Share News

ఒక్క రూపాయి తీసుకున్నట్లు నిరూపిస్తే దేనికైనా సిద్ధం !

ABN , Publish Date - Feb 12 , 2024 | 01:26 AM

ఒంగోలు లో నివేశన స్థల పట్టాలకు సంబంధించిన భూ ముల వ్యవహారంలో తాను ఒక్క రూపాయి తీసు కున్నట్లు నిరూపిస్తే దేనికైనా సిద్ధమని మాజీ మంత్రి, ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. ఇతర ప్రాంతాలకు చెందిన కాంట్రాక్టర్లతో కుమ్మ క్కయ్యామని కొందరు దుష్ప్రచారం చేయడం దు ర్మార్గమన్నారు.

 ఒక్క రూపాయి తీసుకున్నట్లు నిరూపిస్తే దేనికైనా సిద్ధం !

కాంట్రాక్టు పనులు ఎవరైనా చేయొచ్చు

25లోపు సీఎం చేతుల మీదుగా పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ

ఎమ్మెల్యే బాలినేని

ఒంగోలు (కలెక్టరేట్‌), ఫిబ్రవరి 11 : ఒంగోలు లో నివేశన స్థల పట్టాలకు సంబంధించిన భూ ముల వ్యవహారంలో తాను ఒక్క రూపాయి తీసు కున్నట్లు నిరూపిస్తే దేనికైనా సిద్ధమని మాజీ మంత్రి, ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. ఇతర ప్రాంతాలకు చెందిన కాంట్రాక్టర్లతో కుమ్మ క్కయ్యామని కొందరు దుష్ప్రచారం చేయడం దు ర్మార్గమన్నారు. ఒంగోలు నగర పాలక సంస్థ పరి ధిలోని ఎన్‌.అగ్రహారం వద్ద జగనన్న లేఅవుట్‌ను ఆదివారం ఆయన పరిశీలించారు. అక్కడ ఏర్పా టు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తాను పేదలకు పట్టాలు ఇవ్వాలన్న సంకల్పంతో ముందుకెళ్తుంటే దానిని అడ్డుకొనేందుకు కొందరు కుట్రలు, కుతంత్రాలు చేస్తున్నారన్నారు. భూసేకర ణ నాటి నుంచి ఇప్పటి వరకూ ఇళ్ల స్థలాల కోసం సేకరించిన భూములు ఎక్కడ ఉన్నాయో కూడా తనకు తెలియదన్నారు. ఎన్నికలకు సమయం స మీపిస్తున్న తరుణంలో పేదలకు త్వరగా పట్టాలు ఇచ్చేందుకు ఆయా భూముల అభివృద్ధి పనులు చేపట్టామని, దీన్ని గుర్తించకుండా ఒంగోలుకు చెందిన వారు కాకుండా ఇతర ప్రాంతాలకు చెం దిన కాంట్రాక్టర్లతో కుమ్మక్కయ్యామని ప్రచారం చేయడం ఏమిటని ప్రశ్నించారు. కాంట్రాక్టు ప నులు ఎవరైనా చేయొచ్చన్నారు. గత టీడీపీ ప్ర భుత్వ హయాంలో టిట్కో ఇళ్లు, అమృత్‌ పథకం కింద చేపట్టిన పైపులైన్ల నిర్మాణ పనులను ఎక్కడి కాంట్రాక్టర్లు చేశారని ప్రశ్నించారు. ఆరోజు లేని నిబంధనలు ఆరోజు వచ్చాయా అని మండి పడ్డారు. ఇటువంటి తప్పుడు ప్రచారాలు మాను కోకపోతే ప్రజలే తగిన బుద్ధిచెప్తారని హెచ్చరి ంచారు. ఈనెల 25వతేదీ లోపు ముఖ్యమంత్రి చే తుల మీదుగా పేదలకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేస్తామని బాలినేని చెప్పారు. విలేకరుల సమావే శంలో మేయర్‌ గంగాడ సుజాత, ఒంగోలు ఆర్డీవో విశ్వేశ్వరరావు, కమిషనర్‌, తహసీల్దార్‌, రెవెన్యూ, మునిసిపల్‌ అధికారులు పాల్గొన్నారు.

రైతులతో చర్చించిన బాలినేని

నగరంలోని పేదలకు ఇంటి స్థలాలు ఇచ్చేం దుకు నిష్పక్షపాతంగా భూసేకరణ చేసే బాధ్యత ను అధికారులకు అప్పగించినట్లు ఎమ్మెల్యే బాలి నేని తెలిపారు. వివిధ కారణాల వల్ల భూసేకరణ డబ్బులు జమ కాని రైతులతో ఆయన ప్రత్యేకంగా సమావేశమై వారి కుటుంబసభ్యుల సమస్యను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా బాలినేని మాట్లాడుతూ అగ్రహారం, మల్లేశ్వరపురం గ్రామా ల్లో 80శాతం మంది రైతులకు భూసేకరణకు డ బ్బులు చెల్లించామని, మిగతా వారి కుటుంబ స మస్యల వల్ల భూసేకరణ డబ్బులు చెల్లించలేద న్నారు. ఇంకా 54 మంది రైతులకు పరిహారం ఇ వ్వాల్సి ఉందని చెప్పారు. వారి సమస్యలను కూ డా త్వరగా పరిష్కరించి డబ్బులు అందజేస్తామ ని తెలిపారు.

Updated Date - Feb 12 , 2024 | 01:26 AM