Share News

టీడీపీలో నూతనోత్సాహం

ABN , Publish Date - Feb 26 , 2024 | 11:05 PM

టీడీపీ క్యాడర్‌ ఫుల్‌ జోష్‌లో ఉంది. తొలి జాబి తాలోనే అద్దంకి టీడీపీ అభ్యర్థిగా గొట్టిపాటి రవికుమార్‌ను ప్రకటించటం తో పాటు అధినేత చంద్రబాబునాయుడు రాష్ట్ర స్థాయిలో కీలక అంశా లను చర్చించే సమయంలో కూడా గొట్టిపాటికి ప్రాధాన్యత ఇస్తున్నారు.

టీడీపీలో నూతనోత్సాహం
ఎమ్మెల్యే రవికుమార్‌కు సంఘీభావం తెలుపుతున్న అద్దంకి పట్టణంలోని 13వ వార్డు నేతలు(ఫైల్‌)

అత్యధిక గ్రామాల నుంచి స్వచ్ఛందంగా

గొట్టిపాటిని కలుస్తున్న కార్యకర్తలు, ఓటర్లు

అద్దంకి, ఫిబ్రవరి 26: టీడీపీ క్యాడర్‌ ఫుల్‌ జోష్‌లో ఉంది. తొలి జాబి తాలోనే అద్దంకి టీడీపీ అభ్యర్థిగా గొట్టిపాటి రవికుమార్‌ను ప్రకటించటం తో పాటు అధినేత చంద్రబాబునాయుడు రాష్ట్ర స్థాయిలో కీలక అంశా లను చర్చించే సమయంలో కూడా గొట్టిపాటికి ప్రాధాన్యత ఇస్తున్నారు. దీనికితోడు గత మూడు, నాలుగు నెలల ముందు నుంచే గొట్టిపాటి ఏదో ఒక కార్యక్రమం నిర్వహిస్తూ ప్రజలలో మమేకమై ప్రత్యర్థులకు అంద నంత ముందులో ఉన్నారు. నియోజకవర్గంలో అత్యధిక గ్రామాలు కవర్‌ అయ్యే విధంగా సైకిల్‌ యాత్రలు నిర్వహించారు. సైకిల్‌ యాత్రలో కవర్‌ కాని గ్రామాలలో బాబు ష్యూరిటీ, భవిష్యత్‌ గ్యారెంటీ కార్యక్రమం ఏర్పా టుచేసి పాల్గొన్నారు.

ఇక ఎన్నికలు సమీపించటంతో తొలి విడతలో అన్ని మండలాల నేతల తో సమీక్ష సమావేశాలు నిర్వహించారు. ప్రస్తుతం గ్రామాలవారీ సమీక్ష లు ప్రారంభించారు. ఒక్కో గ్రామం నుంచి 50 నుంచి వంద మందికి తగ్గకుండా సమీక్షకు హాజరయ్యేలా చేస్తున్నారు. వీటిన్నింటికి మించి ఆ యా గ్రామాలలో తటస్థులు, టీడీపీ వైపు వచ్చే శ్రేణులను కూడా పిలి పించి అందరి సమక్షంలోనే సమీక్ష నిర్వహిస్తున్నారు.

బల్లికురవ, సంతమాగులూరు మండలాలలో గత 20 సంవత్సరాల నుంచి పరిచయాలు ఉండటం, మిగిలిన అద్దంకి, పంగులూరు, కొరిశపా డు మండలాలలో కూడా గత మూడు ఎన్నికలలో సంబంధాలు ఉండటం గొట్టిపాటికి కలిసి వచ్చే అంశంగా మారింది. నియోజకవర్గంలో సుమారు 80శాతం ఓటర్లు ఏదో ఒక సందర్భంలో రవికుమార్‌కు ఓటు వేసి ఉండటం, అత్యధిక శాతం ఓటర్లకు నేరుగా వ్యక్తిగత పరిచయం ఉండటం కలిసి వచ్చేఅంశంగా మారింది.

ఈనేపథ్యంలోనే నేతలతో పనిలేకుండా ఎక్కువ మంది ఓటర్లు గొట్టిపా టిని కలిసి సంఘీభావం తెలుపుతున్నారు. పలువురు నేతలు సైతం అధికారపార్టీలో ఉన్నా మధఽ్యవర్తులతో సంబంధం లేకుండా నేరుగా వెళ్లి క లిస్తున్నారు. కొంతమంది అధికారపార్టీ నేతలు రవికుమార్‌కు సంఘీభా వం తెలిపిన తరువాత అధికారపార్టీ నేతల నుంచి వస్తున్న ఒత్తిడి తో కొద్దిమంది వెనుకడుగు వేస్తున్నప్పటికీ వాళ్ళతో వెళ్లిన అత్యధిక శాతం క్యాడర్‌ మాత్రం గొట్టిపాటితోనే నడుస్తున్నారు. గత ఎన్నికలలో ఫ్యాన్‌ గాలి బాగా వీచినప్పటికి 13 వేలకు పైగా మెజారీటీతో గొట్టిపాటి గెలుపొందగా, ప్రస్తుతం మారిన పరిస్థితుల నేపథ్యంలో భారీ మెజార్టీ సాధించే దిశ గా టీడీపీ క్యాడర్‌, నేతలు అడుగులు వేస్తున్నారు. దీంతో అద్దంకి నియోజ కవర్గ టీడీపీ క్యాడర్‌లో నూతనోత్సాహం వచ్చింది.

Updated Date - Feb 26 , 2024 | 11:05 PM