పంచాయతీ కార్యదర్శి చేతివాటంపై కలెక్టర్‌కు ఫిర్యాదు
ABN , Publish Date - Nov 18 , 2024 | 11:18 PM
పంచాయతీ కార్యదర్శి చేతివాటంపై రుద్రవరం గ్రామస్థులు సోమవారం ఒంగోలు కలెక్టరేట్‌లో జరిగిన గ్రీవెన్స్‌లో ఫిర్యాదు చేశారు.
లీవ్‌లో ఉన్న కార్యదర్శితో ఓటీపీ చెప్పించుకుని నిధులు డ్రా
సంతనూతలపాడు, నవంబరు18(ఆంధ్రజ్యోతి): పంచాయతీ కార్యదర్శి చేతివాటంపై రుద్రవరం గ్రామస్థులు సోమవారం ఒంగోలు కలెక్టరేట్‌లో జరిగిన గ్రీవెన్స్‌లో ఫిర్యాదు చేశారు. వివరాల్లోకి వెళితే మండలంలోని రుద్రవరం గ్రామం లో గతనెల అక్టోబరు 16న సీసీరోడ్డుకు శంకుస్థాపన కార్యక్రమాన్ని ఎంపీడీవో, అక్కడ పనిచేసే కార్యదర్శికి బాధ్యతలు అప్పగించారు. రుద్రవరం గ్రామంలో పనిచేసే కార్యదర్శి మెటర్నటీ లీవ్‌లో ఉండటంతో మంగమూరు గ్రామపంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తున్న ప్రతా్‌పకు రెండురోజులు రుద్రవరం గ్రామ బాధ్యతలు అప్పగించారు. ఎమ్మెల్యే కా ర్యక్రమం కోసం ముందుగానే గ్రామంలో బ్లీచింగ్ చల్లి, పారిశుఽధ్య చర్యలు చేపడతారు. ఈక్రమంలో పంచాయతీస్టోర్‌లో బ్లీచింగ్ బస్తాలు ఉండగానే సర్పంచ్ ,ఇన్‌చార్జ్‌గా బాధ్యతలు తీసుకున్న పం చాయతీ కార్యదర్శి ప్రతాప్ కలిసి బ్లీచిం గ్ అవసరం లేకున్నా రూ.14వేల విలువచేసే 20 బస్తాల బ్లీచింగ్, 40 బస్తాల సున్నం తెప్పించారు. నవంబరు 2న 14వేల విలువచేసే వాటికి మెటర్నిటీ లీవ్‌లో ఉన్న పంచాయతీ కార్యదర్శితో ఓటీపీ చెప్పించుకుని రూ.49వేలు డ్రాచేశారు. ఎమ్మెల్యే ప్రోగ్రాం సమయం లో వర్షం పడుతుం టే బ్లీచింగ్ ఎక్కడ చల్లారో కూడా గ్రామప్రజలకు తెలియని పరిస్థితి. నిధులు గోల్‌మాల్‌పై చేతివాటం చూపిన పంచాయతీ కార్యదర్శి ప్రతాప్, సర్పంచ్ పై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.
నిధుల డ్రా పై ఫిర్యాదు
మండలంలోని రుద్రవరం గ్రామంలో నేలటూరు డొంకకు రోడ్డు వేయకుండానే వేసినట్లు 2023 ఆగస్టు 4న ఎంబుక్‌లో రికార్డు చేసి రూ.లక్షా19వేల720ల నిధులను అక్రమంగా డ్రాచేయడంపై గ్రామస్థులు, కూకట్ల కాలనీవాసులు సోమవారం ఒంగోలు కలెక్టరేట్‌లో జరిగిన గ్రీవెన్స్‌లో ఫిర్యాదుచేశారు. అదేవిధంగా గ్రావెల్ రోడ్డును ఆనుకుని ఉన్న కూకట్లకోటయ్య కాలనీలో అవసరం లేకపోయినా మట్టితోలి వాటికి 2000వేల ట్రిప్పులు తోలినట్లు రికార్డు చేశారని ఆఫిర్యాదు పేర్కొన్నారు. అలాగే జగనన్న కాలనీల్లో సైతం ఇవే అక్రమాలు జరిగాయని వీటిపై విచారణ జరిపి ప్రజలసొమ్మను అక్రమంగా దోచుకున్నవారిపై తగిన చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు ఆ ఫిర్యాదులో కోరారు.