నోటి సమస్యల నుంచి విముక్తి
ABN , Publish Date - Apr 03 , 2024 | 10:34 PM
నోటి నుంచి వచ్చే అతి భయంకరమైన రోగముల నుంచి ప్రజలు విముక్తి పొందాలని పలువురు వైద్యాధికారులు పిలుపునిచ్చా రు. బుధవారం స్థానిక ఏరియా వైద్యశాలలో హాస్పిటల్ దంత వైద్య నిపుణు లు డా.సునయన, జిల్లా పొగాకు నియంత్రణ అధికారి రమేష్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

జిల్లా హాస్పిటల్‌లో నోటి కేన్సర్‌ను గుర్తించే పరికరం ఏర్పాటు
ప్రజలు వినియోగించుకోవాలని వైద్యాధికారులు పిలుపు
చీరాలటౌన్, ఏప్రిల్ 3 : నోటి నుంచి వచ్చే అతి భయంకరమైన రోగముల నుంచి ప్రజలు విముక్తి పొందాలని పలువురు వైద్యాధికారులు పిలుపునిచ్చా రు. బుధవారం స్థానిక ఏరియా వైద్యశాలలో హాస్పిటల్ దంత వైద్య నిపుణు లు డా.సునయన, జిల్లా పొగాకు నియంత్రణ అధికారి రమేష్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ నోటి ద్వారా సంక్రమించే కేన్సర్‌ను ముందుగానే గుర్తించే వెల్‌స్కోప్ పరికరం ఇక నుంచి బాపట్ల జిల్లా ఆసుపత్రిలో అందుబాటులో ఉన్నట్లు వివరించారు. దీని కి సంబంధించి స్ర్కీనింగ్ క్యాంపును నిర్వహించారు. పలువురికి సంబంధిత ప రీక్షలు నిర్వహించారు. ప్రజలు సమస్యలు ఎదుర్కొంటున్నట్లయితే నేరుగా జి ల్లా హాస్పిటల్‌ను సంప్రదించాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా కో-ఆర్డినేటర్ ఆఫ్ హాస్పిటల్స్ డా.శేషుకుమార్, ఏరియా హాస్పిటల్ సూపరిండెంట్ డా.సుభాషిణి, జిల్లా దంత వైద్యులు డా.శశికుమార్, నర్సింగ్ ఫ్యాకల్టీలు, హాస్పిటల్ సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు.