పోలీసు బందోబస్తు మధ్య మండల సమావేశం
ABN , Publish Date - Jul 28 , 2024 | 10:52 PM
పోలీసు బందోబస్తు మధ్య ముండ్లమూరు మండల సర్వసభ్య సమావేశం ప్రశాంతంగా సాగింది. సమావేశానికి ఎంపీపీ సుంకర సునీత అధ్యక్షత వహించారు. అయితే, వైసీపీకి చెందిన ఆరుగురు ఎంపీటీసీ సభ్యులు శనివారం టీడీపీలో చేరారు. ఈక్రమంలో మండ ల సమావేశంలో ఇరువర్గాల మధ్య ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తే పరిస్థితి ఏర్పడటంతో పోలీసులు ముందుజాగ్రత్తగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు.

కార్యాలయానికి చేరుకున్న టీడీపీ, వైసీపీ వర్గీయులు
బయటకు పంపించివేసిన పోలీసులు
ముండ్లమూరు, జూలై 28: పోలీసు బందోబస్తు మధ్య ముండ్లమూరు మండల సర్వసభ్య సమావేశం ప్రశాంతంగా సాగింది. సమావేశానికి ఎంపీపీ సుంకర సునీత అధ్యక్షత వహించారు. అయితే, వైసీపీకి చెందిన ఆరుగురు ఎంపీటీసీ సభ్యులు శనివారం టీడీపీలో చేరారు. ఈక్రమంలో మండ ల సమావేశంలో ఇరువర్గాల మధ్య ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తే పరిస్థితి ఏర్పడటంతో పోలీసులు ముందుజాగ్రత్తగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు. ఉదయం 11.25 గంటలకు మండల సమావేశం ప్రారంభంకాగానే సతులకు బదులు పతులు రావటంతో ఎంపీడీవో ఆర్.జనార్దన్ జోక్యం చేసుకొని సభ్యులు కానివారు వెళ్ళిపోవాలని పదేపదే ఆదేశించారు. చివరికి చేసేదేమిలేక హాల్ లో నుంచి బయటకు వెళ్ళిపోయారు. అదేసమయంలో ఎంపీపీ హాల్‌లో వైసీపీ నాయకులు, ఎంపీడీవో కార్యాలయ గదిలో టీడీపీ నాయకులు, కార్యాలయం ముందు ఇరువర్గాలు గుమిగూడారు. ఈక్రమంలో ఎస్‌ఐ నాగమల్లేశ్వరరావు తన సిబ్బందితో వెళ్ళి ఇరువర్గాలను కార్యాలయంలో నుంచి బయటకు పంపారు. బయట ఉన్న వ్యక్తులను కూడా పంపిం చివేయడంతో ఎలాంటి సమస్య లేకుండా మండల సర్వసభ్య సమావేశం సజావుగా జరిగింది.
మొదట వ్యవసాయ శాఖపై జరిగిన సమీక్షలో ఏవో మహమ్మద్ ఫరూక్ మాట్లాడుతూ అర్హత ఉన్న కౌలు రైతులకు కార్డులు మంజూ రుచేస్తున్నట్టు చెప్పారు. ఇప్పటికే 150 మందికి కార్డులు ఇచ్చినట్టు చెప్పారు. విద్యుత్ శాఖ ఏఈ వీర బ్రహ్మం మాట్లాడుతున్నక్రమంలో నూజెండ్లపల్లి ఎంపీటీసీ టి.బ్రహ్మం, మారెళ్ళ ఎంపీటీసీ పి.సుబ్బారావు జూనియర్ లైన్‌మెన్‌లు, ఎనర్జీ అసిస్టెం ట్‌లు అందుబాటులో ఉండటం లేదని తెలిపారు. దీంతో ప్రజలు ఇబ్బందు లు పడుతున్నట్టు చెప్పారు. ఏపీవో నాగరాజు మాట్లాడుతూ జాబ్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి వంద రోజుల పాటు పని దినాలు కల్పిస్తామన్నారు. పండ్ల తోటల రైతులకు రాయితీలు కల్పించి సాగును ప్రోత్సహిస్తున్నట్టు చెప్పారు. సమావేశంలో జడ్పీటీసీ టి.రత్నరాజు, పశువైద్యాధికారి విజ యలక్ష్మి, డిప్యూటీ తహసీల్దార్ జి.పుల్లారెడ్డి, పంచాయతీరాజ్ ఏఈ ఎం. వెంకటేశ్వర్లు, ఈవోఆర్‌డీ శ్రీదేవి, వైస్ ఎంపీపీ వేముల పద్మ, బంకా రమణ మ్మ, ఎంపీ టీసీలు పాలపర్తి సుబ్బారావు, తేలుకుట్ల బ్రహ్మయ్య, నాగమల్లి అంకారావు, పెదఅంజయ్య, తులసీబాయి, మహేశ్వరి, వెంకటేశ్వర్లు, గుణ పాటి వెంకటేశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు.