Share News

పరిశ్రమలకు పాడెకట్టి..

ABN , Publish Date - Apr 19 , 2024 | 11:56 PM

వైసీపీ అసమర్థ పాలన వలన దర్శి నియోజకవర్గంలో అనేక ప్రభుత్వ రంగ సంస్థల నిర్మాణాలు పునాదుల్లోనే నిలిచిపోయాయి. బహుళ ప్రయోజనాలు చేకూరే ప్రాజెక్టులు అటకెక్కడంతో ఈ ప్రాంత అభివృద్ధి కుంటుపడింది. యువతకు ఉద్యోగాలను కోల్పోయారు. ఐదు సంవత్సరాలుగా వైసీపీ పాలకుల నిర్లక్ష్యవైఖరి, తప్పుడు నిర్ణయాల పట్ల ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

పరిశ్రమలకు పాడెకట్టి..
పరిశ్రమల ఏర్పాటుకాక వెలవెలబోతున్న దొనకొండ పార్క్‌

దర్శి నియోజకవర్గంలో ప్రభుత్వరంగ సంస్థలకు మంగళం

టీడీపీ హయాంలో శంకుస్థాపనలు, పనుల ప్రారంభం

జగన్‌రెడ్డి వచ్చాక ఆ టెండర్లన్నీ రద్దు

పూర్తిగా కుంటుపడిన అభివృద్ధి

ఉద్యోగ అవకాశాలు కోల్పోయిన యువత

తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ప్రజలు

దర్శి, ఏప్రిల్‌ 19 : వైసీపీ అసమర్థ పాలన వలన దర్శి నియోజకవర్గంలో అనేక ప్రభుత్వ రంగ సంస్థల నిర్మాణాలు పునాదుల్లోనే నిలిచిపోయాయి. బహుళ ప్రయోజనాలు చేకూరే ప్రాజెక్టులు అటకెక్కడంతో ఈ ప్రాంత అభివృద్ధి కుంటుపడింది. యువతకు ఉద్యోగాలను కోల్పోయారు. ఐదు సంవత్సరాలుగా వైసీపీ పాలకుల నిర్లక్ష్యవైఖరి, తప్పుడు నిర్ణయాల పట్ల ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

పునాదుల్లోనే డ్రైవింగ్‌ శిక్షణ కేంద్రం

టీడీపీ ప్రభుత్వం హయాంలో ప్రారంభించిన జాతీయ స్థాయి డ్రైవింగ్‌ శిక్షణ, పరిశోధన కేంద్రం పునాదుల్లోనే నిలిచిపోయింది. దర్శి-కురిచేడు రోడ్డులో చంద్రబాబు హయాంలో 20 ఎకరాల్లో రూ.18.5 కోట్ల వ్యయంతో ఈ ప్రాజెక్టు నిర్మాణానికి 2018లో శంకుస్థాపన చేశారు. కొంతమేర పనులు జరిగిన తర్వాత ఎన్నికలు రావడంతో నిలిచిపోయాయి. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన జగన్‌రెడ్డి డ్రైవింగ్‌ శిక్షణ కేంద్రాన్ని పట్టించుకోలేదు. ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్‌ నిర్మాణం కోసం కొంతమేరకు కృషి చేసినా ప్రభుత్వ పెద్దలు సహకరించకపోవడంతో అది ముందుకు సాగలేదు. ఇది పూర్తయి ఉంటే వందలాదిమందికి ఉద్యోగావకాశాలు, వేలాది మందికి ఉపాధి లభించేది.

నిలిచిన కోల్డ్‌స్టోరేజీ

మార్కెట్‌ యార్డులో రూ.5కోట్ల వ్యయంతో గత తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో చేపట్టిన కోల్డ్‌స్టోరేజీ నిర్మాణం పునాదుల్లోనే నిలిచిపోయింది. కొంతమేర పనులు జరిగినా ఎన్నికలు రావడంతో ఆగిపోయాయి. వైసీపీ అధికారంలోకి రాగానే ఆ టెండర్లను రద్దు చేశారు. వైసీపీ పాలకులు తమకు అనుకూలంగా మార్చుకునేందుకు మళ్లీ టెండర్లు పిలిచినప్పటికీ ఎవరూ ముందుకు రాలేదు. దీంతో ఆ నిధులను పక్కకు మళ్లించడంతో కోల్డ్‌స్టోరేజీ నిర్మాణం అటకెక్కింది. దర్శి ప్రాంతంలో రైతులు కూరగాయలు పండ్ల తోటలు అధికంగా సాగు చేస్తున్నారు. కోల్డ్‌స్టోరేజీ నిర్మాణం పూర్తయి ఉంటే దానిలో నిల్వ చేసుకొని గిట్టుబాటు ధర ఉన్నప్పుడు అమ్ముకునే అవకాశం ఉండేదని, వైసీపీ తప్పుడు నిర్ణయంతో తాము నష్టపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. మిర్చి ఇతర పంటలను గుంటూరు తీసుకెళ్లి నిల్వ చేసుకోవాల్సిన దుస్థితి ఉంది.

శంకుస్థాపనకే పరిమితమైన మొగలిగుండాల రిజర్వాయర్‌

తాళ్లూరు మండలం, శివరాంపురం సమీపంలో రూ.10.40 కోట్లతో నిర్మించ తలపెట్టిన మొగిలిగుండాల రిజర్వాయర్‌ శంకుస్థాపనకే పరిమితమైంది. టీడీపీ ప్రభుత్వ హకాంలో నిధులు విదుల కావడంతో పాటు టెండర్ల ప్రక్రియ పూర్తయింది. అప్పటి మంత్రి శిద్దా శంకుస్థాపన చేశారు. అనంతరం వచ్చిన వైసీపీ అకారణంగా ఆ టెండర్లను రద్దు చేసింది. అధికార పార్టీకి అనుకూలమైన వారికి టెండర్లు కట్టబెట్టేందుకు రీటెండర్లు పిలిచారు. ఒక కాంట్రాక్టర్‌ టెండర్‌ దక్కించుకోగా అధికార పార్టీలో కుమ్ములాటల వలన ఆటెండర్‌ను కూడా మళ్లీ రద్దు చేశారు. ఆ తర్వాత మళ్లీ టెండర్‌ పిలిచి ముఓ వ్యక్తికి టెండర్‌ అప్పచెప్పినా పనులు నిర్వహించలేదు. దీంతో ఈ రిజర్వాయర్‌ నిర్మాణం మూలనపడింది. ఈ పథకం పూర్తయితే తాళ్లూరు మండలంలోని అనేక గ్రామాల్లో భూగర్భజలాలు పెరిగి తాగునీటి సమస్య పూర్తిగా తొలగిపోయేది.

Updated Date - Apr 19 , 2024 | 11:56 PM