చందవరం స్టోరేజీలకు సాగర్ జలాలు
ABN , Publish Date - Jul 21 , 2024 | 10:13 PM
గ్రామాల్లోని ప్రజలకు తాగునీటి అవసరాల నిమిత్తం సాగ ర్ కెనాల్‌కు విడుదలైన జలాలు మండలంలోని చందవరం గ్రామ సమీపంలోకి ఆది వారం చేరుకున్నాయి. దీంతో మండలంలోని చందవరం గ్రామ సమీపంలో ఉన్న చందవరం-1, చందవరం-2 స్టోరేజీలను సాగర్ జలాలతో యుద్ధప్రాతిపదికన పం పింగ్ చేస్తున్నారు.
దొనకొండ, జూలై 21: గ్రామాల్లోని ప్రజలకు తాగునీటి అవసరాల నిమిత్తం సాగ ర్ కెనాల్‌కు విడుదలైన జలాలు మండలంలోని చందవరం గ్రామ సమీపంలోకి ఆది వారం చేరుకున్నాయి. దీంతో మండలంలోని చందవరం గ్రామ సమీపంలో ఉన్న చందవరం-1, చందవరం-2 స్టోరేజీలను సాగర్ జలాలతో యుద్ధప్రాతిపదికన పం పింగ్ చేస్తున్నారు. రెండు స్టోరేజీల్లో 20శాతం వరకు మాత్రమే నీరు నిల్వ ఉండ టంతో ప్రస్తుతం కెనాల్‌కు సాగర్ జలాలు విడు దలవుతున్న సమాచారంతో అధికా రులు, సిబ్బంది అప్రమత్తమై మోటార్లను సంసిద్ధం చేశారు. కెనాల్‌కు నీరు చేరగానే మూడు మోటార్లు ద్వారా స్టోరేజీలకు సాగర్ నీరు పంపింగ్ చేస్తున్నారు. చందవ రం-1 స్టోరేజీ పరిధిలో దొనకొండ మండలంలోని 29 గ్రామాలు, చందవరం-2 స్టోరేజీ పరిధిలో కనిగిరి, హనుమంతునిపాడు, కొనకనమిట్ల, సీఎస్‌పురం మండలా ల పరిధిలోని 132 గ్రామాల ప్రజలకు నీటి సరఫరా జరుగుతుంది. ప్రజలకు మం చినీటి ఇబ్బందులు లేకుండా స్టోరేజీలకు సాగర్ జలాలను పూర్తిస్థాయిలో నింపేం దుకు తగిన చర్యలు చేపట్టినట్టు అధికారులు పేర్కొన్నారు.