చీరాలలో రెచ్చిపోయిన రేషన్ దొంగలు
ABN , Publish Date - Oct 21 , 2024 | 11:56 PM
చీరాలలో రేషన్ మాఫియా రెచ్చిపోయింది. ఏ కంగా అర్ధరాత్రి చిరుదొంగపై అహంకారం చూపి దాడికి తెగబడ్డారు. ఈ ఘటన 216 జాతీయ రహదారిలోని హాయ్ రెస్టారెంట్ స మీపంలో చోటుచేసుకుంది. పేరాలకు చెందిన హరీష్ పోగు చేసిన సుమారు 80 బస్తాల రేషన్ బియ్యంను ఉప్పుగుండూరుకు వాహ నం ద్వారా అర్ధరాత్రి తరలిస్తున్నారు.
ఏకంగా అర్ధరాత్రి హైవేలో హల్‌చల్ 8 ఆపై కొట్లాట
ఆధిపత్య పోరులో సింహభాగం సిండికేట్ వ్యాపారి జులుం
దీంతో స్టేషన్‌ను ఆశ్రయించిన చిరుదొంగ
బాఽధితుడు పీడీఎఫ్ పత్రిక విలేకరి కావడం విశేషం
చీరాలటౌన్, అక్టోబరు 21 (ఆంధ్రజ్యోతి): చీరాలలో రేషన్ మాఫియా రెచ్చిపోయింది. ఏ కంగా అర్ధరాత్రి చిరుదొంగపై అహంకారం చూపి దాడికి తెగబడ్డారు. ఈ ఘటన 216 జాతీయ రహదారిలోని హాయ్ రెస్టారెంట్ స మీపంలో చోటుచేసుకుంది. పేరాలకు చెందిన హరీష్ పోగు చేసిన సుమారు 80 బస్తాల రేషన్ బియ్యంను ఉప్పుగుండూరుకు వాహ నం ద్వారా అర్ధరాత్రి తరలిస్తున్నారు. అయితే ఇప్పటికే సిండికేట్‌గా మారి రేషన్ మాఫియా డాన్‌గా హవా సాగిస్తున్న ఒంగోలుకు చెందిన ప్రసాద్, ఉప్పుగుండూరుకు చెందిన రాజా, మరో ఇద్దరు దారికాచి తెగబడ్డారు. కారులో వచ్చి సినిమా తరహాలో వెంటపడి పట్టుకున్నారు. క్రికెట్ వికెట్లతో విచ్చలవిడిగా దాడి చేశారు. చిరుదొంగ తరలిస్తున్న 80 బస్తాలు బియ్యంతో ఉడాయించారు. చిరుదొంగ హరీష్ టూటౌన్ పోలీసుల ను ఆశ్రయించాడు. ఇప్పటికే రెండు వర్గాలను విచారించిన పోలీసులు కేసు నమోదు చేసేందుకు మొగ్గు చూపినట్లు తెలుస్తుంది.