Share News

రాజకీయ వలంటీర్లు

ABN , Publish Date - Mar 22 , 2024 | 11:49 PM

జిల్లాలో సార్వత్రిక ఎన్నికల కోడ్‌ అమలులో ఉన్నా వలంటీర్లు పట్టించుకుంటున్న పరిస్థితి లేకుండాపోయింది. వలంటీర్లు రాజకీయ నాయకులతో కలిసి పర్యటించరాదని స్పష్టమైన ఆదేశాలు సీఈసీ ఇచ్చినా లెక్కచేయడం లేదు. నిబంధనలు తమకు వర్తించవనే దృక్పథంతో అధికారపార్టీకి అనుకూలంగా ప్రచార కార్యక్రమంలో ము నిగితేలుతున్నారు. అధికారం నాయకుల చేతుల్లో ఉందని, తమను ఎవ్వరు ఏమి చేయలేరన్న అహంకారంతో వ్యవహరిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

రాజకీయ వలంటీర్లు
ఎమ్మెల్యే రాంబాబుతో ప్రచారంలో వలంటీర్‌ జమ్ముల బాబు

జిల్లావ్యాప్తంగా ఎన్నికల ప్రచారం

అధికార పార్టీ సేవల్లో పునీతులవుతున్నారు

రాజకీయ నాయకులకన్నా ముందుంటున్నారు

కోడ్‌ ఉల్లంఘన అని తెలిసీ పట్టించుకోని వైనం

అధికారికంగా నలుగురి మీదనే వేటు

ఒంగోలు(కలెక్టరేట్‌), మార్చి 22 : జిల్లాలో సార్వత్రిక ఎన్నికల కోడ్‌ అమలులో ఉన్నా వలంటీర్లు పట్టించుకుంటున్న పరిస్థితి లేకుండాపోయింది. వలంటీర్లు రాజకీయ నాయకులతో కలిసి పర్యటించరాదని స్పష్టమైన ఆదేశాలు సీఈసీ ఇచ్చినా లెక్కచేయడం లేదు. నిబంధనలు తమకు వర్తించవనే దృక్పథంతో అధికారపార్టీకి అనుకూలంగా ప్రచార కార్యక్రమంలో ము నిగితేలుతున్నారు. అధికారం నాయకుల చేతుల్లో ఉందని, తమను ఎవ్వరు ఏమి చేయలేరన్న అహంకారంతో వ్యవహరిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లాలోని పలుప్రాంతాల్లో అధికారపార్టీ ముఖ్యనాయకులతో కలిసి ఎన్నికల ప్రచారాల్లో పార్టీ కండువాలు వేసుకుని మరీ పాల్గొంటున్నా వలంటీర్లపై చర్యలు మాత్రం శూన్యంగా ఉంది. నాలుగైదు రోజుల నుంచి పొదిలి, మార్కాపురం, దర్శి, కొమరోలు, సింగరాయకొండ, పీసీపల్లి, తాళ్లూరు తదితర మం డలాల్లో వలంటీర్లు ఆ పార్టీ నాయకులతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళికి అది భిన్నం. వలంటీర్లు గ్రామాల్లో కేవలం ప్రభుత్వ కా ర్యకలాపాలను మాత్రమే నిర్వహించాలి. అయితే ఎన్నికల కోడ్‌ అమలులోకి వచ్చిన తర్వాత వారు ఆ కార్యకలాపాలకు దూరంగా ఉంచాలని అధికారులను సీఈసీ ఆదేశించారు. ఈ నేపథ్యంలో వారు అధికారిక కార్యకలాపాలు నిర్వహించడం లేదు. డివై్‌సలు కూడా వెనక్కి ఇచ్చారు. అధికారుల ఆదేశాలను ధిక్కరించి ప్రజాప్రతినిధులతో కలిసి ఇంటిం టి ప్రచారం నిర్వహించడంతోపాటు కుటుంబాల వారీగా ఏ పార్టీకి చెందిన వారు అనే విషయాన్ని కూడా వెల్లడిస్తున్నారు. వలంటీర్లు అనుసరిస్తున్న విధానాలపై రోజు పత్రికల్లో ఫొటోలతో సహా వార్తలు వస్తున్నా వారిపై చర్యలు తీసుకునే విషయంలో అధికారులు మీనవేశాలు లెక్కిస్తున్నారు. ఇప్పటివరకు జిల్లాలో 30మందికిపైగా వలంటీర్లు కోడ్‌ని ఉల్లంఘించి ప్రచారంలో పాల్గొన్నారు. వారిపై చర్యలు మాత్రం శూన్యం. మండల స్థాయిలో వలంటీర్లను తొలగించినట్లు మండల స్థాయి అధికారులు పత్రికా ప్రకటనలు ఇస్తున్నా జిల్లా స్థాయికి మాత్రం ఆ నివేదికలు పంపని పరిస్థితి ఏర్పడింది. అధికారికంగా జిల్లా స్థాయి నుంచి కేవలం నలుగురు వలంటీర్లు మాత్రమే ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించినట్లు ఎన్నికల కమిషన్‌కు జిల్లా అధికారులు నివేదించారంటే జిల్లాలో పరిస్థితి ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు. పొదిలి, తాళ్లూరు, సింగరాయకొండ మండలాల్లో మాత్రమే నలుగురు వలంటీర్లు ఎన్నికల్‌ కోడ్‌ను ఉల్లంఘించి తొలగించినట్లు ఉన్నతాధికారుల నివేదికను బట్టి తెలుస్తోంది. అయితే వాస్తవ రూపంలో చూస్తే జిల్లావ్యాప్తంగా ఇప్పటివరకు వందలమంఇకిపైగా వలంటీర్లు అధికారపార్టీ సేవల్లో కొనసాగుతున్నా ఎలాంటి చర్యలు తీసుకున్న పరిస్థితి లేదు. వలంటీర్లు ద్వారా అధికారపార్టీ నాయకులు సార్వత్రిక ఎన్నికల్లో లబ్ధిపొందేందుకు ప్రయత్నాలు చేస్తున్నా అడ్డుకట్ట వేయడంలో పూర్తిగా విఫలమయ్యారనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

తాడివారిపల్లెలో వైసీపీ ప్రచారంలో వలంటీర్లు

ఎమ్మెల్యే రాంబాబుతో కలిసి పర్యటన

తర్లుపాడు, మార్చి 22 : మండలంలోని తాడివారిపల్లెలో మార్కాపురం నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి, గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబు శుక్రవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో ఇద్దరు వలంటీర్లు పాల్గొన్నారు. అన్నా రాంబాబు వెంట ఉండి తాడివారిపల్లె వలంటీర్లు ఆవులమంద వెంకటేశ్వర్లు, జమ్ముల బాబు ప్రచారంలో పాల్గొన్నారు. ఎన్నికల కోడ్‌ అమలులో ఉన్న నేపథ్యంలో వలంటీర్లు ఎలాంటి ప్రచార కార్యక్రమంలో పాల్గొనకూడదనే ప్రభుత్వ ఆదేశాల ఉన్నప్పటికీ వలంటీర్లు లెక్కచేయకుండా వైసీపీ నాయకులకు ప్రచారం చేస్తున్నారు. వైసీపీ ప్రచారంలో పాల్గొన్న వలంటీర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

వైసీపీ కండువా కప్పుకున్న వలంటీర్‌పై వేటు

పుల్లలచెరువు, మార్చి 22 : మండలంలో ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించిన వలంటీర్‌పై ఎంపీడీవో విలియమ్స్‌ శుక్రవారం వేటు వేశారు. గురువారం ఎర్రగొండపాలెం పట్టణంలోని వైసీపీ కార్యాలయంలో నరజాముల తాండ పంచాయతీలోని మురికిమల్ల వలంటీరు రమావత్‌ వెంకటేశ్వరనాయక్‌ పార్టీ కండువ కప్పుకున్నాడు. దీనిపై ఆంధ్రజ్యోతిలో కథనం ప్రచురితమైంది. ఈ నేపథంలో ఎన్నికల ప్రవర్తన నియమావళి కింద ఉన్నాతాధికారులు ఆదేశాల మేరకు పుల్లలచెరువు ఎంపీడీవో విలియమ్స్‌ వలంటీరును విధుల నుంచి శాశ్వతంగా తొలగించారు. అధికారులు, వలంటీర్లు పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటే కఠిన చర్యలు తప్పవని అన్నారు.

Updated Date - Mar 22 , 2024 | 11:49 PM