సీఎం సభకు ఆర్టీసీ బస్సులు
ABN , Publish Date - Jan 18 , 2024 | 10:34 PM
విజయవాడలో శుక్రవారం జరిగే అంబేడ్కర్ విగ్రహావిష్కరణ సందర్భంగా సీఎం జగన్మోహనరెడ్డి హాజరయ్యే బహి రంగ సభకు పెద్ద ఎత్తున ప్రజలను తరలించేందుకు ఏర్పాట్లు జరిగాయి. ఈక్రమంలో అద్దంకి డిపో నుంచి 25 ఆర్టీసీ బస్సులు ఏ ర్పాటుచేశారు. డిపోలో 40 బస్సులు ఉండగా, అందులో 25 పల్లె వెలుగు బస్సులను గురువారం సాయంత్రం నుంచే రద్దు చేశారు.
ప్రయాణికులకు తప్పని తిప్పలు
అద్దంకి, జనవరి 18: విజయవాడలో శుక్రవారం జరిగే అంబేడ్కర్ విగ్రహావిష్కరణ సందర్భంగా సీఎం జగన్మోహనరెడ్డి హాజరయ్యే బహి రంగ సభకు పెద్ద ఎత్తున ప్రజలను తరలించేందుకు ఏర్పాట్లు జరిగాయి. ఈక్రమంలో అద్దంకి డిపో నుంచి 25 ఆర్టీసీ బస్సులు ఏ ర్పాటుచేశారు. డిపోలో 40 బస్సులు ఉండగా, అందులో 25 పల్లె వెలుగు బస్సులను గురువారం సాయంత్రం నుంచే రద్దు చేశారు. బాపట్ల, చీరాల తదితర ప్రాంతాల నుంచి ప్రజలను తరలించేందుకు ఆయా గ్రామాలకు ఈ బస్సులను పంపినట్లు డీఎం రామ్మోహన రావు తెలిపారు. దీంతో అత్యధిక శాతం గ్రామీణ ప్రాంతాల బస్ సర్వీసులు రద్దు అయ్యాయి. అద్దె బస్సులు, ఎక్స్‌ప్రెస్ బస్సులు మా త్రమే ఆయా రూట్లలో నడిచాయి. బస్సులు రద్దు చేస్తున్నట్లు ఆర్టీసీ అధికారులు ముందస్తుగా ప్రకటించకపోవటంతో వివిధ పనుల నిమిత్తం గ్రామాల నుంచి అద్దంకి వచ్చిన ప్రయాణికులు తిరిగి వె ళ్ళేందుకు నానాఅవస్థలు పడ్డారు. గత్యంతరం లేక ఆటోలు, ప్రయి వేట్ వాహనాలను ఆశ్రయించారు. శుక్రవారం కూడా అత్యధిక రూట్ల లో బస్సులు నడిచే అవకాశం లేకపోవటంతో ప్రయాణికులు ఇబ్బం దులు తప్పడంలేదు.