Share News

సైకిల్‌ గుర్తుకే మా ఓటు

ABN , Publish Date - Apr 19 , 2024 | 10:44 PM

మాకు తొలిసారిగా ఓ టు హక్కు వచ్చింది. మా ఓటును సైకిల్‌ గుర్తుపైనే వేస్తామని నవ యువ ఓటర్లు ప్రకటించా రు. చంద్రబాబు ముఖ్యమంత్రి కావడం అనివార్యం. ఉద్యోగ, ఉపాధి, అభివృద్ధి, సంక్షే మం బాబుతోనే సాధ్యమని చీరాల మండలం వాడరేవుకు చెందిన తొలిసారిగా ఓటు హక్కును పొందిన పలువురు యువకులు పేరొన్నారు.

సైకిల్‌ గుర్తుకే మా ఓటు
ఏబీసీ కార్మికులతో మాట్లాడుతున్న కొండయ్య

కూటమి అభ్యర్థి కొండయ్య

సమక్షంలో టీడీపీలో చేరిన యువకులు

చీరాల, ఏప్రిల్‌ 19 : మాకు తొలిసారిగా ఓ టు హక్కు వచ్చింది. మా ఓటును సైకిల్‌ గుర్తుపైనే వేస్తామని నవ యువ ఓటర్లు ప్రకటించా రు. చంద్రబాబు ముఖ్యమంత్రి కావడం అనివార్యం. ఉద్యోగ, ఉపాధి, అభివృద్ధి, సంక్షే మం బాబుతోనే సాధ్యమని చీరాల మండలం వాడరేవుకు చెందిన తొలిసారిగా ఓటు హక్కును పొందిన పలువురు యువకులు పేరొన్నారు. శుక్రవారం వారు టీడీపీ కార్యాలయంలో కూటమి అభ్యర్థి ఎంఎం కొండయ్య సమక్షంలో టీడీపీలో చేరారు. వారిని కొండయ్య సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా కొండయ్య మాట్లాడుతూ నూతనంగా ఓటు హక్కు పొందిన మీలో ఉన్న కసి, ఉత్సాహం చూస్తుంటే ప్రజా చైతన్యానికి నిదర్శనంగా కన్పిస్తోందన్నారు. ఆ స్ఫూర్తిని గ్రామంలో మిగిలిన వారిలోనూ రగిలించాలని వారిని కూడా కార్యోన్ముఖులను చేయాలని దిశానిర్దేశం చేశారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ఆదరించండి.. నమ్మకాన్ని వమ్ముచేయను

చీరాల, ఏప్రిల్‌ 19 : ఆదరించి.. ఓటు వేసి.. గెలిపించండి.. మీ నమ్మకాన్ని వమ్ముచేయనని కూటమి అభ్యర్థి కొండయ్య అభ్యర్థించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన శుక్ర వారం పలు ప్రాంతాల్లో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలతో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఎమ్మెల్యే అభ్యర్థిగా నన్ను, ఎంపీ అభ్యర్థిగా తెన్నేటి కృష్ణప్రసాద్‌ను సైకిల్‌ గుర్తుపై ఓట్లేసి గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్ర బాబును ముఖ్యమంత్రిగా గెలిపించుకుం దామన్నారు. సూపర్‌ సిక్స్‌ పథకాలు, బీసీ డిక్లరేషన్‌ ప్రయోజనాలను వివరించారు. రామకృష్ణాపురం పరిధిలోని ఏబీసీ సంస్థ మహిళాకార్మికులతో సమావేశమయ్యారు. అనంతరం ఉడ్‌నగర్‌, కొట్లబజారు తదితర ప్రాంతాల్లో కొండయ్య ఇంటింటి ప్రచారం చేశారు. ఆయా ప్రాంతాల ప్రజల నుంచి సానుకూల స్పందన వచ్చింది. కార్యక్రమంలో కూటిమి పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - Apr 19 , 2024 | 10:44 PM