Share News

పోలీసుల నిర్లక్ష్యం

ABN , Publish Date - Apr 19 , 2024 | 10:49 PM

టీడీపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గొట్టిపాటి రవికుమార్‌ నామినేషన్‌కు భారీ సంఖ్యలో కేడర్‌ తరలివస్తారని ముందస్తు సమాచారం ఉన్నప్పటికీ పోలీసులు తగిన ఏర్పాట్లు చేయడంలో పూర్తిగా విఫలమయ్యారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. సంతమాగులూరు, బల్లికురవ మండలాలోని అత్యధిక గ్రామాల నుంచి నామ్‌ రోడ్డు ద్వారా అద్దంకిలోజరిగే నామినేషన్‌ ర్యాలీకి కూటమి శ్రేణులు వాహనాలల్లో తరలివచ్చారు.

పోలీసుల నిర్లక్ష్యం
గొట్టిపాటి నామినేషన్‌కు భారీగా తరలివచ్చిన శ్రేణులు

గొట్టిపాటి నామినేషన్‌లో లేని ముందస్తు చర్యలు

నామ్‌రోడ్డులో ట్రాఫిక్‌ మళ్లింపు చేపట్టని వైనం

శింగరకొండ వద్దే వేలాదిగా వెనుదిరిగిన తమ్ముళ్లు

అద్దంకి, ఏప్రిల్‌ 19 : టీడీపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గొట్టిపాటి రవికుమార్‌ నామినేషన్‌కు భారీ సంఖ్యలో కేడర్‌ తరలివస్తారని ముందస్తు సమాచారం ఉన్నప్పటికీ పోలీసులు తగిన ఏర్పాట్లు చేయడంలో పూర్తిగా విఫలమయ్యారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. సంతమాగులూరు, బల్లికురవ మండలాలోని అత్యధిక గ్రామాల నుంచి నామ్‌ రోడ్డు ద్వారా అద్దంకిలోజరిగే నామినేషన్‌ ర్యాలీకి కూటమి శ్రేణులు వాహనాలల్లో తరలివచ్చారు. నామ్‌ రోడ్డులో ట్రాఫిక్‌ను ముందస్తుగానే అడ్డరోడ్డు నుంచి మల్లించడమో లే క నిలిపి వేయాల్సి ఉండగా అలా చేయలేదు. గోపాలపురం, శింగరకొండ వరకు అనుమంతించడంతో భారీ వాహనాలు సైతం బారులు తీరాయి. ఈ నేపథ్యంలో టీడీపీ శ్రేణులు కూడా గోపాలపురం, శింగరకొండ వద్దనే ఆగిపోవలసి వచ్చింది. దీంతో వేలాది మంది కార్యకర్తలు అద్దంకిలో జరిగిన ర్యాలీకి హాజరు కాకుండానే నిరుత్సాహంతో వెనుదిరిగారు. పకడ్బందీగా ఎన్నికలు నిర్వహిస్తామని పదేపదే చెప్తున్నప్పటికీ ఆ దిశగా ఏర్పాట్లు చేయడం లేదని, పోలీసుల నిర్లక్ష్య చర్యలతో ఈ పరిస్థితి ఏర్పడిందని నేతలు ఆరోపిస్తున్నారు.

Updated Date - Apr 19 , 2024 | 10:49 PM