Share News

నేటి నుంచి టీచర్ల సర్వీసు క్రమబద్ధీకరణ

ABN , Publish Date - May 07 , 2024 | 01:12 AM

జిల్లాలో డీఎస్సీ ద్వారా ఎంపికై ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న వారి సర్వీసు క్రమబద్ధీకరణ ప్రక్రియ మంగళవారం నుంచి ప్రారం భంకానుంది.

నేటి నుంచి టీచర్ల సర్వీసు క్రమబద్ధీకరణ

ప్రతిపాదనల పరిశీలనకు ఆరు ప్రత్యేక బృందాలు ఏర్పాటు

ఒంగోలు (విద్య), మే 6 : జిల్లాలో డీఎస్సీ ద్వారా ఎంపికై ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న వారి సర్వీసు క్రమబద్ధీకరణ ప్రక్రియ మంగళవారం నుంచి ప్రారం భంకానుంది. అందుకు అవసరమైన ఏర్పాట్లను స్థానిక సమగ్ర శిక్ష జిల్లా ప్రాజెక్టు కార్యాలయంలో చేశారు. టీచర్ల క్రమబద్ధీకరణ ప్రతిపాదనలను పరిశీలించేందుకు ఆరు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఈ బృందంలో హైస్కూల్‌ హెచ్‌ఎం ఒకరు, స్కూలు అసి స్టెంట్‌ ఒకరు, డీఈవో కార్యాలయ సిబ్బంది ఒకరు ఉన్నారు. జిల్లాలో డీఎస్సీ ద్వారా ఎంపికై ఇప్పటి వరకూ సర్వీసు క్రమబద్ధీకరణ కాని సుమారు 600 మం ది టీచర్ల సర్వీసులను రెగ్యులరైజేషన్‌ చేయనున్నారు. ఈనెల 10వతేదీ వరకు ఈ ప్రక్రియ కొనసాగనుంది.

Updated Date - May 07 , 2024 | 01:12 AM