Share News

మీకు ఇష్టమైన భాషను ఎంచుకోండి

పల్స్‌ పోలియో విజయవంతం

ABN , Publish Date - Mar 03 , 2024 | 11:50 PM

: పల్స్‌ పోలియో కార్యక్రమం విజయవంతమైందని డిప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్‌ పద్మావతి అన్నారు.

పల్స్‌ పోలియో విజయవంతం

మార్కాపురం వన్‌టౌన్‌, మార్చి 3: పల్స్‌ పోలియో కార్యక్రమం విజయవంతమైందని డిప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్‌ పద్మావతి అన్నారు. పల్స్‌పోలియో సందర్భంగా సబ్‌ కలెక్టర్‌ కార్యా లయ ఆవరణలోని ఆరోగ్య కేంద్రంలో చిన్నారుల కు పోలియో చుక్కలు వేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పట్టణంలో 40 కేంద్రాల ద్వా రా పోలియో చుక్కలు వేశామని 7630 మందికి చుక్కలు వేయించాలని లక్ష్యం గా పెట్టుకోగా 7309మందికి వేశామన్నారు. 96 శాతం పల్స్‌ పోలియో నిర్వహించామని, సోమ, మంగళవారా లు కూడా చుక్కలు వేయనున్నట్లు తెలిపారు.

ఎర్రగొండపాలెం : మండలంలో మొదటి విడత 5463 మంది చిన్న పిల్లలను గుర్తించామని తెలిపారు. మండలంలో 44 పల్స్‌పోలియో కేంద్రాలు ఏర్పాటు చేసి 5233 మందికి చుక్కలు వేసినట్లు వెంకటాద్రిపాలెం పీహెచ్‌సీ వైద్యుడు కోటా నాయక్‌ తెలిపారు. పాలుట్ల డాక్టరు పి చంద్రశేఖర్‌ పోలియో కేంద్రాలను తనిఖీ చేశారు. హెచ్‌ ఈసీ పి.వెంకటేశ్వర్లు, టీడీపీ సోషల్‌మీడియా వర్కరు షేక్‌ అజారుద్దీన్‌, ఏఎన్‌ఎంలు, అంగన్వాడీ, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.

కంభం : పోలియోను అరికట్టేందుకు ప్రజ లందరూ కలిసి కట్టుగా కృషి చేయాలని కంభం ఎంపీపీ చేగిరెడ్డి తులసమ్మ తెలిపారు. ఆదివారం కంభం సచివాలయం-1లో పల్స్‌ పోలియో కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించారు. పల్స్‌పోలి యో కార్యక్రమం కంభం రైల్వేస్టేషన్‌, ఆర్టీసీ బస్టాండ్‌, ప్రభుత్వ వైద్యశాల, కందులాపురం పంచాయతీ, కంభం పంచాయతీల పరిధిలో కేంద్రాలను ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో ఎంపీడీవో మస్తాన్‌వలి, సర్పంచ్‌ బోడయ్య, డాక్టర్‌ అత్తర్‌ నాయబ్‌రసూల్‌, పాల్గొన్నారు.

పోలియో రహిత సమాజమే లక్ష్యం

దొనకొండ : పోలియో రహిత సమాజమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ బాధ్యతగా కృషి చేయాలని ఎంపీపీ బొరిగొర్ల ఉషామురళి సూ చించా రు. దొనకొండలోని గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పల్స్‌పోలియో కేంద్రం లో ఆదివారం చిన్నారులకు పోలియో చుక్కలు వేసి ప్రారంభించారు. కార్యక్రమంలో ఆరోగ్య కేంద్రం డాక్టర్‌ కే సునీత, సర్పంచ్‌ కొంగలేటి గ్రేస్‌రత్నకుమారి, దేవానంద్‌, కార్యదర్శి పోటు కృష్ణమూర్తి, ఆరోగ్య కేంద్రం సిబ్బంది, అంగన్‌వాడీలు, ఆశా, వలంటీర్లు సేవలందించారు.

ముండ్లమూరు : ముండ్లమూరు, మారెళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో చిన్నారుల కు పల్స్‌ పోలియో చుక్కలు ఆదివారం వేసినట్టు వైద్యాధికారులు జే వెంకటేశ్వరరెడ్డి, డాక్టర్‌ జాస్మిన్‌, మధుశంకర్‌, ప్రవీణ్‌ కుమార్‌ తెలిపారు. రెండు పీహెచ్‌సీల పరిధిలో 98.9 శాతం చుక్కలు వేసినట్టు తెలిపారు. సర్పంచ్‌లు, ఎంపీటీసీ సభ్యులు, అంగన్‌ వాడీ టీచర్లు, ఆషా వర్కర్లు, సిబ్బంది పాల్గొన్నారు. పామూరు, పీసీపల్లి మండలాల్లోనూ పోలియో చుక్కలు వేశారు.

గిద్దలూరు : మండలంలోని 88 కేంద్రాల ద్వారా చిన్నారులకు చుక్కలను వేసినట్లు సీనియర్‌ మెడికల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ సుమయ తెలిపారు. పట్టణంలోని రైల్వేస్టేషన్‌లో ఏర్పాటు చేసిన కేంద్రంలో వైసీపీ ఇన్‌చార్జి, మార్కాపురం ఎమ్మెల్యే కె.నాగార్జునరెడ్డి చిన్నారులకు పల్స్‌ పోలియో చుక్కలు వేశారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ కడప వంశీధర్‌రెడ్డి, వైద్యాధికారి డాక్టర్‌ భార్గవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

తర్లుపాడు : పోలియో రహిత సమాజాన్ని స్థాపిద్దామని వైద్యాధికారి హరీష్‌ అన్నారు. మండలంలో 33 బూత్‌ల ద్వారా పోలియో చుక్క లు వేసినట్లు ఆయన పేర్కొన్నారు. ఐదేళ్ల లోపు పిల్లలందరికీ ఖచ్చితంగా పోలియో చుక్కలు వేయించుకోవాలని కోరారు. కార్యక్రమంలో సీహెచ్‌వో తులసీ ప్రసాద్‌ పాల్గొన్నారు.

త్రిపురాంతకం : ఆదివారం పోలియో కార్యక్రమంలో భాగంగా త్రిపురాంతకం మండలంలో 95 శాతం నమోదు అయినట్లు వైద్యులు తెలిపారు. మరో రెండు రోజుల పాటు ఇళ్ళ వద్దకు వెళ్ళి పోలియో చుక్కలు వేయనున్నట్లు తెలిపారు. పోలియో చుక్కలను చిన్నారుల తల్లిదండ్రు లు సద్వినియోగం చేసుకోవాలన్నారు.

Updated Date - Mar 03 , 2024 | 11:50 PM