Share News

క్రీడారంగంలోనూ సత్తాచాటిన ఎంఎన్‌ఎం

ABN , Publish Date - Feb 15 , 2024 | 11:23 PM

విద్యారంగంలోనే కాకుండా క్రీడారంగంలోనూ ఎంఎన్‌ఎం విద్యార్థులు తనదైన సత్తాచాటుతూ ఆడుదాంఆంధ్రా ఖోఖో పోటీల్లో రాష్ట్ర స్థాయి విన్నర్‌ టీంగా గెలుపొందారు. స్థానిక ఎంఎన్‌ఎం కళాశాల ఆవరణంలో గురువారం ఆయా టీం విద్యార్థులను కళాశాల కరస్పాండెంట్‌ ఏలూరి సుబ్బారావు ఘనంగా స త్కరించి అభినందించారు. ప్రభుత్వం నిర్వహించిన ఆడుదాంఆంధ్రా క్రీడాపోటీల్లో భాగంగా ఎంఎన్‌ఎం విద్యార్థులు ఖోఖో పోటీల్లో పాల్గొన్నారు.

క్రీడారంగంలోనూ సత్తాచాటిన ఎంఎన్‌ఎం
విద్యార్థులను అభినందిస్తున్న ఏలూరి, అధ్యాపకులు

విన్నర్‌ షీల్డ్‌తో పాటు రూ.5లక్షల బహుమతి సాధించిన విద్యార్థులు

కనిగిరి, ఫిభ్రవరి 15 : విద్యారంగంలోనే కాకుండా క్రీడారంగంలోనూ ఎంఎన్‌ఎం విద్యార్థులు తనదైన సత్తాచాటుతూ ఆడుదాంఆంధ్రా ఖోఖో పోటీల్లో రాష్ట్ర స్థాయి విన్నర్‌ టీంగా గెలుపొందారు. స్థానిక ఎంఎన్‌ఎం కళాశాల ఆవరణంలో గురువారం ఆయా టీం విద్యార్థులను కళాశాల కరస్పాండెంట్‌ ఏలూరి సుబ్బారావు ఘనంగా స త్కరించి అభినందించారు. ప్రభుత్వం నిర్వహించిన ఆడుదాంఆంధ్రా క్రీడాపోటీల్లో భాగంగా ఎంఎన్‌ఎం విద్యార్థులు ఖోఖో పోటీల్లో పాల్గొన్నారు. మండల స్థాయి నుం చి జిల్లా స్థాయి ఆ తర్వాత రాష్ట్ర స్థాయి ఖోఖో పోటీల్లో ప్రకాశం జిల్లా నుంచి పాల్గొన్నారు. రాష్ట్ర స్థాయిలో జరిగిన ఖోఖో పోటీల్లో విశాఖ జిల్లాతో తలపడిన ప్రకాశం జి ల్లా టీమ్‌లో అందరూ ఎంఎన్‌ఎం విద్యార్థులు కావడం విశేషం. విశాఖ జిల్లా టీ మ్‌తో జరిగిన ఖోఖో పోటీల్లో గెలుపొంది విన్నర్‌ షీల్డ్‌ను సొంతం చేసుకోవడంతో పా టు రూ.5లక్షల నగదు బహుమతిని కైవసం చేసుకుని కనిగిరి ప్రాంతానికే వన్నె తె చ్చారు. కళాశాల ఆవరణలో అధ్యాపక బృందం క్రీడాకారులను అభినందించింది. కార్యక్రమంలో ప్రిన్సిపాల్‌ వీ రాజవర్దన్‌, కోచ్‌లు విశ్వనాథరెడ్డి, శివారెడ్డి, విజేత కళాశాల కరస్పాండెంట్‌ పసుపులేటి అరుణోదర్‌, క్రీడాకారులు పాల్గొన్నారు.

రాష్ట్రస్థాయి ఖోఖో పోటీల్లో విజేతలు

రాష్ట్రస్థాయి ఖోఖో పోటీల్లో పాల్గొన్న ప్రకాశం జిల్లా జట్టు ఎంఎన్‌ఎం విద్యార్థుల్లో మద్దులూరి దివ్య కెప్టెన్‌గా, వైస్‌ కెప్టెన్‌గా బొమ్మల శిరీష, అశ్వని, శివనాగలక్ష్మి, భవాని, హైమావతి, ఉష, సఖియా, మధులత, నాగమల్లేశ్వరి, వెంకటలక్ష్మి, అనూరాద, అహల్య, శశికళ, సోనా ఉన్నారు.

Updated Date - Feb 15 , 2024 | 11:23 PM