Share News

మున్నాముఠాకు 45 ఏళ్ల జైలు

ABN , Publish Date - May 12 , 2024 | 12:37 AM

హైవే కిల్లర్‌గా పేరోం దిన మున్నా గ్యాంగ్‌కు ఉరిశిక్షను రద్దు చేసి 45 ఏళ్ళు యావజ్జీవంగా మారుస్తూ రాష్ట్ర హైకోర్టు తీ ర్పు ఇచ్చింది. మూడు దశాబ్దాల క్రితం మున్నా ముఠా జాతీయ రహదారిపై నిశబ్ద మారణకాండ సాగించింది. 13మందిని మట్టు బెట్టింది.

 మున్నాముఠాకు 45 ఏళ్ల జైలు

ఉరిశిక్షను యావజ్జీంగా మార్చిన రాష్ట్ర హైకోర్టు

రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యమని ఆక్షేపణ

ఒంగోలు(క్రైం), మే 11: హైవే కిల్లర్‌గా పేరోం దిన మున్నా గ్యాంగ్‌కు ఉరిశిక్షను రద్దు చేసి 45 ఏళ్ళు యావజ్జీవంగా మారుస్తూ రాష్ట్ర హైకోర్టు తీ ర్పు ఇచ్చింది. మూడు దశాబ్దాల క్రితం మున్నా ముఠా జాతీయ రహదారిపై నిశబ్ద మారణకాండ సాగించింది. 13మందిని మట్టు బెట్టింది. ఇనపలో డుతో వెళ్లే లారీలే లక్ష్యంగా ఈ మారణకాడ సా గింది. ఈ నేపథ్యంలో హైవేపై రక్తం పారించిన మున్నాగ్యాంగ్‌కు 2021 మే నెలలో జిల్లా కోర్టు 12 మందికి ఉరి శిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది. అప్పట్లో ఈ తీర్పు రాష్ట్రవ్యాప్తంగా సంచలన రేపింది. ఈక్ర మంలో జిల్లా కోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తు దోషులు హైకోర్టులో ఆప్పీలుకు వెళ్ళారు. దీంతో రాష్ట్ర హైకోర్టు విచారణ చేపట్టిన డివిజన్‌ బెంచ్‌ న్యాయమూర్తులు జస్టిస్‌ యు.దుర్గాప్రసాద్‌, జస్టిస్‌ గన్నమనేని రామకృష్టప్రసాద్‌ శుక్రవారం తీర్పు ఇ చ్చారు. మున్నా ముఠాలో ఉరిశిక్ష విధించిన వారికి 45 ఏళ్ళు యావజ్జీవం విధిస్తూ ఈ కాలంలో ఎలాం టి క్షమాభిక్ష ప్రసాదించేందుకు అవకాశం లేదని తీ ర్పులో స్పష్టం చేశారు. అదేవిధంగా జాతీయరహ దారిపై ఇలాంటి హంతకులను నిలవరచడంలో రా ష్ట్ర ప్రభుత్యం విఫలం చెందిందని ఆక్షేపణ చేశా రు. అప్పట్లో ఒంగోలు జిల్లా సెషన్స్‌ కోర్టులో న్యా యమూర్తి మనోహర్‌రెడ్డి తీర్పు ఇచ్చారు. మున్నా ముఠాలో 12మందికి ఉరిశిక్ష, నలుగురికి యావజ్జీవం, ఒకరికి 10 ఏళ్లు, మరొకరికి ఏడేళ్ళు జైలుశిక్ష వి ధించారు.

తనిఖీల పేరుతో హడలెత్తించిన మున్నాగ్యాంగ్‌

జిల్లాలోని కనిగిరికి చెందిన ఎండీ అబ్దుల్‌సమా ద్‌ అలియాస్‌ మున్నా తొలుత నాటు వైద్యుడు. నా టుమందులు తయారు చేసి విక్రయాలు చేసే వాడు. ఆ తరువాత గుప్తనిధులు తవ్వకాలపై దృష్టి సారించి ఓ ముఠాను ఏర్పాటు చేసుకున్నాడు. ఈ క్రమంలో జాతీయ రహదారిపై తనిఖీల పేరుతో ఇనపలోడుతో వెళ్లే లారీలను లక్ష్యంగా చేసుకొని డ్రై వర్‌, క్లీనర్‌లను దారుణంగా హత్య చేసి గుం డ్లకమ్మ నదీ ఒడ్డున ఇసుకలో పూడ్చి వేశారు. ఈ లారీలను మద్దిపాడు కొష్టాలు సమీపంలోని ఓ గో దాంలోకి తీసుకెళ్లి ఇనుమును విక్రయించి లా రీలను పార్టులుగా ఊడదీసి పాత ఇనుముకు అ మ్ముకుంటారు. 2008లో ఈ హైవే కిల్లరు హత్యల పరంపర కొనసాగింది. మొత్తం మున్నాతోపాటు 17 ముఠా సభ్యులు ఉన్నారు. వారు 13 మందిని ఈ విధంగా హత్యలకు పాల్పడ్డారు. లారీలను గ ల్లంతు చేసి బాడీలు మాయం చేయడం ఈ ము ఠాకు వెన్నతో పెట్టిన విద్య. ఉరిశిక్ష పడిన వారిలో ఎండీ.అబ్దుల్‌ సమాద్‌ అలియాస్‌ మున్నా, షేక్‌ రి యాజ్‌, హిదయతుల్లా, జమాల్‌, బత్తుల సాల్మన్‌, ఏపూరి చినవీరస్వామి, పెదవీరస్వామి, గుండా భా నుప్రకాష్‌, రాచమల్లు సంపత్‌, గుండెబోయిన శ్రీధర్‌, షేక్‌ హఫీజ్‌, షేక్‌ దాదపీర్‌లు ఉన్నారు.

ముఠా ఇలా దొరికింది..

2008 అక్టోబరులో ఇనుము లోడుతో తమిళనా డులోని కల్పకం వెళుతూ ఒంగోలు సమీపంలో మాయమైంది. దీంతో లారీ యజమాని ఒంగోలు తాలుకా పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పట్లో ఎస్పీగా పని చేసిన నవీన్‌చంద్‌ ఈక్రమంలో ద ర్యాప్తు అధికారిగా ప్రస్తుతం పీటీసీ ప్రిన్సిపాల్‌, అ ప్పట్లో ట్రైనీ డీఎస్పీగా ఉన్న దామోదర్‌ను నియమించారు. ఈక్రమంలో విచారణ అధికారుల కు ఇంజన్‌ లేకుండా లారీ బాడీ పాత జిల్లా పరిషత్‌ కార్యాలయంలో నిలిపి వేసింది దొరికింది. అదే ఆధారంగా దర్యాప్తు చేసిన పోలీసులు అధికా రులకు అనుమానాస్పద రీతిలో వెల్డింగ్‌ చేసే వ్యక్తి దొరికాడు. ఇలా మున్నాగ్యాంగ్‌ను పోలీసులు పట్టు కొని దర్యాప్తు చేసి గగుర్పాటుకు గురిచేసే నిజాల ను వెలికి తీశారు.

Updated Date - May 12 , 2024 | 12:37 AM