పల్లె రహదారులకు మోక్షం
ABN , Publish Date - Oct 20 , 2024 | 10:34 PM
పల్లె పండుగ కార్యక్రమాలతో గ్రామీణ రహదారులకు మోక్షం లభించిందని ఎంపీడీవో కే స్వరూపారాణి అన్నారు. అందులో భాగంగా జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం నిధులతో సీసీ రోడ్ల నిర్మాణ పనులు చేపడుతున్నట్లు తెలిపారు. పంగులూరులో పల్లె పండుగ కార్యక్రమంలో భాగంగా సీపీ రోడ్లు, గోకులాల షెడ్లకు అధికారులు, ప్రజాప్రతినిధులు భూమిపూజ చేశారు.
పంగులూరు, అక్టోబరు 20 (ఆంధ్రజ్యోతి) : పల్లె పండుగ కార్యక్రమాలతో గ్రామీణ రహదారులకు మోక్షం లభించిందని ఎంపీడీవో కే స్వరూపారాణి అన్నారు. అందులో భాగంగా జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం నిధులతో సీసీ రోడ్ల నిర్మాణ పనులు చేపడుతున్నట్లు తెలిపారు. పంగులూరులో పల్లె పండుగ కార్యక్రమంలో భాగంగా సీపీ రోడ్లు, గోకులాల షెడ్లకు అధికారులు, ప్రజాప్రతినిధులు భూమిపూజ చేశారు. కార్యక్రమంలో జడ్పీటీసీ మాజీ సభ్యుడు బాచిన చెంచుప్రసాద్, టీడీపీ అధ్యక్షుడు రావూరి రమేష్, పీఆర్ ఏఈ హనుమంతరావు, ఏపీవో సంతోషం, సర్పంచ్ గుడిపూడి నాగేంద్రం, కార్యదర్శి బీ రాంబాబు, ఈసీ మురళి, సుబ్బారావు, బాచిన చౌదరిబాబు, జాగర్లమూడి సుబ్బారావు, రామారావు, సురేష్, నాగే శ్వరరావు, ఉపాధి, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.
పల్లె పండుగతో గ్రామాల అభివృద్ధి
కారంచేడు : పల్లె పండుగతో గ్రామాల్లో అభివృద్ధి వెలుగులు సంతరించుకుంటాయని టీడీపీ నాయకులు అన్నారు. పల్లె పండుగ వారోత్సవాల్లో భాగంగా కారంచేడు గ్రామం లో పలు అభివృద్ధి పనులకు ఆదివారం భూ మిపూజ కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రంలో భాగంగా గ్రామంలోని రెండు ప్రధాన మంచినీటి చెరువుల మధ్య సీసీ రోడ్డుకు శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో ఎంపీడీవో నేతాజీ, ఈవోఆర్డీ రమే్‌షబాబు, టీడీపీ నేతలు పోతిని ఉదయ్, నల్లగొర్ల శ్రీరాములు, జాగర్లమూడి ప్రహ్లాద, హుస్సేన్, చాగంటి లక్ష్మీన్నారాయణ, ప్రజా కూటమి నాయకులు, కార్యకర్తలు, గ్రామస్థులు పాల్గొన్నారు.