ఎంపీ మాగుంటకు ప్రతిష్ఠాత్మక పదవి
ABN , Publish Date - Sep 28 , 2024 | 12:31 AM
గృహ, పట్టణ వ్యవహారాల పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చైర్మన్‌గా ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు లోక్‌సభ స్పీకర్ ఉత్తర్వులు జారీ చేశారు.
గృహ, పట్టణ వ్యవహారాల పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చైర్మన్‌గా నియామకం
ఒంగోలు(కలెక్టరేట్), సెప్టెంబరు 27 : గృహ, పట్టణ వ్యవహారాల పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చైర్మన్‌గా ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు లోక్‌సభ స్పీకర్ ఉత్తర్వులు జారీ చేశారు. కమిటీ చైర్మన్ పదవికి సీఎం చంద్రబాబు నాయుడు సిఫార్సు మేరకు మాగుంట నియమితుల య్యారు. తనకు పదవి వచ్చేందుకు సహకరించిన సీఎంను మాగుంట కలిసి బొకే ఇచ్చి కృతజ్ఞతలు తెలిపారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌తోపాటు తనకు తోడ్పా టును అందించిన ఎంపీలు, జిల్లాకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జిలకు మాగుంట కృతజ్ఞతలు తెలిపారు.