శాసనసభలో ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి ప్రమాణస్వీకారం
ABN , Publish Date - Jun 22 , 2024 | 12:12 AM
టీడీపీ అభ్యర్ధిగా విజయం సాధించిన ముత్తుముల అశోక్‌రెడ్డి శుక్రవారం శాసనసభలో ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు.
గిద్దలూరు టౌన్, జూన్ 21 : టీడీపీ అభ్యర్ధిగా విజయం సాధించిన ముత్తుముల అశోక్‌రెడ్డి శుక్రవారం శాసనసభలో ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. ప్రొటెంస్వీకర్ బుచ్చయ్యచౌదరి ముత్తుముల అశోక్‌రెడ్డితో ప్రమాణ స్వీకారం చేయించగా అనంతరం ముత్తుముల అశోక్‌రెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును, ఉప ముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్, మంత్రులు నారా లోకేష్, తదితరులను కలిశారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబుతో పాటు వారు ఎమ్మెల్యే అశోక్‌రెడ్డిని అభినందించారు. అనంతరం శాసనసభ ఆవరణలో గిద్దలూరు ప్రాంతానికి చెందిన పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు ఆయనకు పూలమాలలు వేసి శాలువలతో సన్మానించారు. వీరిలో జడ్పీటీసీ సభ్యుడు బుడత మధుసూదన్‌యాదవ్, ఎంపీటీసీ సభ్యులు గర్రె శ్రీనాథ్, రాచర్ల మండల అధ్యక్షులు కటికె యోగా నంద్, టీడీపీ నాయకులు మేడం భాస్కర్‌రెడ్డి, కృష్ణారెడ్డి, బొమ్మరిల్లు శేఖర్, కడియం శేషగిరి, బైలడుగు బాలయ్య, రామకృష్ణ, శేఖర్, పఠాన్ సనావుల్లాఖాన్ తదిత రులు ఉన్నారు.
బాణసంచా కాల్చి సంబరాలు
కొమరోలు : అసెంబ్లీలో ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి ప్రమాణ స్వీకారం సందర్భంగా కొమ రోలులోని ఆంజనేయస్వామి గుడి కూడలిలో నాయకులు, కార్యాకర్తలు బాణసంచా కాల్చి స్వీట్లు తినిపించుకున్నారు. ఈసందర్భంగా టీడీపీ నాయకులు తుమ్మలపెంట వెంకటరమణ మాట్లాడుతూ గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి మరోసారి ఎమ్మెల్యే గా ప్రమాణస్వీకారం చేయడం సంతోషంగా ఉందన్నారు. కార్యక్రమంలో నాయకులు అంబారపు సుబ్రహ్మణ్యం, లాయర్ విజయ్‌కుమార్‌రెడ్డి, పాలుగుళ్ల మల్లిఖార్జునరెడ్డి, షేక్‌సుభాని, వార్డుసభ్యుడు భాష, శ్రీను పాల్గొన్నారు.
టీడీపీ శ్రేణుల సంబరాలు
గిద్దలూరు టౌన్ : రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి రావడంతోపాటు గిద్దలూరులో ముత్తుముల అశోక్‌రెడ్డి విజయం సాధించి అసెంబ్లీలో శుక్రవారం ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా ఆ పార్టీ శ్రేణులు గిద్దలూరులో సంబరాలు చేసుకున్నారు. కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. ఆప్రాంతంలో పార్టీ జెండాను ఆవి ష్కరించి పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. నిరంకుశ పాలనకు రాష్ట్ర ప్రజలు విముక్తి కలిగిం చారని వారన్నారు. రాష్ట్రంలో చంద్రబాబు నాయ కత్వంలో గిద్దలూరులో ముత్తుముల అశోక్‌రెడ్డి నాయకత్వంలో అభివృద్ది బాటలో నడుస్తుందన్నా రు. కార్యక్రమంలో కౌన్సిలర్లు బూనబోయిన చంద్రశేఖర్ యాదవ్, లొక్కు రమేష్, బిల్లా రమేష్ యాదవ్, పట్టణ పార్టీ అధ్యక్షులు షానేషావలి, టీడీపీ నాయకులు దుత్తా బాలీశ్వరయ్య, కిశోర్, వెంకటస్వామి పాల్గొన్నారు.