Share News

వైసీపీని సాగనంపేందుకు సంసిద్ధం

ABN , Publish Date - Feb 28 , 2024 | 01:06 AM

ప్రజా వ్యతిరేక విధా నాలతో కాలం వెళ్లదీసిన వైసీపీని సాగనంపేందుకు జనం సంసిద్ధమయ్యారని, ఎర్రగొండపాలెం టీడీపీ ఇన్‌చార్జ్‌ గూడూరి ఎరిక్షన్‌బాబు పేర్కొన్నారు.

వైసీపీని సాగనంపేందుకు సంసిద్ధం

పెద్ద దోర్నాల, ఫిబ్రవరి 27: ప్రజా వ్యతిరేక విధా నాలతో కాలం వెళ్లదీసిన వైసీపీని సాగనంపేందుకు జనం సంసిద్ధమయ్యారని, ఎర్రగొండపాలెం టీడీపీ ఇన్‌చార్జ్‌ గూడూరి ఎరిక్షన్‌బాబు పేర్కొన్నారు. మండలం లోని జమ్మిదోర్నాల గ్రామంలో ‘బాబు ష్యూరిటీ - భవిష్యత్తు గ్యారెంటీ’ కార్యక్రమాన్ని మంగళవారం సాయంత్రం నిర్వహించారు. ఈ సందర్భంగా గూడూరి ఎరిక్షన్‌బాబు గ్రామంలోని ప్రజలను కలిసి ప్రభుత్వం పేదప్రజలను మోసం చేసిందన్నారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడుచేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులను తెలియజెప్పారు. గ్రామాల్లో మౌలిక వసతుల ఏర్పాటు, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బీసీలకు రాజకీయ రిజర్వేషన్లతో పాటు ఆర్థిక తోడ్పాటు నిచ్చిందన్నారు. కార్పొరేషన్‌ ద్వారా విరివిగా రుణాలు మంజూరు, మహిళలకు ఆస్తిలో హక్కుచట్టం, డ్వాక్వా సంఘాల ఏర్పాటు, రైతులకు అండగా విపత్తుల నుంచి ఆదుకునేందుకు బీమా, పంట నష్ట పరిహారం అందజేత, యాంత్రీకరణ పథకం ద్వారా ట్రాక్టర్లు, పవర్‌స్ర్పేయర్లు, వ్యవసాయ ఉపకరణాలు అందజేసిన ఘనత టీడీపీదేనన్నారు. క్లిష్ట సమయాల్లో కూడా ట్యాంకర్లతో నీటిని అందించామని, నిరుద్యోగులకు భృతి, అర్హత కల్గిన ప్రతి ఒక్కరికీ ఫించన్లు మంజూరయ్యాయన్నారు. ఉన్నత విద్య, విదేశి విద్యకు కోట్ల రూపాయలు మంజూరు చేసినట్లు తెలిపారు. టీడీపీ, జనసేన సమన్వయంతో పేదల ప్రభుత్వం అధికారంలోకి వస్తోందన్నారు. విజన్‌ ఉన్న ప్రజా నాయకుడు చంద్రబాబు నాయుడు తిరిగి రాష్ట్రానికి పూర్వ వైభవం తెస్తాడన్నారు. కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు ఏర్వ మల్లికార్జునరెడ్డి, నాయకులు షేక్‌ మాబు, దొడ్డా శేషాద్రి, ఈదర మల్లయ్య, దేసు నాగేంద్రబాబు, చంటి, షేక్‌ సమ్మద్‌ బాషా, చల్లా వెంకటేశ్వర్లు, షేక్‌ ఇస్మాయిల్‌, షేక్‌ భాష, కె శ్రీనివాసులు, ఎలకపాటి చంచయ్య, సీనియర్‌ నాయకులు బట్టు సుధాకర్‌ రెడ్డి, ఆర్‌ సుబ్బరత్నం, నాగెళ్ల సత్యనారాయణ, షేక్‌ రఫీ,షేక్‌ మంజూర్‌ భాష, కె.సుబ్బారెడ్డి, మౌలాలి పాల్గొన్నారు.

టీడీపీలో 20 కుటుంబాల చేరిక

బాబు ష్యూరిటీ భవిష్యత్తు గ్యారంటీ పర్యటనలో భాగంగా ఎరిక్షన్‌బాబు సమక్షంలో మాజీ ఉప సర్పంచి సుభాని,షేక్‌ మంజూర్‌ భాష ఆధ్వర్యంలో దోర్నాల ఇందిరా నగర్‌కు చెందిన 20 ముస్లిం కుటుంబాలు టీడీపీలో చేరాయి. వీరికి ఎరిక్షన్‌బాబు పార్టీ కండువాలు కప్పి వారిని సాదరంగా ఆహ్వానించారు.

రాయవరంలో ‘భవిష్యత్తు గ్యారెంటీ’

మార్కాపురం రూరల్‌ : మండలంలోని రాయవరం గ్రామంలో ‘బాబు షూరిటీ-భవిష్యత్తు గ్యారెంటీ’ కార్య క్రమం నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి తనయుడు విఘ్నేష్‌రెడ్డి నాయకులతో కలిసి మంగళవారం రాత్రి నిర్వహించారు. ఈ సందర్భం గా గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ యువతకు ఉపాధి అవకాశాలు, స్కూళ్లకు వెళ్లే ప్రతి విద్యార్థికి తల్లికి వందనం, ప్రతి ఏటా రైతుకు ఆర్థిక సహాయం, ప్రతి ఇంటికి ఉచితంగా ఏడాదికి మూడు గ్యాస్‌ సిలిండర్లు అందిస్తామన్నారు. అలాగే ప్రతి మహిళకు నెలకు పదిహేను వందల రూపాయలు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకాలను అమలుజేస్తామన్నారు. కార్యక్రమంలో టీడీపీ మండల నాయకులు జవ్వాజి రామానుజలరెడ్డి, బొగ్గు శేఖర్‌రెడ్డి, మాజీ మార్కెట్‌ యార్డు ఛైర్మన్‌ కాకర్ల శ్రీనివాసులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

కొమరోలు : బడుగు బలహీనవర్గాల సంక్షేమం టీడీపీతోనే సాధ్యమని మాజీ ఎంపీటీసీ సభ్యులు ముత్తుముల సంజీవరెడ్డి అన్నారు. మండలంలోని యర్రగుంట్ల, అల్లీనగరం గ్రామాల్లో ‘బాబు ష్యూరిటీ-భవిషత్తుకు గ్యారెంటీ’ కార్యక్రమాన్ని గిద్దలూరు నియోజకవర్గ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి ఆదేశాలమేరకు టీడీపీ నాయకులు నిర్వహించారు. ఈ సందర్భంగా సంజీవరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రాభివృద్ధి, ప్రజలకు సంక్షేమం చంద్రబాబుకే సాద్యమన్నారు. రానున్న ఎన్నికల్లో ప్రజలంతా అరాచక వైసీపీ ప్రభుత్వానికి తగిన బుధ్ధి చెప్పాలన్నారు. రాష్ట్రంలో అబద్దపు హామీలతో అధికారంలోకి వచ్చి రాక్షస పాలన చేస్తున్నజగన్‌రెడ్డి పని అయిపోయిందన్నారు. కార్యక్రమంలో మహిళలు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. ఇంటిటికి తిరిగి బాబుష్యూరిటీ-భవిషత్తుకు గ్యారెంటీ బాండ్లు పంపిణీచేశారు. కార్యాక్రమంలో టీడీపీ మండల ఉపాద్యక్షులు బిజ్జాల తిరుమలరెడ్డి, నాయకులు సాయి, ప్రవీణ్‌, వెంకటసుబ్బయ్య, రామస్వామి, నక్కా రమణ, సయ్యద్‌ రఫి, పుల్లయ్య, సుబ్బరాయుడు, చిన్న తిరుమయలయ్య, బాలయ్య, అల్లురయ్య పాల్గొన్నారు.

Updated Date - Feb 28 , 2024 | 01:07 AM