Share News

ఉద్యాన పంటలకు ఊతమేదీ..!

ABN , Publish Date - May 23 , 2024 | 09:57 PM

కనిగిరి ప్రాంతంలో ఉద్యానపంటల సాగుచేసే రైతుల కు ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం అందడంలేదు. నియోజకవర్గంలోని కనిగిరి, హనుమంతునిపాడు, వెలిగండ్ల మండలాల్లో ఉద్యాన పంటలైన దానిమ్మ, నిమ్మ, బత్తాయి, మామిడి, రేగు, మిరప, సీతాఫలం, సపోటా, జామ సాగు చేస్తున్నారు.

ఉద్యాన పంటలకు ఊతమేదీ..!
కనిగిరి మండలం వంగపాడులో కాయదశకు చేరుకున్న దానిమ్మ

కనిగిరి ప్రాంతంలో దానిమ్మి, నిమ్మ, సపోటా సాగు

కనిగిరి, మే 23: కనిగిరి ప్రాంతంలో ఉద్యానపంటల సాగుచేసే రైతుల కు ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం అందడంలేదు. నియోజకవర్గంలోని కనిగిరి, హనుమంతునిపాడు, వెలిగండ్ల మండలాల్లో ఉద్యాన పంటలైన దానిమ్మ, నిమ్మ, బత్తాయి, మామిడి, రేగు, మిరప, సీతాఫలం, సపోటా, జామ సాగు చేస్తున్నారు. వర్షాభావ పరిస్థితిల దృష్ట్యా ఉద్యాన పంటల దిగుమతి రోజురోజుకు తగ్గిపోయి పెట్టుబడులు కూడా రాకపోవటంతో రైతులు నష్టాల బాట పట్టారు. దీంతో రైతులు ఉద్యాన పంటల సాగుపై అనాసక్తి కనపరుస్తున్నారు. కనిగిరి మండలంలో నిమ్మ 92 హెక్టార్లలో సా గు చేస్తున్నారు. బత్తాయి 159 హెక్టార్లలో, సపోటా 2 హెకార్లలో సాగు చేపట్టారు. సీతాఫలం నాలుగు హెక్టార్లలో, బొప్పాయి 18 హెక్టార్లు, రేగు మూడు హెక్టార్లు, మామిడి 23 హెక్టార్లు, దానిమ్మ 66 హెక్టార్లలో సాగులో ఉన్నాయి. ఇటీవల కురిసిన వర్షాల గాలులకు యడవల్లి ప్రాంతంలోని బొప్పాయి పంట దెబ్బతింది.

హెచ్‌ఎంపాడు మండలంలో 445 హెక్టార్లలో నిమ్మ సాగు చేపట్టారు. మిరప 87 హెక్టార్లలో సాగుచేయగా, ఇప్పటికే చాలా చోట్ల కోతకోసి అమ్మకాలు చేపట్టారు. మామిడి 17 హెక్టార్లలో సాగు చేశారు. వెలిగండ్ల మండలంలో నిమ్మ 83 హెక్టార్లలో సాగు చేపట్టగా కాయ దశకు వచ్చింది. బత్తాయి 69 హెక్టార్లలో, మిరప 147 హెక్టార్లలో, మామిడి 25 హెక్టార్లలో సాగు చేస్తున్నారు. ప్రభుత్వం నుంచి సరైన ప్రోత్సహం ఉంటే కనిగిరి ప్రాంతంలోని ఉద్యానపంటల సాగు విస్తారంగా చేపట్టే అవకాశం ఉంది.

Updated Date - May 23 , 2024 | 09:58 PM