Share News

భగ్గుమంటున్న కూరగాయల ధరలు

ABN , Publish Date - Jun 15 , 2024 | 11:42 PM

కూరగాయలు అంటేనే సామాన్యుడు భయపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎండ తీవ్రత తగ్గిన తర్వాత కూడా ఏ కూరగాయ చూసినా కిలో రూ.60 నుంచి రూ.70 వరకు పలుకుతోంది. చికెన్‌తో పోటీపడి బీన్స్‌ ధరలు ఉన్నాయి. కిలో చికెన్‌ రూ.250కి లభిస్తుండగా బీన్స్‌ రూ.210లకు చేరింది. నిన్నా మొన్నటివరకు అన్నిరకాల కూరగాయలు కిలో రూ.30 నుంచి రూ.50 లోపు లభించగా ఇప్పుడు 40శాతం మేర ధరలు పెరిగాయి. ఉత్పత్తి గణనీయంగా తగ్గిపోవడంతో అన్నిరకాల ధరలకు రెక్కలు వచ్చాయి.

భగ్గుమంటున్న కూరగాయల ధరలు

సామాన్యుడు కొనలేని పరిస్థితి

చికెన్‌తో పోటీ పడుతున్న బీన్స్‌

ఒంగోలు(కలెక్టరేట్‌), జూన్‌ 15 : కూరగాయలు అంటేనే సామాన్యుడు భయపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎండ తీవ్రత తగ్గిన తర్వాత కూడా ఏ కూరగాయ చూసినా కిలో రూ.60 నుంచి రూ.70 వరకు పలుకుతోంది. చికెన్‌తో పోటీపడి బీన్స్‌ ధరలు ఉన్నాయి. కిలో చికెన్‌ రూ.250కి లభిస్తుండగా బీన్స్‌ రూ.210లకు చేరింది. నిన్నా మొన్నటివరకు అన్నిరకాల కూరగాయలు కిలో రూ.30 నుంచి రూ.50 లోపు లభించగా ఇప్పుడు 40శాతం మేర ధరలు పెరిగాయి. ఉత్పత్తి గణనీయంగా తగ్గిపోవడంతో అన్నిరకాల ధరలకు రెక్కలు వచ్చాయి. వంద రూపాయలు చేతిలో పెట్టుకొని మార్కెట్‌కు వెళితే రెండు రకాలు కూడా రావడం లేదు. మరోవైపు నిత్యం వంటల్లో వినియోగించే టమోటా, పచ్చిమిర్చి ధరలు హోల్‌సేల్‌లోనే కిలో రూ.70 వరకు పలుకుతుండగా రిటైల్‌గా మరో 10 నుంచి 15శాతం వరకు పెంచి కిలో రూ.80 వరకు విక్రయిస్తున్నారు. అలా అన్నిరకాల కూరగాయల ధరలు పెరగడంతో సామాన్యులు మార్కెట్‌వైపు వెళ్లాలంటేనే భయపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. కొత్తపట్నం, మార్టూరు ప్రాంతాల నుంచి పలురకాల కూరగాయలు దిగుమతి అవుతాయి. అయితే అక్కడ పంట ఉత్పత్తి తగ్గిపోవడంతో ఇతర ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి రావడంతో వాటి ధరలకు రెక్కలు వచ్చాయి. కూరగాయల ధరలు కిలో ఇలా ఉన్నాయి...

బీన్స్‌ : రూ.210.00

టమోటా : 70.00

పచ్చిమిర్చి : 70.00

దొండ : 70.00

క్యారెట్‌ : 65.00

చామదుంప : 60.00

కాకర : 60.00

బీర : 60.00

క్యాబేజి : 50.00

గోరుచిక్కుళ్ళు : 50.00

బీట్‌రూట్‌ : 50.00

బంగాళదుంప : 40.00

బెండ కాయ : 40.00

Updated Date - Jun 15 , 2024 | 11:42 PM