Share News

ఎవరు గెలిచినా..మీదే గెలుపు..!

ABN , Publish Date - Jun 07 , 2024 | 12:23 AM

ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారనే విషయంపై ప్రజల నాడి తెలుసుకునేందుకు ఆంధ్రజ్యోతి నిర్వహించిన కూపన్ల పోటీలో జిల్లా స్థాయిలో మొదటి స్థానంలో మార్కాపురానికి చెందిన ఎం.గుల్జార్‌ నిలిచారు. ఇటు జిల్లా స్థాయిలోనూ, అటు రాష్ట్ర స్థాయిలోనూ విజేత ఎవరో ఊహించాలో చెప్పాలంటూ ఆంధ్రజ్యోతిలో కూపన్లు ప్రచురించిన సంగతి తెలిసిందే.

ఎవరు గెలిచినా..మీదే గెలుపు..!

ఆంధ్రజ్యోతి కూపన్ల పోటీలో జిల్లా స్థాయి విజేతల గుర్తింపు

మొదటి స్థానంలో నిలిచిన మార్కాపురం వాసి

(ఆంధ్రజ్యోతి, ఒంగోలు)

ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారనే విషయంపై ప్రజల నాడి తెలుసుకునేందుకు ఆంధ్రజ్యోతి నిర్వహించిన కూపన్ల పోటీలో జిల్లా స్థాయిలో మొదటి స్థానంలో మార్కాపురానికి చెందిన ఎం.గుల్జార్‌ నిలిచారు. ఇటు జిల్లా స్థాయిలోనూ, అటు రాష్ట్ర స్థాయిలోనూ విజేత ఎవరో ఊహించాలో చెప్పాలంటూ ఆంధ్రజ్యోతిలో కూపన్లు ప్రచురించిన సంగతి తెలిసిందే. జిల్లా స్థాయిలో విజేతలన గుర్తించేందుకు వచ్చిన కూపన్లలో కచ్చితమైన ఫలితాలను ముందుగానే పేర్కొన్న కూపన్లను గురువారం సాయంత్రం త్రోవగుంట వద్ద ఉన్న ఆంధ్రజ్యోతి యూనిట్‌ కార్యాలయంలో డ్రా తీశారు. పెద్ద సంఖ్యలో వచ్చిన కూపన్లలో సరైన ఫలితాలను చూచించిన కూపన్లను ఎంపిక చేశారు. జిల్లాలో పది అసెంబ్లీ స్థానాలు టీడీపీకి, రెండు స్థానాలు వైసీపీకి దక్కనున్నాయని అనేక మంది వారి కూపన్లలో పేర్కొన్నారు. కొందరు మాత్రం ప్రస్తుతం టీడీపీ ఏ స్థానాల్లో గెలిచేది, వైసీపీ ఏ స్థానాల్లో గెలిచేది స్పష్టంగా గుర్తించారు. అలా అన్ని స్థానాలను కచ్చితంగా గుర్తించిన కూపన్ల నుంచి నలుగురిని డ్రా ద్వారా ఎంపిక చేశారు. బ్రాంచ్‌ మేనేజర్‌ ఐవీ.సుబ్బారావు తీసిన డ్రాలో మొదటి విజేతగా మార్కాపురంలోని గోర్లగడ్ల ప్రాంతానికి చెందిన ఎం.గుల్జార్‌ నిలిచారు. రెండో స్థానంలో ముగ్గురి ఎంపిక చేసేందుకు తీసిన డ్రాలో మార్కాపురానికే చెందిన బి.రాజేష్‌, కనిగిరిలోని సుభాష్‌ రోడ్డు ప్రాంతానికి చెందిన బచ్చలి వెంకటనాగలక్ష్మి, పెద్దారవీడు మండలం ఎస్‌.కొత్తపల్లికి చెందిన తిరుమలరెడ్డి లక్ష్మీదేవి నిలిచారు. మొదటి విజేతకు రూ.10వేలు, రెండో స్థానంలో నిలిచిన ఒక్కొక్కరికి రూ.5 వేల చొప్పున ఇవ్వనున్నట్లు బీఎం సుబ్బారావు తెలిపారు. రాష్ట్ర స్థాయిలో విజేతలను గుర్తిస్తూ వచ్చిన కూపన్ల డ్రా విజయవాడ కార్యాలయంలో జరుగుతుందని, అందులో తొలి స్థానంలో నిలిచిన వారికి రూ. లక్ష, రెండో స్థానంలో నిలిచిన వారికి రూ.50వేలు, ఆ తర్వాత స్థానంలో నిలిచిన ఐదుగురికి రూ.10 వేల చొప్పున అందించనున్నట్లు తెలిపారు. ఈ డ్రా కార్యక్రమంలో ఎడిటోరియర్‌ ఇన్‌చార్జి ఆళ్ల శ్రీనివాసులు, ఏసీఎం రమణ, సాం కేతిక విభాగం ఇన్‌చార్జి రామకోటేశ్వరరావు, ప్రొడక్షన్‌ ఇన్‌చార్జి ఉమా తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jun 07 , 2024 | 12:23 AM