Share News

నవ్యాంధ్ర పునర్నిర్మాణం చంద్రబాబుకే సాధ్యం

ABN , Publish Date - Apr 22 , 2024 | 12:08 AM

నవ్యాంధ్రప్రదేశ్‌ పునర్నిర్మాణం టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడికే సాధ్యమని కొండపి శాసన సభ్యులు, నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి డాక్టర్‌ డోలా శ్రీబాల వీరాంజనేయ స్వామి అన్నారు. ఆదివారం ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా కూచిపూడిలో జరిగిన సభలో ఆయన మాట్లాడారు. వైసీపీ పాలనలో రాష్ట్రం అధోగతిపాలైయిందని విమర్శించారు. రాజధాని లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ దేశ చరిత్రలో నిలిపిన ఘనత ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డికే దక్కుతుందని ఎద్దేవా చేశారు. వైసీపీ అరాచక పాలనతో రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు లేకుండా పోయాయని చెప్పారు. దీంతో పల్లెసీమల్లో ప్రజలు వలసబాట పట్టడంతో కళావిహీనంగా మారిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు.

నవ్యాంధ్ర పునర్నిర్మాణం చంద్రబాబుకే సాధ్యం
కూచిపూడిలో కదం తొక్కిన టీడీపీ శ్రేణులు (ఇన్‌సెట్లో) ప్రచార కార్యక్రమంలో మాట్లాడుతున్న స్వామి

మర్రిపూడి, ఏప్రిల్‌ 21 : నవ్యాంధ్రప్రదేశ్‌ పునర్నిర్మాణం టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడికే సాధ్యమని కొండపి శాసన సభ్యులు, నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి డాక్టర్‌ డోలా శ్రీబాల వీరాంజనేయ స్వామి అన్నారు. ఆదివారం ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా కూచిపూడిలో జరిగిన సభలో ఆయన మాట్లాడారు. వైసీపీ పాలనలో రాష్ట్రం అధోగతిపాలైయిందని విమర్శించారు. రాజధాని లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ దేశ చరిత్రలో నిలిపిన ఘనత ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డికే దక్కుతుందని ఎద్దేవా చేశారు. వైసీపీ అరాచక పాలనతో రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు లేకుండా పోయాయని చెప్పారు. దీంతో పల్లెసీమల్లో ప్రజలు వలసబాట పట్టడంతో కళావిహీనంగా మారిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఉపాధి పనుల కోసం బెంగళూరు, హైదరాబాదు వంటి నగరాలకు ప్రజలు వలస బాట పట్టారని పేర్కొన్నారు. నిరుద్యోగ యువత ఉపాధి లేక ఆత్మహత్యలకు పాల్పుడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. రాజీయ కక్షసాధింపు చర్యల్లో భాగంగా ప్రతిష్టాత్మకమైన పరిశ్రమలు సహితం రాష్ట్రం నుంచి తరలిపోవాల్సిన దుస్థితి నెలకొన్నదన్నారు. టీడీపీ అధికారంలోకి రావడం చారిత్రక అవసరమని గుర్తు చేశారు. టీడీపీ అధికారంలోకి రాగానే సూపర్‌ సిక్స్‌ పథకాలతో ప్రజల జీవన ప్రమాణాలు మెరుగు పరుస్తామని హామి ఇచ్చారు. ఉపాధి అవకాశాలు కల్పించే వరకు నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి అందిచనున్నట్లు తెలిపారు. విభిన్న ప్రతిభావంతులకు నెలకు రూ.6000 పింఛను ఇవ్వనున్నట్లు వెల్లడించారు. వైసీపీ పాలనలో అభివృద్ధి శూన్యంగా మారిందన్నారు. గత ప్రభుత్వ హయాంలో టంగుటూరు, పొదిలి ఆర్‌అండ్‌బీ రహదారి అభివృద్ధికి రూ.39 కోట్ల నిధులు మంజూరు చేయిస్తే పనులు చేపట్టలేని అసమసర్థ ప్రభుత్వమని మండిపడ్డారు. కూచిపూడి- గార్లపేట రహదారి నిర్మాణానికి రూ. 7 కోట్ల నిధులు మంజూరు అయినప్పటికి గత ఐదేళ్లుగా నత్తనడకన సాగుతున్నాయని అన్నారు. ఒకసారి అవకాశం ఇస్తే నియోజకవర్గాన్ని ప్రథమ స్థానంలో నిలుపుతానని మంత్రి సురేష్‌ చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో ప్రజా వ్యతిరేకతను మూటకట్టుకున్న మంత్రి కొండపి నియోజకవర్గంలో ఏదో సాధిస్తానని చెప్పడం అవివేకం అన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే స్వామికి మహిళలు, టీడీపీ శ్రేణులు పెద్దఎత్తున స్వాగతం పలికారు. మేళతాళాలతో, బాణసంచా కాలుస్తూ పూల వర్షం కురిపించారు. టీడీపీ శ్రేణులు ప్రచార పర్వంలో జెండాలు చేబూని కధం తొక్కారు. అనంతరం చెంచురెడ్డి పల్లెల్లో ఓటర్లను కలుసుకొని శాసన సభ్యులుగా తనతోపాటు పార్లమెంట్‌ అభ్యర్థి మాగుంట శ్రీనివాసులరెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాని అభ్యర్థించారు. కార్యక్రమంలో తెలుగురైతు రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఎర్రమోతు శ్రీనివాసులు, టీడీపీ మండల అఽధ్యక్షుడు చేరెడ్డి నరసారెడ్డి, టీడీపీ సమన్వయ కర్త రేగుల వీరనారాయణ, జడ్పీటీసీ మాజీ సభ్యులు తుళ్లూరి నరసింహారావు, మండల పరిషత్‌ మాజీ ఉపాఽధ్యక్షులు గొంటు హనుమారెడ్డి, టీడీపీ సీనియర్‌ నాయకులు ఎర్రంరెడ్డి వెంకటరెడ్డి, చిలకల కొండారెడ్డి, కర్ణాటి రమణారెడ్డి, భూమిరెడ్డి రమణారెడ్డి, గూడలి గౌరీశంకర శర్మ, చిరుపల్లి నరసింహం, మందా ఆనంద్‌, అంకమరావు, గడ్డం చిన్నయ్య, కొండలరావు, కే మెహన్‌రావు, ఎం. ఏడుకొండలు, బూదాల యేసుదాస్‌, గురుబ్రహ్మం తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 22 , 2024 | 12:08 AM