Share News

జగన్‌ సభల కోసమేనా ఆర్టీసీ బస్సులు

ABN , Publish Date - Feb 17 , 2024 | 10:59 PM

సీఎం జగన్‌ పర్యటనలు ఎక్కడఉన్నా ఆర్టీసీ బస్సులను అక్కడికి తీసుకెళ్లడం దారుణమని ఎమ్మెల్యే గొట్టిపాటి రవికు మార్‌ ధ్వజమెత్తారు. దీంతో నిరుపేదలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. మండలంలోని గుంటుపల్లి గ్రామంలో శనివారం జరిగిన ఓ కా ర్యక్రమానికి వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడారు. రెండు రోజుల క్రి తం వలంటీర్ల సమావేశానికి బస్సులు రద్దు చేశారని పేర్కొన్నారు.

జగన్‌ సభల కోసమేనా ఆర్టీసీ బస్సులు
గుంటుపల్లిలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే రవికుమార్‌

వైసీపీ అరాచకాలకు త్వరలో ముగింపు

ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌

బల్లికురవ, ఫిబ్రవరి 17: సీఎం జగన్‌ పర్యటనలు ఎక్కడఉన్నా ఆర్టీసీ బస్సులను అక్కడికి తీసుకెళ్లడం దారుణమని ఎమ్మెల్యే గొట్టిపాటి రవికు మార్‌ ధ్వజమెత్తారు. దీంతో నిరుపేదలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. మండలంలోని గుంటుపల్లి గ్రామంలో శనివారం జరిగిన ఓ కా ర్యక్రమానికి వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడారు. రెండు రోజుల క్రి తం వలంటీర్ల సమావేశానికి బస్సులు రద్దు చేశారని పేర్కొన్నారు. అనంత పురం జిల్లాలో జరిగే జగన్‌ సభ కోసం ఉన్న బస్సులను అక్కడికి పంపు తున్నారన్నారు. ఆర్టీసీ బస్సులు ఉన్నది ప్రజల కోసమా, జగన్‌ కోసమా అనేది అర్థం కావటం లేదన్నారు. అదేమంటే పెత్తందార్లు, పేదలు అని జ గన్‌ మాట్లాడటం సిగ్గు చేటన్నారు. గ్రామాలలోని నిరుపేదలు పట్టణ ప్రాంతాలకు వైద్యం కోసం గాని, వారి పిల్లల చదువుల కోసం గాని వెళ్లా లంటే బస్సులు లేక తీవ్ర ఇక్కట్లకు గురవుతున్నారన్నారు. ఇవేమి కనిపిం చని వైసీపీ ప్రభుత్వం పేదలను తీవ్రంగా మోసం చేస్తుందన్నారు.

అద్దంకి నియోజకవర్గంలో పల్లె వెలుగు బస్సులను తరచూ రద్దు చేసు ్తన్నారని ఎమ్మెల్యే రవికుమార్‌ అన్నారు. అబద్ధపు హమీలతో అధికారంలోకి వచ్చి అరాచకాలకు పాల్పడుతున్న వైసీపీ ప్రభుత్వానికి ప్రజలు త్వరలో ముగింపు పలుకుతారని అన్నారు. ఇప్పటికే ప్రజలు సార్వత్రిక ఎన్నికల కోసం ఎదురు చూస్తున్నారని చెప్పారు. గ్రామాలలో టీడీపీకి వస్తున్న ఆద రణ చూసి ఓర్వలేక వైసీపీ ప్రభుత్వం బెదిరింపులకు దిగుతుందన్నారు. చంద్రబాబు సభలకు వస్తున్న జనాలను చూసి వైసీపీలో వణుకు మొదలైందన్నారు. సమావేశంలో మండల పార్టీ నేతలు మలినేని గోవిం దరావు, మందలపు సుధాకర్‌, పుచ్చకాయల సుబ్బరామయ్య, మాలపాటి పోతురాజు, దూళిపాళ్ల పూర్ణయ్య, అదిశేషయ్య, పున్నారావు, పుచ్చకాయల వెంకట్రావు, బండారు శేషయ్య తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Feb 17 , 2024 | 11:00 PM