దొనకొండ విమానాశ్రయాన్ని పరిశీలించిన ఆర్డీవో
ABN , Publish Date - Jul 16 , 2024 | 10:19 PM
కలె క్టర్ ఆదేశాల మేరకు కనిగిరి రెవె న్యూ డివిజనల్ అధికారి పి.జాన్ ఇర్విన్ మంగళవారం దొనకొండలోని విమానా శ్రయాన్ని పరిశీలించారు. ఇందుకుసంబంధించిన భూములను నిశితంగా పరిశీలించారు. ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామూ ర్తినాయుడు భోగాపురం విమానాశ్ర యం పరిశీలనలో రాష్ట్రంలో ఉన్న విమానాశ్రయాల వివరాల గురించి సంబంధిత అధికారుల నుంచి తెలు సుకున్నారు.
దొనకొండ, జూలై 16: కలె క్టర్ ఆదేశాల మేరకు కనిగిరి రెవె న్యూ డివిజనల్ అధికారి పి.జాన్ ఇర్విన్ మంగళవారం దొనకొండలోని విమానా శ్రయాన్ని పరిశీలించారు. ఇందుకుసంబంధించిన భూములను నిశితంగా పరిశీలించారు. ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామూ ర్తినాయుడు భోగాపురం విమానాశ్ర యం పరిశీలనలో రాష్ట్రంలో ఉన్న విమానాశ్రయాల వివరాల గురించి సంబంధిత అధికారుల నుంచి తెలు సుకున్నారు. దొనకొండల విమానాశ్రయ విషయాన్ని సీఎం, మంత్రి దృష్టికి అధికారులు తీసుకెళ్లారు. ఈనేపథ్యంలో దొనకొండలోని విమానాశ్రయంపై పూర్తి నివేదిక అంద జేయాలని జిల్లా కలెక్టర్ ఆర్డీవోకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఆర్డీవో జాన్‌ఇర్విన్ దొనకొండలోని విమానాశ్రయ భవనం, 136.36 ఎకరాల విస్తీ ర్ణంలో చుట్టూ ఫెన్సింగ్‌తో ఉన్న భూమిని పరిశీలించారు. గత టీడీపీ ప్ర భుత్వంలో దొనకొండలోని విమానాశ్రయం వినియోగం నిమిత్తం ఎయిర్ పోర్టు అథారిటీ వారు అదనంగా నరసింహనాయునిపాలెం, ఇండ్లచె రువు గ్రామాల పరిధిలో సర్వే చేసిన 240 ఎకరాలకు సంబందించిన భూ ముల వివరాలను మ్యాప్ ద్వారా పరి శీలించారు. ఆ భూముల్లో జీజీపీ భూ మి, బండిదారి, వాగు, చెరువు ఎంత విస్తీర్ణంలో ఉంది, అందులో ఏమైనా ఆక్రమణలు ఉన్నాయా, ఇంకా అదనంగా ఎటువైపు ఎన్ని ఎకరాల వరకు పొడిగించే అవకాశం ఉంది, పొలాల మధ్యలో ఉన్న తారురోడ్డు ఏఏ గ్రామాలకు వెళ్తుంది, ఆ గ్రా మాలకు వెళ్లేందుకు మరో మార్గం ఉందా తదితర పూర్తి సమాచారాన్ని అడిగి తెలుసుకున్నారు. దొనకొండ విమానాశ్రయ పూర్తి సమాచారంను క్లుపంగా నివేదిక సిద్ధంచేసి కలెక్టర్‌కు అందజేస్తామని ఆర్డీవో వివ రించారు.
ఆయన వెంట డిప్యూటీ తహసీల్దార్ శ్రీనివాసరా వు, వీఆర్వో ఐలూరి పిచ్చిరెడ్డి, మండల సర్వేయర్ మస్తాన్‌వలి, లైసెన్స్ సర్వేయర్ చెన్నంశెట్టి వెంకటరావు, రెవెన్యూ సిబ్బంది ఉన్నారు.