Share News

అవనిపై హరివిల్లు

ABN , Publish Date - Jan 08 , 2024 | 11:24 PM

అందమైన రంగవల్లులతో అవనిపై హరివిల్లు సౌందర్యం ఆవిష్కృతమైంది. సంక్రాంతి విశిష్టతను, పల్లె జీవనాన్ని తెలియజేస్తూ నారీమణులు వేసిన ముగ్గులు అందరినీ కట్టిపడేశాయి. ‘‘ఆంధ్రజ్యోతి-ఏబీఎన్‌ నిర్వహిస్తున్న కెనరా బ్యాంక్‌ ముత్యాల ముగ్గుల పోటీలు... పవర్డ్‌ బై ఎయిమ్స్‌ విద్యాసంస్థలు, బెంగళూరు... రియల్‌ పార్టనర్‌ స్వర్గసీమ సుకేతన’’ సారఽథ్యంలో కనిగిరిలో అమరావతి మెడికల్‌ సైన్సెస్‌ గుంటూరు ఎండీ, మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి సౌజన్యంతో సోమవారం నిర్వహించిన ముత్యాల ముగ్గుల పోటీలు ఉత్సాహభరితంగా జరిగాయి. 200 మంది తరుణీమణులు తరలివచ్చి వారిలోని సృతజనాత్మకతను వెలికితీసి మనోహరంగా ముగ్గులు వేశారు.

అవనిపై హరివిల్లు
కనిగిరిలో ముగ్గులు వేస్తున్న మహిళలు

ఆంధ్రజ్యోతి-ఏబీఎన్‌ ముత్యాల ముగ్గుల

పోటీలకు భారీ స్పందన

కనిగిరిలో నిర్వహణ

పెద్ద సంఖ్యలో తరలివచ్చిన మహిళలు

అందమైన రంగవల్లులతో అవనిపై హరివిల్లు సౌందర్యం ఆవిష్కృతమైంది. సంక్రాంతి విశిష్టతను, పల్లె జీవనాన్ని తెలియజేస్తూ నారీమణులు వేసిన ముగ్గులు అందరినీ కట్టిపడేశాయి. ‘‘ఆంధ్రజ్యోతి-ఏబీఎన్‌ నిర్వహిస్తున్న కెనరా బ్యాంక్‌ ముత్యాల ముగ్గుల పోటీలు... పవర్డ్‌ బై ఎయిమ్స్‌ విద్యాసంస్థలు, బెంగళూరు... రియల్‌ పార్టనర్‌ స్వర్గసీమ సుకేతన’’ సారఽథ్యంలో కనిగిరిలో అమరావతి మెడికల్‌ సైన్సెస్‌ గుంటూరు ఎండీ, మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి సౌజన్యంతో సోమవారం నిర్వహించిన ముత్యాల ముగ్గుల పోటీలు ఉత్సాహభరితంగా జరిగాయి. 200 మంది తరుణీమణులు తరలివచ్చి వారిలోని సృతజనాత్మకతను వెలికితీసి మనోహరంగా ముగ్గులు వేశారు.

కనిగిరి, జనవరి 8 : కనిగిరిలోని అమరావతి గ్రౌండ్‌ ముత్యాల ముగ్గులతో మెరిసిపోయింది. తెలుగు సంప్రదాయం ఉట్టిపడేలా నారీమణులు వేసిన రంగవల్లులు అందరినీ కట్టిపడేశాయి. ఆంధ్రజ్యోతి-ఏబీఎన్‌ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన ముగ్గుల పోటీల్లో మహిళలు, యువతులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఉదయం 8 గంటల నుంచే తరలివచ్చారు. పోటీలు ప్రారంభమయ్యే సమయానికి ప్రాంగణం నిండిపోయింది. వెలిగండ్ల మండలం మొగళ్లూరు గ్రామానికి చిరివెళ్ల కవితికు ప్రథమ, కనిగిరి పట్టణానికి చెందిన ఎం.తిరుమలకు ద్వితీయ, కనిగిరి మండలం పేరంగుడిపల్లి గ్రామానికి చెందిన పి.హైమావతి తృతీయ బహుమతి లభించాయి. వీరికి మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి బహుమతులను అందజేశారు. మొదటి బహుమతి విజేతకు 32 అంగుళాల ఎల్‌ఈడీ స్మార్ట్‌ టీవీని, ద్వితీయ బహుమతిగా ట్రావెలింగ్‌ లగ్జరీ సూట్‌కేస్‌, తృతీయ బహుమతిగా రాకింగ్‌ రిలాక్స్‌ చైర్‌ను అందజేశారు. కన్సొలేషన్‌ బహుమతుల కింద ఒంగోలుకు చెందిన కె.సుబ్బలక్ష్మికి లగ్జరీ సూట్‌కేస్‌, కె.విజయలక్ష్మికు రాకింగ్‌ రిలాక్స్‌ చైర్‌, బద్వేలుకు చెందిన కాత్యాయనికి గొడుగునుఇచ్చారు. పోటీల్లో పాల్గొన్న మహిళలందరికీ టీ ప్లాస్క్‌లను అందించారు. న్యాయ నిర్ణేతలుగా ఎర్రం ప్రమీల, ఉమామహేశ్వరి వ్యవహరించారు. ఆంధ్రజ్యోతి బ్రాంచి మేనేజర్‌ ఐ.వీ సుబ్బారావు, ఎడిషన్‌ ఇన్‌చార్జి శ్రీనివాసరావు, ఏబీఎన్‌ స్టాఫ్‌ రిపోర్టర్‌ వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. స్పాన్సర్స్‌ లోగోలతో ముగ్గులు వేసిన మహిళలకు కన్సొలేషన్‌ పార్టిసిపెంట్‌ బహుమతులను అందజేశారు.

Updated Date - Jan 08 , 2024 | 11:24 PM