వంద రోజుల్లో రైల్వే, హైవే పనులను పూర్తిచేయాలి
ABN , Publish Date - Jul 28 , 2024 | 10:50 PM
రైల్వే, హైవే పనులను వంద రోజుల్లో పూర్తిచేసేం దుకు ప్రత్యేక చొరవ తీసుకోవాలని ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్రనరసింహారెడ్డి అన్నారు. ఆదివారం స్థానిక ఆర్డీవో కార్యాలయంలో రైల్వే, గ్రీన్‌ఫీల్డ్, 565 హైవే బాధితులతో జరగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. నడికుడి - శ్రీకాళహస్తి రైల్వే పనులకు సంబంధించి ప్రస్తుతం 20 కిమీటర్ల మేర రైతుల అభ్యంతరాలతో నిలిచిపోయాయన్నారు. కనిగిరి ప్రాంతం అన్ని విధాలుగా అభివృద్ధి చెందాలంటే ప్రధానంగా రవాణరంగం మెరుగుప డాల్సిన అవసరరం ఉందన్నారు.

ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్రనరసింహారెడ్డి
కనిగిరి, జూలై 28: రైల్వే, హైవే పనులను వంద రోజుల్లో పూర్తిచేసేం దుకు ప్రత్యేక చొరవ తీసుకోవాలని ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్రనరసింహారెడ్డి అన్నారు. ఆదివారం స్థానిక ఆర్డీవో కార్యాలయంలో రైల్వే, గ్రీన్‌ఫీల్డ్, 565 హైవే బాధితులతో జరగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. నడికుడి - శ్రీకాళహస్తి రైల్వే పనులకు సంబంధించి ప్రస్తుతం 20 కిమీటర్ల మేర రైతుల అభ్యంతరాలతో నిలిచిపోయాయన్నారు. కనిగిరి ప్రాంతం అన్ని విధాలుగా అభివృద్ధి చెందాలంటే ప్రధానంగా రవాణరంగం మెరుగుప డాల్సిన అవసరరం ఉందన్నారు. అందులో భాగంగా 20 కి.మీ పరిదిలో భూమిని కోల్పోతున్న రైతులకు తగిన నష్టపరిహారంతో పాటు వారికి స్థలా లు కేటాయించి ఇళ్లను కూడా నిర్మించి ఇవ్వాలని అధికారులను ఆదేశిం చారు. కనిగిరి ప్రాంతంలోని రైల్వేస్టేషన్ ఏర్పాటుకు ఆటంకంగా మారిన టే కు చెట్ల భూమికి తగిన నష్టపరిహారాన్ని ఇప్పించేలా ఎమ్మెల్యే అటవీశాఖ అధికారులతో మాట్లాడారు. గతంలో పలుమార్లు స్పందన కార్యక్రమంలో 498/2, 500/1 సర్వే నెంబర్లకు సంబంధించిన భూములు గ్రీన్‌ఫీల్డ్ హైవే కింద పోతున్నట్టు ఆర్డీవో జాన్ ఇర్విన్ వివరించారు. ఎమ్మెల్యే మాట్లాడు తూ నష్టపరిహారం కోసం ప్రభుత్వం దృష్టికి తీసుకెళతానని చెప్పారు. అ సంపూర్తిగా ఉన్న బైపాస్‌ను కూడా వంద రోజుల్లో పూర్తి చేయనున్నట్లు చెప్పారు. అందుకోసం ప్రభుత్వం నుంచి రావాల్సిన నష్టపరిహారం ఇప్పటికే కలెక్టర్ వద్ద ఉందన్నారు. బైపాస్ కింద భూములు కోల్పోయే 30 మందికి పైగా రైతుల ఖాతాల్లో నగదును పది రోజుల్లో జమ చేయనున్నట్టు చెప్పారు.
గత ప్రభుత్వంలో జరిగిన అక్రమాలు, భూకబ్జాలు, భూ కుంభకో ణాలపై సిట్ వేసినట్టు ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్ర పేర్కొన్నారు. అయితే, గత ప్రభుత్వంలో వైసీపీకి చెందిన సంబంధిత అక్రమార్కులు కొంతమంది సిట్ దర్యాప్తు సాగనివ్వకుండా అడ్డుకున్నట్టు చెప్పారు. తిరిగి సిట్ దర్యాప్తు ప్రారంభించి భూఅక్రమాలకు పాల్పడిన వారిపై కఠినంగా చర్యలు తీసుకుంటామన్నారు. ప్రధానంగా హనుమంతునిపాడు మండలంలోని ఉ మ్మనపల్లి పంచాయతీలో ప్రభుత్వానికి చెందిన సర్వే నెంబరు 1లో వంద లాది ఎకరాలు అన్యాక్రాంతమయ్యాయన్నారు. ఆయా భూముల అక్రమాల పై దర్యాప్తు వేగవంతం చేయనున్నట్లు ఆర్డీఓ చెప్పారు. అక్రమార్కులు ఎంతటివారైన ఉపేక్షించవద్దని ఎమ్మెల్యే ఆర్డీఓ జాన్‌ఇర్విన్‌ను ఆదేశించారు. సమావేశంలో రైతులు, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.