Share News

టీడీపీ హయాంలోనే మహిళలకు రక్షణ

ABN , Publish Date - Jun 24 , 2024 | 01:46 AM

తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే మ హిళలకు రక్షణ లభిస్తుందని తెలుగు మహిళలు తెలిపారు.

టీడీపీ హయాంలోనే మహిళలకు రక్షణ

తెలుగు మహిళలు

ఒంగోలు (కార్పొరేషన్‌), జూన్‌ 23: తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే మ హిళలకు రక్షణ లభిస్తుందని తెలుగు మహిళలు తెలిపారు. ఆదివారం ఒంగో లులోని టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ ఈపురుపాలెంలో ఓ మహిళలపై అత్యాచారం జరగ్గా, బాధితు రాలికి అండగా ఉండేందుకు హోంమంత్రి వంగలపూడి అనిత నేరుగా సంఘటన జరిగిన ఊరికి వెళ్ళారన్నారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయు డు దృష్టికి తీసుకెళ్ళగా, స్పందించిన సీఎం రూ.10 లక్షలు ఎక్స్‌గ్రేషియా ప్రకటిం చడం అభినందనీయమని పేర్కొన్నారు. అంతేగాకుండా 36 గంటల్లోనే నిందుల ను అదుపులోకి తీసుకునే విధంగా ఆదేశాలు జారీ చేయడంతో పోలీసులు వారిని అరెస్టు చేశారని తెలిపారు. సమావేశంలో రావుల పద్మజ, నిడమనూరు పావని, బీరం అరుణరెడ్డి, పసుపులేటి సునీత, అనంతమ్మ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jun 24 , 2024 | 01:46 AM