Share News

వైసీపీ కుర్చీని మడతపెట్టేందుకు ప్రజలు సిద్ధం

ABN , Publish Date - Mar 08 , 2024 | 01:08 AM

అవినీతి తప్ప అభివృద్ధి చేయని వైసీపీ ప్రభుత్వ కుర్చిని మడత పెట్టేందుకు ప్రజలు సిద్ధం అయ్యారని వై.పాలెం నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్‌ గూడూరి ఎరిక్షన్‌బాబు అన్నారు.

వైసీపీ కుర్చీని మడతపెట్టేందుకు ప్రజలు సిద్ధం

పుల్లలచెరువు, జనవరి 16: అవినీతి తప్ప అభివృద్ధి చేయని వైసీపీ ప్రభుత్వ కుర్చిని మడత పెట్టేందుకు ప్రజలు సిద్ధం అయ్యారని వై.పాలెం నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్‌ గూడూరి ఎరిక్షన్‌బాబు అన్నారు. గురువారం పుల్లల చెరువు మండలం ముటుకులలో భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అధికార పార్టీలో మంత్రిగా నాలుగున్నరేళ్లు మంత్రిగా పనిచేసిన ఆదిమూలపు సురేష్‌ అవినీతి మినహా అభివృద్ధి చేయలేక పోయారన్నారు. మార్కాపురాన్ని జిల్లా చేస్తామని మంత్రి ఇచ్చిన హామి ఏమైందని ప్రశ్నించారు. పూర్తికాని ప్రాజెక్టును ముఖ్యమంత్రి ప్రారంభిస్తుం టే మంత్రి చోద్యం చూస్తూ ఉండిపో యాడన్నారు. రాష్ట్రంలో వైసీపీ చేసిన అభివృద్ధి ఏమీ లేదన్నారు. దీనిపై చర్చ కు సిద్ధమా..? అని సవాలు విసిరారు. రాష్ట్రానికి ఒక్క ఐటీ పరిశ్రమనైనా తెచ్చాడా...? అని ప్రశ్నించారు. కార్యక్రమంలో టీడీపీ మండలాధ్యక్షుడు పయ్యావుల ప్రసాద్‌, జనసేన అధ్యక్షుడు కోటారి అచ్చయ్య, టీడీపీ మండల నాయకులు కాకర్ల కోటయ్య, పోట్ల గొవిందు, నాయకులుపాల్గొన్నారు.

చంద్రబాబు సభ ఏర్పాట్ల పరిశీలన

ఎర్రగొండపాలెం : నియోజకవర్గం గురిజేప ల్లి గ్రామం వద్ద మార్చి 11 న జరిగే టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ప్రజాగళం సభకు, హెలీప్యాడ్‌కు గురువారం టీడీపీ అభ్యర్ధి గూడూరి ఎరిక్షన్‌బాబు స్థలపరిశీలన చేశారు. 11న ఎర్రగొండపాలెం నియోజకవర్గం నుంచి జరిగే ప్రజాగళం సభకు హైవే రోడ్డు పక్కన ప్రైవేటు స్థలంలో సభా వేదిక స్థలం దగ్గరలోనే హెలిప్యాడ్‌ ల్యాండింగ్‌కు స్థలం శుభ్రం చేయించారు. ఎర్రగొండపాలెం నియోజకవర్గం నుంచి 25 వేల మంది టీడీపీ అభిమానులను, ప్రజలను తరలించేందుకు ఏర్పాట్లను చేస్తున్నారు. బహిరంగసభకు విశాలమైన స్థలం ఏర్పాటు చేస్తున్నారు. టీడీపీ ముఖ్యనాయకులు చిట్యాల వెంగల్‌రెడ్డి, కాకర్ల కోటయ్య, మంత్రునాయక్‌, షేక్‌ వలి, టీడీపీ నాయకులు పాల్గొన్నారు.

Updated Date - Mar 08 , 2024 | 01:09 AM