Share News

చివర్లో పేదలు గుర్తుకొచ్చారా?

ABN , Publish Date - Feb 12 , 2024 | 11:46 PM

నాలుగున్నరేళ్లుగా కానరాని పేదలు వారం పదిరోజుల్లో ఎన్నికల కోడ్‌ వస్తుందని తెలిసి గుర్తుకొచ్చారు. మాయ చేసేందుకే ఇప్పటికిప్పుడు పట్టాలంటున్నారు. అది సాధ్యపడదని తెలిసి టీడీపీపై నిందలు వేస్తున్నారు. ఐదుసార్లు ఎమ్మెల్యే, రెండుసార్లు మంత్రి అంటా వు.. ఒకసారి రోజు నీళ్లు ఇవ్వకపోతే పోటీ చేయనంటావు. ఇంకోసారి పట్టాలు ఇవ్వకపోతే, మరోసారి మాగుంట లేకపోతే పోటీ చేయనంటావు. నీ చేతకానితనాన్ని తెలుగుదేశంపై నెడతావు. పేదలకు పట్టాలను టీడీపీ అడ్డుకోదు. మం చిపనిని ఎప్పుడు స్వాగతిస్తుంది. నిబంధనలు తెలియవా? నీ మాయ మాటల ను ప్రజలు గుర్తిస్తున్నారని తెలిసి అదేమంటే నా ఇల్లు, ఆంధ్రజ్యోతి ఆఫీ్‌సను ముట్టడిస్తా అని బెదిరిస్తే ఎవరూ భయపడరు.. పిల్ల రాజకీయాలు మానుకో..’ అంటూ ఎమ్మెల్యే బాలినేనిపై టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు దామచర్ల జనార్దన్‌ ఫైర్‌ అయ్యారు. సోమవారం స్థానిక పీఏజీ కన్వెన్షన్‌ హాలులో జరిగిన జయహో బీసీ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.

చివర్లో పేదలు గుర్తుకొచ్చారా?
జయహో బీసీ సదస్సులో జనార్దన్‌

మాయమాటలు చెప్పి మోసం చేయడం మానుకో

పేదలకు పట్టాలను టీడీపీ అడ్డుకోదు, స్వాగతిస్తుంది

నా ఇల్లు.. ఆంధ్రజ్యోతిని ముట్టడిస్తామంటే. ఇక్కడెవరూ భయపడరు

ఒంగోలు ఎమ్మెల్యే బాలినేనిపై దామచర్ల ఫైర్‌

ఒంగోలు (కార్పొరేషన్‌), ఫిబ్రవరి 12 : ‘నాలుగున్నరేళ్లుగా కానరాని పేదలు వారం పదిరోజుల్లో ఎన్నికల కోడ్‌ వస్తుందని తెలిసి గుర్తుకొచ్చారు. మాయ చేసేందుకే ఇప్పటికిప్పుడు పట్టాలంటున్నారు. అది సాధ్యపడదని తెలిసి టీడీపీపై నిందలు వేస్తున్నారు. ఐదుసార్లు ఎమ్మెల్యే, రెండుసార్లు మంత్రి అంటా వు.. ఒకసారి రోజు నీళ్లు ఇవ్వకపోతే పోటీ చేయనంటావు. ఇంకోసారి పట్టాలు ఇవ్వకపోతే, మరోసారి మాగుంట లేకపోతే పోటీ చేయనంటావు. నీ చేతకానితనాన్ని తెలుగుదేశంపై నెడతావు. పేదలకు పట్టాలను టీడీపీ అడ్డుకోదు. మం చిపనిని ఎప్పుడు స్వాగతిస్తుంది. నిబంధనలు తెలియవా? నీ మాయ మాటల ను ప్రజలు గుర్తిస్తున్నారని తెలిసి అదేమంటే నా ఇల్లు, ఆంధ్రజ్యోతి ఆఫీ్‌సను ముట్టడిస్తా అని బెదిరిస్తే ఎవరూ భయపడరు.. పిల్ల రాజకీయాలు మానుకో..’ అంటూ ఎమ్మెల్యే బాలినేనిపై టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు దామచర్ల జనార్దన్‌ ఫైర్‌ అయ్యారు. సోమవారం స్థానిక పీఏజీ కన్వెన్షన్‌ హాలులో జరిగిన జయహో బీసీ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.

ఎన్నికలపుడు హామీ ఇవ్వడం.. చేయలేక టీడీపీపైకి నెట్టడం

ఎమ్మెల్యే బాలినేని ప్రతిసారి ఎన్నికల సమయంలో ఏదో ఒక హామీ ఇవ్వ డం చేయలేక తన చేతగానితనాన్ని టీడీపీపైకి నెట్టడం అలవాటుగా మారిందని జనార్దన్‌ మండిపడ్డారు. టెండర్లు తెరవకుండా పనులు చేయడం వెనుక ఆంతర్యం ఏమిటన్నారు? నిబంధనల ప్రకారం పనులు జరిగితే కోర్టులు కూ డా న్యాయమైన తీర్పు ఇస్తాయన్నారు. సొంత డబ్బుతో పెన్షన్‌లు, ఇళ్ల పట్టా లు అంటూ చెప్పడానికి నువ్వేమైనా రాజువా.. ఏం వ్యాపారాలు చేసి అంత డబ్బులు పెడుతున్నారు. అంత శ్రద్ధ ఉంటే నగరంలో అభివృద్ధి పనులు సొం తంగా ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. పోతురాజు కాలువ ఎందుకు పూర్తిచేయలేదని ప్రశ్నించావ్‌.. ప్రతీది ప్రజల కోసం అంటావుగా మరి సొంత డబ్బుతో బాగు చేయవచ్చు కదా అని ఎద్దేవా చేశారు.

మెప్మాలో స్కాంను మేయర్‌ ఒప్పుకున్నారు

ఇటీవల ఆంధ్రజ్యోతిలో మెప్మాలో కుంభకోణం వెలుగులోకి వచ్చిందని జనార్దన్‌ చెప్పారు. వాస్తవమేనని మేయర్‌ కూడా స్వయంగా ఒప్పుకున్నారు. దీనిపై తాము పూర్తిస్థాయి విచారణ కోరామని, బాధ్యులపై చర్యలుంటాయని తెలిపారు. కార్పొరేషన్‌లో అధికారులు, వైసీపీ కార్పొరేటర్లు దోచుకుంటున్నారన్నారు. తాము అధికారంలోకి రాగానే మొత్తం కక్కిస్తామన్నారు.

ఇల్లు ముట్టడిస్తే ఇక్కడెవరూ భయపడరు

ఎమ్మెల్యే చేతగానితనాన్ని ప్రశ్నిస్తే మైండ్‌ పోయి మాట్లాడుతున్నారని, ఇ ళ్లు, పత్రికల కార్యాలయాలు ముట్టడిస్తామని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. 75వేల మందితో ఇల్లు ముట్టడిస్తే తామేమైనా చేతకాని వారమా? మాకు లేరా లక్షల్లో జనం అంటూ ధ్వజమెత్తారు.చేతనైతే న్యాయంగా పేదలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలన్నారు. పట్టాలు ఇస్తే తాము కూడా స్వాగతిస్తామని, ఎందుకు అడ్డుకుంటామన్నారు. ఈనెల 25లోపు పట్టాలు ఇచ్చి నిరూపించుకోవాలని డిమాండ్‌ చేశారు.

Updated Date - Feb 12 , 2024 | 11:46 PM