Share News

ప్రజాసమస్యలకు ప్రతిరూపాలు.. నాటికల ప్రదర్శనలు

ABN , Publish Date - Jan 14 , 2024 | 11:07 PM

ప్రజల సమస్యలను కళాకారులు కళా పరిషత్‌ లద్వారా వెలుగులోకి తీసుకువస్తున్నారని, ప్రజలను ఆలోచింపచేసే నాటికలు సమాజంలో మార్పును తీసుకురావాలని ప్రముఖనవలా రచయత్రి చంద్రలత అన్నారు. యద్దనపూడి మండలంలోని అనంతవరం గ్రామంలో నాల్గవ రోజు ఆదివారం రాత్రి ఎన్టీఆర్‌ కళా పరిషత్‌ నాటికలను ప్రదర్శించారు. ముఖ్యఅతిఽథిగా విచ్చేసిన చి లకలూరిపేట మాజీ ఎమ్మెల్యే కందిమళ్ల జయమ్మ నటరాజ విగ్రహానికి జ్యోతి ప్రజ్వలన చేయగా, ఆహుతులను కందిమళ్ల సాంబశివరావు వేదికపైకి ఆహ్వానించారు. సభకు నవ్యాంద్ర రచయిత్రుల గౌరవ అధ్యక్షురాలు తేళ్ల అరుణ అధ్యక్షత వహించగా, ప్రముఖ నవలా రచయిత్రి చంద్రలతను సత్కరించారు.

 ప్రజాసమస్యలకు ప్రతిరూపాలు.. నాటికల ప్రదర్శనలు
నవలా రచయిత్రి చంద్ర కళ ను సత్కరిస్తున్న కళా పరిషత్‌ సభ్యులు

యద్దనపూడి(మార్టూరు), జనవరి 14: ప్రజల సమస్యలను కళాకారులు కళా పరిషత్‌ లద్వారా వెలుగులోకి తీసుకువస్తున్నారని, ప్రజలను ఆలోచింపచేసే నాటికలు సమాజంలో మార్పును తీసుకురావాలని ప్రముఖనవలా రచయత్రి చంద్రలత అన్నారు. యద్దనపూడి మండలంలోని అనంతవరం గ్రామంలో నాల్గవ రోజు ఆదివారం రాత్రి ఎన్టీఆర్‌ కళా పరిషత్‌ నాటికలను ప్రదర్శించారు. ముఖ్యఅతిఽథిగా విచ్చేసిన చి లకలూరిపేట మాజీ ఎమ్మెల్యే కందిమళ్ల జయమ్మ నటరాజ విగ్రహానికి జ్యోతి ప్రజ్వలన చేయగా, ఆహుతులను కందిమళ్ల సాంబశివరావు వేదికపైకి ఆహ్వానించారు. సభకు నవ్యాంద్ర రచయిత్రుల గౌరవ అధ్యక్షురాలు తేళ్ల అరుణ అధ్యక్షత వహించగా, ప్రముఖ నవలా రచయిత్రి చంద్రలతను సత్కరించారు. కార్యక్రమంలో కళాపరిషత్‌ అధ్యక్షుడు గుదే పాండురంగారావు, గుదే తారక రామారావు, నిమ్మల సాంబశివరావు, పెడవల్లి కల్యాణ చక్రవర్తి, పెడవల్లి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

అనంతరం మూడు నాటికలను ప్రదర్శించారు. న్యూ స్టార్‌ మోడరన్‌ థియేటర్‌ ఆర్ట్స్‌ విజయవాడ వారు ప్రదర్శించిన కపిరాజు నాటికను, శ్రీకారం రోటరీ కళా పరిషత్‌ మార్టూరు వారు రైతు భారతం నాటికను, రసఝురి పొన్నూరు వారిచే కాపలా నాటికను ప్రదర్శించారు. సోమవారం జరిగే కార్యక్రమంలో ముఖ్యఅతిథులుగా సినీ దర్శకులు అనిల్‌ రావిపూడి, గోపీచంద్‌ మలినేని, సినీ నటుడు అజయ్‌ ఘోష్‌ పాల్గొంటారు.

ఆలోచన రేకెత్తిస్తున్న నాటికల పోటీలు

వీరన్నపాలెం(పర్చూరు), జనవరి 14: పర్చూరు మండలం వీరన్నపాలెం గ్రామంలో కళానికేతన్‌ కళాపరిషత్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జాతీయస్ధాయి ఆహ్వాన నాటిక పోటీలు ఆలోచన రేకెత్తించే విధంగా సాగుతున్నాయి. ఈపోటీలను గ్రామానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త కళాపరిషత్‌ గౌరవ ఆధ్యక్షులు గోరంట్ల రమేష్‌బాబు సారధ్యంలో పోటీలను శనివారం రాత్రి ప్రారంభించారు. ఈసందర్బంగా రమేష్‌బాబు మాట్లాడుతూ సంక్రాంతి సంబరాల్లో ప్రజలకు వినోదాన్ని ఆహ్లాదాన్ని కల్గించేందుకు గ్రామస్తుల కృషితో జాతీయస్ధాయి నాటిక పోటీలను ఏర్పాటు చేయటం జరిగిందన్నారు. ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న పరిస్థితులను కళ్ళకు కట్టినట్లు చూపటంతో కళాకారుల కృషి అనలేదని అయన కొనియాడారు. కార్యక్రమంలో భాగంగా ఆదివారం నిర్వహించిన మూల్యం నాటిక ప్రేక్షకులను ఎంతగానో అలోచింప జేసింది. నేటి సమాజంలో అడపిల్లల మీద అడుగడుగునా, విధించ బడుతున్న ఆంక్షలు, వివాహం అయిన తరువాత కూడా ఆమె పడుతున్న భాదతను మూల్యం నాటిక ద్వారా దర్శకుడు వెంకట్‌ గోవాడ నాటిక ద్వారా చూపారు. జాతీయస్ధాయి నాటిక పోటీలను తిలకించేందుకు పెద్ద ఎత్తున ఆయా గ్రామాల నుండి ప్రజలు తరలి రావటంతో వీరన్నపాలెంలో సందడి వాతావరణం నెలకొంది.

Updated Date - Jan 14 , 2024 | 11:08 PM