Share News

పాఠశాలల అడ్మిషన్లలో సమూల మార్పూలు

ABN , Publish Date - Apr 16 , 2024 | 01:33 AM

పాఠశాలల్లో 2024-25 విద్యా సంవత్సరం అడ్మిషన్లలో సమూల మార్పులకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. విద్యార్థులు టీసీలు తీసుకోవాల్సిన అవసరం లేకుండానే ఇతర పాఠశాలల్లో ప్రవేశాలకు ప్రభుత్వం వీలు కల్పించింది.

పాఠశాలల అడ్మిషన్లలో సమూల మార్పూలు

శాశ్వత ఎడ్యుకేషన్‌ నంబరుతో ప్రవే శాలు

ఒంగోలు(విద్య), ఏప్రిల్‌ 15 : పాఠశాలల్లో 2024-25 విద్యా సంవత్సరం అడ్మిషన్లలో సమూల మార్పులకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. విద్యార్థులు టీసీలు తీసుకోవాల్సిన అవసరం లేకుండానే ఇతర పాఠశాలల్లో ప్రవేశాలకు ప్రభుత్వం వీలు కల్పించింది. పాఠశాలల నుంచి విద్యార్థుల బదిలీ సర్టిఫికెట్లు (టీసీ), జనన ధ్రువీకరణ పత్రాలు తీసుకోవడంలో తల్లిదండ్రులు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ఆ అవసరం లేకుండా విద్యార్థులకు పాఠశాలల్లో అడ్మిషన్లు కల్పించేందుకు ప్రభుత్వం సంకల్పించింది. ఈఏడాది నుంచి విద్యార్థులకు చైల్డ్‌ ఐడీలు, శాశ్వత ఎడ్యుకేషన్‌ నంబరును కేటాయిస్తున్నారు. ముందుగా ప్రధానోపాధ్యాయులు/ప్రిన్సిపాళ్లు తమ పాఠశాలలోని విద్యార్థుల తల్లిదండ్రులు, సంరక్షకులను కలిసి తమ పిల్లలు తదుపరి తరగతికి ఏ పాఠశాలలో చేరబోతున్నారో ఆ వివరాల సమ్మితిపత్రం వారి సంతకంతో తీసుకోవాలి. దాని ఆధారంగా విద్యార్థి తమ తదుపరి తరగతికి ఏ పాఠశాలలో చేరబోతున్నారో అక్కడికి ఆ విద్యార్థి వివరాలను ఆన్‌లైన్‌లో బదిలీ చేస్తారు. ఈ విధానంతో తల్లిదండ్రులు తమ పిల్లలు ప్రస్తుతం చదువుతున్న పాఠశాల నుంచి టీసీలు తీసుకోవాల్సిన అవసరం లేదు. అదేవిధంగా విద్యార్థి టీసీ, జనన ధ్రువీకరణపత్రం, ఇతర వివరాలు చైల్డ్‌ఇన్ఫో వెబ్‌సైట్‌ ద్వారా పాత పాఠశాల నుంచి కొత్త పాఠశాలకు ఆన్‌లైన్‌లో బదిలీ అవుతున్నందున విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాలల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. వెబ్‌సైట్‌లోని వివరాలతో కొత్త పాఠశాలల్లో విద్యార్థులకు అడ్మిషన్లు కల్పిస్తారు. దీంతో తల్లిదండ్రులకు భారం తగ్గుతుంది.

Updated Date - Apr 16 , 2024 | 01:33 AM