Share News

సీఎ్‌సపురం అభివృద్ధికి రూ.4.50 కోట్లు నిధులు

ABN , Publish Date - Aug 24 , 2024 | 01:15 AM

సీఎ్‌సపురం గ్రామ సుందరీకరణ కోసం రూ.4.60 కోట్లు మంజూరు చేస్తామని రాష్ట్ర మంత్రి డోలా బాలవీరాంజనేయస్వామి చెప్పారు. సీఎ్‌సపురం గ్రామంలో సర్పంచ్‌ పద్మావతి అధ్యక్షతన శుక్రవారం జరిగిన గ్రామసభలో మంత్రితోపాటు కలెక్టర్‌ తమీమ్‌ అన్సారియా, ఎమ్మెల్యే ఉగ్రనరసింహారెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. సీఎ్‌సపురం గ్రామ సుందరీకరణ కోసం రూ.4.60 కోట్లు మంజూరు చేస్తామని రాష్ట్ర మంత్రి డోలా బాలవీరాంజనేయస్వామి చెప్పారు. సీఎ్‌సపురం గ్రామంలో సర్పంచ్‌ పద్మావతి అధ్యక్షతన శుక్రవారం జరిగిన గ్రామసభలో మంత్రితోపాటు కలెక్టర్‌ తమీమ్‌ అన్సారియా, ఎమ్మెల్యే ఉగ్రనరసింహారెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.

సీఎ్‌సపురం అభివృద్ధికి రూ.4.50 కోట్లు నిధులు
మాట్లాడుతున్న ఎమ్మెల్యే ఉగ్రనరసింహారెడ్డి

గ్రామసభలో మంత్రి స్వామి

పామూరు, ఆగస్టు 23 : సీఎ్‌సపురం గ్రామ సుందరీకరణ కోసం రూ.4.60 కోట్లు మంజూరు చేస్తామని రాష్ట్ర మంత్రి డోలా బాలవీరాంజనేయస్వామి చెప్పారు. సీఎ్‌సపురం గ్రామంలో సర్పంచ్‌ పద్మావతి అధ్యక్షతన శుక్రవారం జరిగిన గ్రామసభలో మంత్రితోపాటు కలెక్టర్‌ తమీమ్‌ అన్సారియా, ఎమ్మెల్యే ఉగ్రనరసింహారెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. సభో ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రప్రభుత్వం ప్రజల భాగస్వామ్యంతో గ్రామసభలు ఏర్పాటు చేసిందన్నారు. జిల్లా కలెక్టర్‌ తమీమ్‌అన్సారియా మాట్లాడుతూ జిల్లాలో 729 గ్రామ పంచాయతీల్లో గ్రామసభలు జరుగుతున్నాయన్నారు. రెవెన్యూ సమస్యలు ఇక్కడే ఎక్కువగా వచ్చాయని, వాటి అవకతవకలపై ప్రత్యేక విచారణ చేపడతామని తెలిపారు. సదరం సర్టిఫికెట్లపై విచారణ చేస్తామని చెప్పారు. ప్రతి సోమవారం కనిగిరిలో ప్రత్యేకంగా మీ కోసం కార్యక్రమం నిర్వహిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం వివిధ సమస్యలపై ప్రజలు వినతిపత్రాలు అందజేశారు. విద్యార్థిని రమ్య మాట్లాడుతూ గ్రామానికి రోడ్డు, విద్యుత్‌ సౌకర్యం కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమాల్లో సర్పంచ్‌ శ్రీరాం పద్మావతి, ఉప సర్పంచ్‌ నరసయ్య, డీపీవో ఉషారాణి, జిల్లా షీప్‌ సొసైటి చైర్మన్‌ తోడేటి గోపి, డ్వామా పీడీ అర్జునరావు, ఆడ్డీవో పాలపర్తి జాన్‌ఇర్విన్‌, తహసీల్దార్‌ ఆంజనేయరెడ్డి, ఎంపీడీవో రామచంద్రరావు, ప్రత్యేకాధికారి విద్యాసాగర్‌, రిటైర్డు ఐఏఎస్‌ పిడుగు బాబురావు, ఏపీడీ రాజారావు, టీడీపీ మండల అధ్యక్షుడు బొమ్మనబోయిన వెంగయ్య, మాజీ ఎంపీపీ అల్లురయ్య, బోయిళ్ల నారాయణరెడ్డి, పాలకొల్లు వెంకటేశ్వరరెడ్డి, మాలకొండయ్య, దొడ్డా వెంకటసుబ్బారెడ్డి పాల్గొన్నారు.

గ్రామ సర్వతోముఖాభివృద్దే కూటమి ప్రభుత్వ లక్ష్యం : ఎమ్మెల్యే ఉగ్ర

కనిగిరి ఆగస్టు 23 : మండలపరిధిలోని చాకిరాల గ్రామమలో జరిగిన గ్రామసభలో ఎమ్మెల్యే ఉగ్రనరసింహారెడ్డి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు.

Updated Date - Aug 24 , 2024 | 01:15 AM