Share News

ఎన్నికలు పూర్తయితేనే రెవెన్యూ సేవలు..!

ABN , Publish Date - Apr 12 , 2024 | 01:37 AM

ఎన్నికలు పూర్తయ్యే వరకు మండలంలో రెవెన్యూ సేవలు అందే పరిస్థితి కనిపించడం లేదు. ఎవరికైనా అత్య వసరంగా పనులు కావాల్సి వస్తే పెద్ద మొత్తంలో కప్పం కట్టాల్సి వస్తోంది.

ఎన్నికలు పూర్తయితేనే  రెవెన్యూ సేవలు..!

కొమరోలు, ఏప్రిల్‌ 11: ఎన్నికలు పూర్తయ్యే వరకు మండలంలో రెవెన్యూ సేవలు అందే పరిస్థితి కనిపించడం లేదు. ఎవరికైనా అత్య వసరంగా పనులు కావాల్సి వస్తే పెద్ద మొత్తంలో కప్పం కట్టాల్సి వస్తోంది. కార్యాలయానికి రావాలంటే కారుకు డీజిల్‌ కొట్టించాలని ముందుగానే మామూళ్లు వసూలు చేస్తున్నారు.

ఎన్నికల ముందు తహసీల్దార్‌గా ఉన్న రమాదేవిని ఎన్నికల కమిషన్‌ ఆదేశాల మేరకు బదిలీ చేశారు. అనంతరం బేస్తవారిపేట తహసీల్దార్‌ఇన్‌చార్జ్‌గా వచ్చారు. అయితే తాను ఎన్నికల విధుల కోసం మాత్రమే వచ్చా నని మిగిలిన విధులు చేయనని చెప్పారు. దీనిపై ఫిర్యాదులు రావడంతో ఇక్కడే ఉన్న డిప్యూటీ తహసీల్దార్‌ మల్లిఖార్జునరావుకు ఇన్‌చార్జ్‌ తహసీల్దార్‌గా బాధ్యతలు అప్పగిస్తూ, జిల్లా కలెక్టర్‌ ఉత్తర్వులు ఇచ్చారు. ఆయన తహసీల్దార్‌గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి కార్యాలయానికి ఎప్పుడు వస్తారో..? ఎప్పుడు వెళ్తారో..? కార్యాలయంలో పనిచేస్తున్న సిబ్బందికి కూడా తెలియని పరిస్థితి నెలకొంది. దీంతో విద్యార్థులకు అవసమైన ఈడబ్య్లూ ఎస్‌, ఓబీసీ, కులం, ఆదాయం వంటి ధ్రువపత్రాల కోసం సచివాలయాల్లోనూ దరఖాస్తు చేసుకున్న అప్లికేషన్లు, బ్యాంకుల్లో రుణాల కోసం 1బీల కోసం దరఖాస్తు చేస్తున్న రైతులు ఆయన కోసం ఎదురు చూడాల్సి వస్తోంది. ఆయన కార్యాల యానికి రావాలంటే ముందుగానే కారుకు డీజిల్‌ కొట్టాలని పలువురు వీఆర్‌వోలు రైతులకు చెబుతుం డడం గమనార్హం. దీంతో డబ్బులు ఇవ్వని రైతులు, విద్యార్థులను నానా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ప్రస్తుతం రిజిస్ట్రార్‌ కార్యాలయంలో ఒక సర్యే నెంబరులో ఒక భాగం రిజిస్టర్‌ అయితే ఆ సర్వే నెంబరు మొత్తం రెడ్‌మార్కు పడి 1బీ రావడం లేదు. ఈ విష యం తెలియని రైతులు తమ పొలం ఆన్‌లైన్‌లో లేదని రెవెన్యూ అధికారులకు తెలియజేసినా, ఎలాంటి ప్రయోజనం కనిపించడం లేదు. ఈ సమస్యపై ఎవరైనా రైతు లు వీఆర్‌వోల వద్దకు వెళితే.. కారులో పెట్రోలు పోయించండి, రేపు కార్యాలయంలో ఫక్షన్‌ వుంది అంటూ డబ్బు లు డిమాండ్‌ చూస్తూ ఇబ్బందులు పెడుతున్నారు.

స్థానికంగా ఉండని అధికారులు

కొమరోలు మండలంలో పనిచేస్తున్న మండల అధికారులు, గ్రామస్ధాయి అధికారులు విధిగా స్థానికంగా ఉండాలి. ప్రభుత్వం వారికి డీఏ, హెచ్‌ఆర్‌ఏ అలవెన్సులు ఇస్తుంది. వాటిని అనుభవిస్తున్న తహసీల్దార్‌ గిద్దలూరులో నివాసం ఉంటున్నాడు. ప్రజలెవరైనా సమస్యలపై వస్తే వారిని అక్కడికే పిలిపించుకొని పంచాయతీలు చేస్తూ, కాలం వెలిబుచ్చుతున్నారు. ఇక విద్యార్థులకు, మాముళ్లు ముట్టజెప్పని రైతులకు సమస్యలు తప్పడం లేదు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ప్రస్తుత తహ సీల్దార్‌ తీరుపై విచారించి చర్యలు తీసుకోవాలని కోరుతు న్నారు. కొమరోలుకు రెగ్యులర్‌ తహసీల్దార్‌ను నియమించాలని సూచిస్తున్నారు.

Updated Date - Apr 12 , 2024 | 01:37 AM