Share News

ఎన్‌ఏపీ మంచినీటి పథకం అస్తవ్యస్తం

ABN , Publish Date - Jan 07 , 2024 | 09:53 PM

120 గ్రామాలకు తాగునీరు అం దించే ఎన్‌ఏపీ రక్షిత మంచినీటి పథకం అస్తవ్యస్తం గా మారింది. ఏళ్ల తరబడి సమ్మర్‌ స్టోరేజీ ట్యాంకులో పూడిక తీయకపోవడంతో నిల్వ సామర్థ్యం తగ్గిపోయింది. సుమారు 35 సంవత్సరాల క్రితం వేసిన పైపులైన్లు, నిర్మించిన ఒవర్‌హెడ్‌ ట్యాంకులు శిథిలావస్ధకు చేరాయి. దీంతో తాగునీటి సరఫరా సక్రమంగా జరగడం లేదు. స్కీమ్‌ పరిధిలోని గ్రామాలకు మంచినీరు అందక ప్రజలు అవస్థలు పడుతున్నారు. దర్శి ఎన్‌ఏపీ చెరువు ద్వారా దర్శి, ముండ్లమూరు, పొదిలి త దితర ప్రాంతాలకు 120 గ్రామాలకు నీరు పం పిణీ చేయాల్సి ఉంది.

ఎన్‌ఏపీ మంచినీటి పథకం అస్తవ్యస్తం
నిల్వ సామర్థ్యం కోల్పోయిన దర్శి సమ్మర్‌ స్టోరేజీ ట్యాంక్‌

శిథిలావస్థకు చేరిన పైపులు,

ఓవర్‌హెడ్‌ ట్యాంకులు

నీటి సరఫరాకు తీవ్ర ఆటంకం

తాగు నీరు సక్రమంగా అందక అవస్థలు

దర్శి, జనవరి 7 : 120 గ్రామాలకు తాగునీరు అం దించే ఎన్‌ఏపీ రక్షిత మంచినీటి పథకం అస్తవ్యస్తం గా మారింది. ఏళ్ల తరబడి సమ్మర్‌ స్టోరేజీ ట్యాంకులో పూడిక తీయకపోవడంతో నిల్వ సామర్థ్యం తగ్గిపోయింది. సుమారు 35 సంవత్సరాల క్రితం వేసిన పైపులైన్లు, నిర్మించిన ఒవర్‌హెడ్‌ ట్యాంకులు శిథిలావస్ధకు చేరాయి. దీంతో తాగునీటి సరఫరా సక్రమంగా జరగడం లేదు. స్కీమ్‌ పరిధిలోని గ్రామాలకు మంచినీరు అందక ప్రజలు అవస్థలు పడుతున్నారు. దర్శి ఎన్‌ఏపీ చెరువు ద్వారా దర్శి, ముండ్లమూరు, పొదిలి త దితర ప్రాంతాలకు 120 గ్రామాలకు నీరు పం పిణీ చేయాల్సి ఉంది. 35 సంవత్సరాల కిందట వేసిన పైపులైన్‌ భూమిలో అడుగున శిథిలమై ఉన్నాయి. ఒత్తిడికి పగిలిపోయి తరచూ నీటి పంపిణీకి ఆటంకం కలుగుతోంది. పైపులు మ రమ్మతులు చేయాలంటే సిబ్బంది 5 అడుడులు గుంతతీసి తెలుసుకునేందుకు కష్టతరమవుతుంది. అదేవిధంగా ఒవర్‌హెడ్‌ ట్యాంకులు కూడా కూలే దశకు చేరాయి. పంపింగ్‌ చేసే మో టార్లు తుప్పుపట్టి పోవడంలో సక్రమంగా పనిచేయక తరచూ మరమ్మతులకు గురవుతున్నా యి. ఇటీవల విద్యుత్‌ ట్రాన్స్‌ ఫార్మర్‌ చెడిపోవడంతో పట్టణంలోని అనేక ప్రాంతాలకు నీటి స రఫరా కాలేదు. ప్రస్తుతం ఏదో ఒక ప్రాంతంలో పైపులైన్లు పగిలి నీటి సరఫరాకు అంతరాయం కు ల్గుతుంది. ఆధునీకరణ పనుల కోసం అధికారులు ప్రతిపాదనలు పంపినా నిధులు విడుదల కాకపోవడంతో అలాగే నెట్టుకొస్తున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే ఈ స్కీమ్‌ మరింత అధ్వానంగా తయారై మూ లనపడే ప్రమాదం ఉంది. ప్రభుత్వం యుద్ధప్రా తిపదికన స్కీమ్‌ అభివృద్ధి పనులకు నిధులు విడుదల చేయాలని ప్రజలు కోరుతున్నారు.

Updated Date - Jan 07 , 2024 | 09:53 PM