ.1800 సీనరేజ్‌ వ సూలు చేశారు. మం గళవారం నుంచి ఇసుక రవాణా ప్రారంభం కాగా, రూ.1400 వసూలు చేసేలా చర్చలు సఫలమైనట్టు తె లుస్తుంది. రూ.1800 సీనరేజ్‌ వసూలు చేసినప్పుడు, ఇ ప్పుడు రూ.1400కు తగ్గించినా అద్దంకి పట్టణంలోకి ట్రాక్టర్‌ ఇసుక ధర మాత్రం రూ.3300 నుంచి రూ. 3500గానే ఉండటం విశేషం. సీనరేజ్‌ రూ.400 తగ్గిం చామని వైసీపీ నేతలు చెప్పుకుంటుండగా, కొనుగోలు దారునికి గతంతో పోల్చితే మూడు వేల రూపాయల కే చేరాల్సి ఉంది.

అయినప్పటికీ మంగళవారం నుంచి ఇసుక రవాణా దారులు కూడా రూ.3500 చొప్పున వసూలు చేయ టం మరింత విమర్శలకు తావిస్తుంది. నాలుగు నెలల పాటు ఇసుక రవాణా జరగకుండా నిలిపివేసి చివరకు ఒరిగింది శూన్యమన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది.

Updated Date - Jan 30 , 2024 | 10:43 PM