Share News

వైసీపీ నిర్లక్ష్యం.. పూర్తికాని టీటీడీ కల్యాణ మండపం

ABN , Publish Date - Mar 29 , 2024 | 01:24 AM

దర్శి పట్టణంలోని తూర్పుగంగవరం రోడ్డులో నిర్మించ తపపెట్టిన టీటీడీ కల్యాణ మండపం శంకుస్థాపనకే పరిమితమైంది. రెండేళ్ల కిందట రూ.5 కోట్ల వ్యయంతో నిర్మించ తలపెట్టిన టీటీడీ కల్యాణ మండపానికి అప్పటి టీటీడీ బోర్డు చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి అట్టహాసంగా భూమిపూజ చేశారు.

వైసీపీ నిర్లక్ష్యం..   పూర్తికాని టీటీడీ కల్యాణ మండపం
కల్యాణ మండప నిర్మాణాని కోసం వేసిన శిలాఫలకం

అసంతృప్తిలో డిపాజిట్‌ దాతలు

వైవీ శంకుస్థాపనకు మూడేళ్లు

నేటికీ విడుదల కాని నిధులు

ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ప్రజలు

దర్శి, మార్చి 28 : దర్శి పట్టణంలోని తూర్పుగంగవరం రోడ్డులో నిర్మించ తపపెట్టిన టీటీడీ కల్యాణ మండపం శంకుస్థాపనకే పరిమితమైంది. రెండేళ్ల కిందట రూ.5 కోట్ల వ్యయంతో నిర్మించ తలపెట్టిన టీటీడీ కల్యాణ మండపానికి అప్పటి టీటీడీ బోర్డు చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి అట్టహాసంగా భూమిపూజ చేశారు. ఆ తర్వాత నిర్మాణాన్ని పట్టించుకోలేదు. ప్రస్తుతం అక్కడున్న శిలఫలకం వెక్కిరిస్తోంది. టీటీడీ బోర్డు నిర్మాణానికి రామాలయం మాన్యం భూ మిని ఎకరం కేటాయించారు. ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్‌ కల్యాణ మం డపం నిర్మాణాన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని ఎంతో పోరాడి రామాలయ మాన్యం భూమిని టీటీడీకి కన్వర్ట్‌ చేయించారు. నిబంధనల ప్రకారం చె ల్లించాల్సిన రూ. 50లక్షలను దాతల సహకారంతో సమకూర్చి డీడీ తీసి టీటీడీ బోర్డుకు కూడా పంపారు. నిర్మాణానికి అవసరమైన అన్ని వనరులు సమకూర్చినప్పటికీ ఇప్పటి వరకు అడుగు ముందుకు పడలేదు. 19-12-2021 తే దీన కల్యాణ మండపం నిర్మాణానికి వైవీ సుబ్బారెడ్డి శంకుస్థాపన చేశారు. ఏడాదిలోగా మౌలిక వసతులతో కల్యాణ మండపాన్ని నిర్మిస్తామ ని హామీ ఇచ్చారు. ఇప్పటి వరకు నిధులు విడుదల కాకపోవడంతో అలాగే నిలచిపోయింది. డిపాజిట్‌ విరాళాన్ని అందించిన దాతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు ఎన్నికల షెడ్యూల్‌ రావడంతో ఇప్పట్లో ని ర్మాణం చేపట్టే అవకాశమే లేదు. వైసీపీ ప్రభుత్వం ని ర్లక్ష్య వైఖరి కారణంగా చేపట్టిన ఒక్క నిర్మాణం పూర్తి కాలేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - Mar 29 , 2024 | 01:24 AM