Share News

ప్రజాసంక్షేమం కూటమితోనే సాధ్యం

ABN , Publish Date - Apr 12 , 2024 | 12:10 AM

చెత్తపై పన్ను వేసిన చెత్త సీఎం జగన్మోహనరెడ్డి మాత్రమే అని ఎ మ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం రాత్రి అద్దం కి పట్టణంలోని 7వ వార్డులో ఇంటింటికి తిరిగి టీడీపీ మేనిఫెస్టో గురించి వివరించారు. ఈసందర్భంగా రవికుమార్‌ మాట్లాడుతూ అద్దంకి పట్టణంలో టీడీపీ హ యాంలో 90 శాతం పూర్తయిన టిడ్కో ఇళ్ళకు ఇంతవ రకు మోక్షం లేదన్నారు.

ప్రజాసంక్షేమం కూటమితోనే సాధ్యం
రవికుమార్‌ సమక్షంలో టీడీపీలో చేరిన తిమ్మనపాలెం వైసీపీ నాయకులు

ప్రజాసంక్షేమం కూటమితోనే సాధ్యం

చెత్తపై పన్నువేసిన సీఎంకు గుణపాఠం చెప్పాలి

అద్దంకి ఎమ్మెల్యే రవికుమార్‌

అద్దంకి, ఏప్రిల్‌ 11: చెత్తపై పన్ను వేసిన చెత్త సీఎం జగన్మోహనరెడ్డి మాత్రమే అని ఎ మ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం రాత్రి అద్దం కి పట్టణంలోని 7వ వార్డులో ఇంటింటికి తిరిగి టీడీపీ మేనిఫెస్టో గురించి వివరించారు. ఈసందర్భంగా రవికుమార్‌ మాట్లాడుతూ అద్దంకి పట్టణంలో టీడీపీ హ యాంలో 90 శాతం పూర్తయిన టిడ్కో ఇళ్ళకు ఇంతవ రకు మోక్షం లేదన్నారు. రూ.82 కోట్లతో చేపట్టిన మంచి నీటి పథకం పనులు ఇంకా పూర్తికాలేదన్నారు. సీఎం జగన్‌ సిద్ధం అని తిరుగుతున్నారు కాని ప్రజలు మాత్రం ఓడించటానికి సిద్ధం అయ్యారన్నారు. అప్పులలో రాష్ట్రం వెంటిలేటర్‌పై ఉందని, కొనఊపిరి తో ఉన్న రాష్ర్టాన్ని ఎ న్డీఏ కూటమి ఆక్సిజన్‌లా బతికిస్తుందన్నారు. రాజధాని, పోలవరం సహా అన్ని ప్రాజెక్టులు కేంద్రం సహకారంతో పూర్తి చేయటంతో పాటు, పాలనను గాడిలో పెట్టడం జరుగుతుందన్నారు. ఏప్రిల్‌ నుంచే పెంచిన ఫెన్షన్‌ ఇవ్వ టం జరుగుతుందన్నారు. వలంటీర్‌ వ్యవస్థకు టీడీపీ వ్య తిరేకం కాదన్నారు. వైసీపీ దుర్మార్గపు పాలనను సాగ నంపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. మే 13న జరిగే ఎన్నికలలో సైకిల్‌ గుర్తుపై ఓటు వేసి గెలి పించాలని ఎమ్మెల్యే రవికుమార్‌ ఇంటింటికి వెళ్లి ఓట ర్లను కోరారు. కార్యక్రమంలో టీడీపీ నేతలు చిన్ని శ్రీ నివాసరావు, కుందారపు రామారావు, సీతమ్మ, పిన్నింటి శ్రీదేవి, బోడెంపూడి కొండలు, రావిపాటి హరి, మాదాల రామాజంనేయులు, నర్రా శ్రీనివాసబాబు, బిళ్ళపాటి రామాంజనేయులు, ఎనుమల శ్రీను, ఎనిగండ్ల శ్రీను తదితరులు పాల్గొన్నారు. ఆయా ప్రాంతాలలో ఎ మ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌కు స్థానికులు ఘన స్వాగతం పలికారు.

టీడీపీలో చేరిన అంబడిపూడి బీసీ కాలనీవాసులు

బల్లికురవ, ఏప్రిల్‌ 11: మండలంలోని చినఅంబ డిపూడి బీసీ కాలనీవాసులు గురు వారం ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌ను చిలకలూరిపేటలోని అయన సృగృహంలో కలిసి టీడీపీ తీర్థం పుచ్చుకొన్నారు. కాలనీకి చెందిన కోవూరి ప్రభాకరరావు, సుబ్బారావు, రాజు, రవి బాబు, ఆలకుంట శ్రీనివాసరావు తదితరులు వైసీపీని వీడి టీడీపీలో చే రుతున్నట్లు ప్రకటించారు. ఎమ్మెల్యే రవికుమార్‌ వారికి పార్టీ కండువాలు మెడలో వే సి రానున్న ఎన్నికల్లో టీడీపీ విజయానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్ర మంలో నేతలు దద్దాల అం జయ్య, మందలపు సుధాకర్‌, పల్లపు కోటిస్వామి, కోవూరి చినఅంకమ్మ, ముత్యాలు, పల్లుపు శ్రీను, వీరనారాయణ, తదితరులు పాల్గొన్నారు.

టీడీపీలో చేరిన తిమ్మనపాలెం

సర్పంచ్‌, వైసీపీ నాయకులు

మేదరమెట్ల, ఏప్రిల్‌ 11: మండలంలోని తిమ్మనపాలెంకు చెందిన వైసీపీ నాయకులు ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌ సమక్షంలో టీడీపీలో చేశారు. గురువారం తిమ్మనపాలెం సర్పంచ్‌ సాధినేని లక్ష్మికు మారి శ్రీనివాసరావు, సొసైటీ మాజీ అధ్యక్షుడు ముసు లూరి వెంకట్రావు, సాధినేని రఘబాబు, ముసులూరి రమేష్‌బాబు, నూతలపాటి చలపతిరావు, పణిదం ఏడు కొండలు, బెల్లం రవీంద్రబాబు, తూమాటి హర్షవర్ధన్‌, సాధినేని బ్రహ్మం, సాధినేని రామకృష్ణ, ముసులూరి అఖీల్‌, సాధినేని శ్రీధర్‌బాబు, గాడిపత్రి వెంకటేశ్వర్లు తదితరులకు టీడీపీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వా నించారు.

ఈసందర్భంగా రవికుమార్‌ మాట్లాడుతూ జగన్‌మో హన్‌రెడ్డి దుర్మార్గపు పాలనను అంతం చేయడానికి కూటమికి మద్దతు ఇవ్వాల్సిన అ వసరం ఉందన్నారు. సంక్షేమం, అభివృద్ధి చంద్రబాబుతోనే సాధ్యమని చె ప్పారు. సాధినేని శ్రీనివాసరావు మాట్లాడుతూ తెలుగు దేశం పార్టీకి అత్యధిక మెజార్టీ తీసుకురావడానికి తమ వంతు కృషి చేస్తామన్నారు.

Updated Date - Apr 12 , 2024 | 12:10 AM