Share News

ముత్తుములకే స్థానిక నేతలు జై

ABN , Publish Date - Apr 03 , 2024 | 12:45 AM

నియోజకవర్గంలో టీడీపీలోకి రోజురోజుకు చేరికల జోరు పెరుగుతోంది. గెలుపోటములతో సంబంధం లేకుండా నియోజకవర్గాన్ని అంటిపెట్టుకొని ప్రజాసమస్యలపై పోరాటం చేస్తున్న టీడీపీ అభ్యర్థి ముత్తుముల అశోక్‌రెడ్డికే వివిధ పార్టీలలోని స్థానిక నేతలు సైతం జై కొడుతున్నారు.

ముత్తుములకే స్థానిక నేతలు జై

గిద్దలూరు టౌన్‌, ఏప్రిల్‌ 2 : నియోజకవర్గంలో టీడీపీలోకి రోజురోజుకు చేరికల జోరు పెరుగుతోంది. గెలుపోటములతో సంబంధం లేకుండా నియోజకవర్గాన్ని అంటిపెట్టుకొని ప్రజాసమస్యలపై పోరాటం చేస్తున్న టీడీపీ అభ్యర్థి ముత్తుముల అశోక్‌రెడ్డికే వివిధ పార్టీలలోని స్థానిక నేతలు సైతం జై కొడుతున్నారు. మంగళవారం కొమరోలు మండలం రాజుపాలెం గ్రామానికి చెందిన 30 కుటుంబాలు టీడీపీ నాయకుడు గోడి ఓబులరెడ్డి ఆధ్వర్యంలో టీడీపీలో చేరాయి. వీరికి ముత్తుముల అశోక్‌రెడ్డి పార్టీ కండువాకప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా అశోక్‌రెడ్డి మాట్లాడుతూ టీడీపీ అధికారం లోకి రాగానే సూపర్‌సిక్స్‌ పథకాలను అమలు చేస్తుందని, ఈ విషయాలను విస్తృతంగా ప్రచారం చేయాలన్నారు. పార్టీలో చేరిన వారిలో మల్లారపు రామస్వామి, వెంకటేశ్వ ర్లు, నారాయణస్వామి, వెంకటేశ్వర్లు, సుబ్బరాయుడు, నారాయణ, శివ, శ్రీనివాసులు, రామయ్య, ఎం.వెంకటేశ్వ ర్లు, పి.శాయన్న, దాంతా శ్రీనివాసులు, తదితరులు పార్టీలో చేరారు.

ఫారం నుంచి 20 కుటుంబాలు

రాచర్ల మండలంలోని ఫారంలో జరిగిన కార్యక్రమంలో 20 కుటుంబాలు టీడీపీలో చేరాయి. వీరికి అశోక్‌రెడ్డి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారిలో జిల్లెళ్ళ కిరణ్‌, పూలా శ్రీను, వెంకటసుబ్బయ్య, భాస్కర్‌, మోహన్‌, అల్లూరయ్య, చిన్నబాబు, యలగపాటి రమేష్‌, రాజు, కార్తీక్‌, డేవిడ్‌, మీనిగ ఖాజా, రమణ, రోశయ్య, పుల్లయ్య తదితరులు ఉన్నారు.

బీసీ కుటుంబాల చేరిక

కంభం పట్టణానికి చెందిన 15 బీసీ కుటుంబాలు వైసీపీని వీడి టీడీపీలో చేరాయి. వీరందరికీ అశోక్‌రెడ్డి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. మహిళ అధ్యక్షురాలు తోట మహాలక్ష్మి ఆధ్వర్యంలో బల్లారపు సుబ్బయ్య, లక్కాకుల తిరుపతయ్య, దేవిరెడ్డి సురేష్‌, బాలరంగయ్య, శేషారావు, చాబోలు ఆంజనేయులు, ఏరువా వెంకట రమణ, రాధా, పద్మ, రాద్రి, నాగమణి, లక్ష్మీశెట్టి పద్మ, నలబుల లక్ష్మీ తదితరులు టీడీపీలో చేరారు.

అశోక్‌రెడ్డి విజయానికి బీజేపీ కృషి

గిద్దలూరుటౌన్‌ : రానున్న ఎన్నికలలో ఎన్‌డీఏ అభ్యర్థిగా పోటీచేస్తున్న ముత్తుముల అశోక్‌రెడ్డి విజయానికి తామంతా కృషి చేస్తామని బీజేపీ నాయకులు అన్నారు. మంగళవారం టీడీపీ కార్యాలయంలో ముత్తుముల అశోక్‌రెడ్డికి బీజేపీ నాయకులు పిడతల రమేష్‌రెడ్డి, దూదేకుల బాదుల్లా, కమలపాటి చంద్రమోహన్‌, వెంకట రామిరెడ్డి, వెంకటేశ్వర్లు, వీరచక్రం, కొప్పుల నరసింహులు, సూరేపల్లి చెన్నకేశవులు, సాపూరు శివనాగేంద్ర, బిజెపి మహిళ నాయకురాలు షేక్‌ ముతహర్‌ తదితరులు కలిసి మద్దతు తెలిపారు.

గిద్దలూరు టౌన్‌ : టీడీపీ, జనసేన, బీజేపీల ఉమ్మడి మానిఫెస్టోలోని సూపర్‌ సిక్స్‌ పథకాలతో రాష్ట్రంలో కొత్త వెలుగులు వస్తాయని గిద్దలూరు నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి ముత్తుముల అశోక్‌రెడ్డి అన్నారు. మంగళవారం రాచర్ల మండలంలో రెండవ రోజు ఆయన విస్తృతంగా పర్యటించారు. రాచర ్లఫారం, రాచర్ల, పలుగుంటిపల్లి, గౌతవరం, అనంపల్లె, జేపీ.చెరువు, చినగానిపల్లె, అక్కపల్లె, చోళ్లవీడు, అచ్చంపేట, ఆకవీడు, ఆరవీటికోట గ్రామాలలో ఆయన పర్యటించారు. టీడీపీ శ్రేణులతో ఆయన ప్రత్యేకంగా సమావేశమయ్యారు. మే 13న జరిగే ఎన్నికల్లో గిద్దలూరు నుంచి ఎన్‌డీఏ కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనను, ఒంగోలు పార్లమెంటు అభ్యర్థిగా పోటీ చేస్తున్న మాగుంట శ్రీనివాసరెడ్డిని సైకిల్‌ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. తాను ఎమ్మెల్యేగా ఉన్నపుడు మౌలిక వసతులు కల్పించానని, ప్రత్యేకంగా తాగునీటి సమస్య పరిష్కరించానని తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ రాచర్ల మండల అధ్యక్షులు కటికె యోగానంద్‌, జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి జీవనేశ్వర్‌రెడ్డి, జనసేన జిల్లా కార్యదర్శి నరసింహారావు, టీడీపీ నాయకులు అంబవరం శ్రీనివాసరెడ్డి, రెడ్డి కాశిరెడ్డి, నంది శ్రీనివాసులు, తదితరులు పాల్గొన్నారు.

ముత్తుముల పుష్పలీల ప్రచారం

గిద్దలూరు టౌన్‌ : టీడీపీ అభ్యర్ధి ముత్తుముల అశోక్‌రెడ్డి విజయం కోసం ఆయన భార్య ముత్తుముల పుష్పలీల మంగళవారం 9, 19 వార్డులలో ప్రచారం నిర్వహించారు. 9వ వార్డులోని ప్రతి వీధిలోకి వెళ్లి టీడీపీ మేనిఫెస్టోలోని సూపర్‌సిక్స్‌ పథకాలను ఓటర్లకు వివరించారు. ముత్తుముల అశోక్‌రెడ్డి విజయం కోసం సైకిల్‌ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. సాయంత్రం 19వ వార్డు పరిధిలోని కొత్తపల్లె గ్రామంలో ఆమె ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఆమె వెంట జడ్పీటీసీ మాజీ సభ్యురాలు, బీజేపీ నాయకురాలు పిడతల సరస్వతి, మాజీసర్పంచ్‌ దప్పిలి విజయభాస్కర్‌రెడ్డి, కౌన్సిలర్‌ పాలుగుళ్ల శ్రీదేవి, టీడీపీ నాయకులు పెద్దభాషా, భూపాల్‌రెడ్డి, తోట కొండల్‌రావు, ఓబయ్య, మండ్ల శ్రీనివాసులు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 03 , 2024 | 12:45 AM