ప్రభుత్వ ఆసుపత్రిలో నాణ్యమైన వైద్యసేవలు
ABN , Publish Date - Nov 25 , 2024 | 11:39 PM
ప్రభుత్వ ఆసుపత్రిలో నాణ్యమైన వైద్య సేవలు అందిస్తున్నట్టు ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్రనరసింహా రెడ్డి అన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన అనతి కాలంలోనే ఈ ఆస్ప త్రిలో వసతులు కల్పిస్తున్నట్టు చెప్పారు. స్థానిక అమరావతి గ్రౌండ్స్‌లో సోమవారం పది కుటుంబాలకు రూ.11లక్షల 9వేల 948లు సీఎం సహా యనిధి చెక్కులను పంపిణీ చేశారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడు తూ కనిగిరి నియోజకవర్గంలో ఆరోగ్యపరంగా పేదలు ఇబ్బంది పడకూ డదనే ఉద్దేశంతో సీఎం సహాయనిధి ద్వారా అండగా నిలుస్తున్నామన్నా రు.
ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్రనరసింహారెడ్డి
కనిగిరి, నవంబరు 24 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ ఆసుపత్రిలో నాణ్యమైన వైద్య సేవలు అందిస్తున్నట్టు ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్రనరసింహా రెడ్డి అన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన అనతి కాలంలోనే ఈ ఆస్ప త్రిలో వసతులు కల్పిస్తున్నట్టు చెప్పారు. స్థానిక అమరావతి గ్రౌండ్స్‌లో సోమవారం పది కుటుంబాలకు రూ.11లక్షల 9వేల 948లు సీఎం సహా యనిధి చెక్కులను పంపిణీ చేశారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడు తూ కనిగిరి నియోజకవర్గంలో ఆరోగ్యపరంగా పేదలు ఇబ్బంది పడకూ డదనే ఉద్దేశంతో సీఎం సహాయనిధి ద్వారా అండగా నిలుస్తున్నామన్నా రు. పేదలు ఖర్చుతో కూడుకున్న అనారోగ్యాల భారిన పడినపుడు వారికి సీఎం సహాయనిధి ఎంతో భరోసా కల్పిస్తుందని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేదల ఆరోగ్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు పాల్గొన్నారు.
బాలికల హాస్టల్ ఏర్పాటుకు స్థలసేకరణ
పామూరు, నవంబరు 25 (ఆంధ్రజ్యోతి): పామూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు సంబంధించి బాలికల ప్రత్యేక హాస్టల్ ఏర్పాటుకు అవసరమైన స్థలసేకరణ కోసం పాత ప్రభుత్వ వైద్యశాల ప్రాంగణాన్ని సోమవారం ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్రనరసింహారెడ్డి పరిశీ లించారు. ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు సు మారు 350 మందికి పైగా బాలికలు విద్యను అభ్యసిస్తున్నారు. వారి కోసం ప్రత్యేక హా స్టల్ ఏర్పాటుకు ప్రభుత్వం నుంచి అనుమతులు పొందినట్టు ఈసందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్ర తెలిపారు. హాస్టల్ ఏర్పాటుకు అనువైన స్థలసేకరణలో భాగంగా ఉన్నత పా ఠశాలకు దగ్గరగా నిరుపయోగంగా ఉన్న పాత ప్రభుత్వ వైద్యశాల స్థలాన్ని పరిశీలి స్తున్నట్టు చెప్పారు. అన్ని అనుమతులు పొందిన తరువాత హాస్టల్ నిర్మాణ పనులు ప్రారంభిస్తామని చెప్పారు. కార్యక్రమంలో ఎంఈవో కె.కరుణకుమారి, ఉన్నత పాఠశాల హెచ్‌ఎం కె.రామస్వామి, సర్వశిక్షఅభియాన్ ఏఈ సతీష్, ఉప్పలపాటి హరిబాబు, ఇర్రి కోటిరెడ్డి, మెంటా నరసింహారావు, ఆర్‌ఆర్ రఫి, టీవీకే సుబ్బారావు, మోషే తదితరులు పాల్గొన్నారు. కాగా,. పామూరు పట్టణంలో నూతనంగా ఏర్పాటుచేసిన బ్రైయిట్ జనరల్ అండ్ కార్డియాక్ కేర్ వైద్యశాలను డాక్టర్ ఉగ్ర ప్రారంభించారు. వైద్యశాల డాక్టర్లు గోస్టు వెంకటేశ్వర్లు, డాక్టర్ ప్రతిమాలు ఉగ్రను శాలువాతో సత్కరించారు.