Share News

మాక్‌డ్రిల్‌తో ప్రజలకు అవగాహన

ABN , Publish Date - May 24 , 2024 | 12:06 AM

ఎర్రగొండపాలెం ప్రధాన కూడలిలో పోలీసులు నిర్వహించిన మాక్‌డ్రిల్‌ ప్రజలు ఆసక్తిగ తిలకించారు.

మాక్‌డ్రిల్‌తో ప్రజలకు అవగాహన

ఎర్రగొండపాలెం, మే 23 : ఎర్రగొండపాలెం ప్రధాన కూడలిలో పోలీసులు నిర్వహించిన మాక్‌డ్రిల్‌ ప్రజలు ఆసక్తిగ తిలకించారు. స్థానిక అంబేడ్కర్‌ కూడలిలో పోలీసులు మాక్‌డ్రిల్‌ నిర్వహించి అవగాహన కల్పించారు. గొడవలు చేసే వ్యక్తులపై లాఠీచార్జ్‌, పైరింగ్‌ ఆపరేషన్‌ను నిర్వహించారు. అల్లరి మూకలను అదుపు చేసే విధానంపై అవగాహన కల్పించారు. ప్రధాన కూడలిలో ప్రజలు ఈ మాక్‌డ్రిల్‌ను ఉత్సాహాంగా తిలకించారు. గొడవలు చేసే వ్యక్తులకు పోలీసు రియాక్షన్‌ ఏవిధంగా ఉంటుందో ప్రజలు ప్రత్యక్షంగా వీక్షించారు. కార్యక్రమంలో స్థానిక సీఐ రాములు నాయక్‌, ఎస్‌.ఐ సుదర్శన్‌, మాక్‌డ్రిల్‌ పోలీసు పార్టీలు పాల్గొన్నాయి.

గిద్దలూరులో..

గిద్దలూరు టౌన్‌ : పట్టణంలో గురువారం పోలీసు, అగ్నిమాపక శాఖలు సంయుక్తంగా మాక్‌డ్రిల్‌ను నిర్వ హించారు. అసాంఘీక శక్తుల దాడుల నుంచి ఎదుర్కొనే సన్నివేశాలను ప్రజలకు చూపించారు. అలాగే ప్రజలు కూడా తమను తాము రక్షించుకునే చర్యలపై అవగాహన కల్పించారు. ఏఎస్పీ అశోక్‌బాబు ఆధ్వర్యంలో ప్రత్యేక బలగాలు అగ్నిమాపక సిబ్బందితో మాక్‌డ్రిల్‌ నిర్వ హించారు. ఈ సందర్భంగా ఏఎస్పీ అశోక్‌బాబు మాట్లాడుతూ ఎన్నికల ఫలితాల ముందు, తరువాత గానీ అల్లర్లు సృష్టించినా, హింసకు పాల్పడితే లాఠీచార్జ్‌ పొగ బాంబులు, రబ్బర్‌ బులెట్లు, కాల్పులు ఉంటాయన్నారు. మాక్‌డ్రిల్‌లో ప్రజలకు అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై కేసులు నమోదు చేసి కఠినంగా చర్యలు తీసుకుంటా మన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అల్లర్లు, దాడులను ఈసీ తీవ్రంగా పరిగణిస్తుందన్నారు. రాజకీయ పార్టీలకు చెందిన నేతలు, కార్యకర్తలు పోలీసులకు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో అర్బన్‌ సీఐ సోమయ్య, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 24 , 2024 | 12:06 AM