అరుణాచలేశ్వరున్ని దర్శించుకున్న ఎమ్మెల్యే కందుల
ABN , Publish Date - Jun 07 , 2024 | 12:35 AM
మార్కాపురం శాసన సభ్యులు కందుల నారాయణరెడ్డి గురువారం తమిళనాడులోని అరుణాచలేశ్వరున్ని దర్శించు కున్నారు.

మార్కాపురం, జూన్ 6: మార్కాపురం శాసన సభ్యులు కందుల నారాయణరెడ్డి గురువారం తమిళనాడులోని అరుణాచలేశ్వరున్ని దర్శించు కున్నారు. ఎమ్మెల్యేగా గెలిస్తే అరుణాచలం వెళ్లి స్వామిని దర్శించుకుని గిరిప్రదక్షిణ చేస్తానని ఆయన మొక్కుకున్నారు. మొక్కు తీర్చుకు నేందు కు పలువురు కార్యకర్తలతో కలిసి బుధవారం రాత్రి అరుణాచలం బయలుదేరి వెళ్లారు. ప్రమాదంలో కాలికి గాయమై శస్త్రచికిత్స చేయించుకున్న ఆయన ఆరోగ్యం సహకరించకున్నా సుమారు 14 కిలోమీటర్లు గిరి ప్రదక్షణ చేశారు. ఆయన వెంట తర్లుపాడు మండల పార్టీ కన్వీ నర్ ఉడుముల చిన్నపరెడ్డి, పలువురు కార్యకర్తలు ఉన్నారు.
ఆలయాల్లో రాఘవరెడ్డి పూజలు
త్రిపురాంతకం : ప్రసి ద్ధ పుణ్యక్షేత్రం త్రిపురాంతకేశ్వరస్వామి, బాలాత్రిపుర సుందరీదేవి అమ్మ వార్ల ఆలయాల్లో ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి కుమారుడు రాఘవరెడ్డి గురువారం ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ప్రదక్షిణల అనంతరం త్రిపురాంతకేశ్వరస్వామికి మహాన్యాస పూర్వక అభిషేకం, చినమస్తాదేవికి పూజలు, బాలాత్రిపుర సుంరదరీదేవి అమ్మవారికి అర్చనలు చేశారు. అనంతరం ఆలయ అర్చకులు రాఘవరెడ్డికి స్వామి, అమ్మవార్ల శేషవస్ర్తాలను, తీర్థప్రసాదాలు అందజేసి ఆశీర్వదించారు. అనంతరం స్థానిక టీడీపీ నాయకులు రాఘవరెడ్డిని కలిసి సత్కరించారు.