కంభంలో గంజాయి, మత్తుపదార్థాల కలకలం
ABN , Publish Date - Jul 08 , 2024 | 01:51 AM
కంభం పట్టణంలో గంజాయి, ఇతర మత్తుపదార్థాల కలకలం రేపింది. గంజాయి సేవించి అనుమానాస్పదంగా తిరుగుతున్న ఐదుగురిని అదుపులోకి తీసుకున్న ఎస్సై పులిరాజేష్ వారి దుస్తులు వెతికారు.

కంభం, జూలై 7 : కంభం పట్టణంలో గంజాయి, ఇతర మత్తుపదార్థాల కలకలం రేపింది. గంజాయి సేవించి అనుమానాస్పదంగా తిరుగుతున్న ఐదుగురిని అదుపులోకి తీసుకున్న ఎస్సై పులిరాజేష్ వారి దుస్తులు వెతికారు. వారి వద్ద షుమారు 150 గ్రాములు ఉన్న 4 గంజాయి పొట్లాలు లభ్యమయ్యాయి. ఈ ఐదుగురిలో ఇద్దరు మార్కాపురం వాసులు కాగా ముగ్గురు కంభానికి చెందిన వారు ఉన్నారు. ఈ గంజాయి ఎవరు సరఫరా చేస్తున్నారని పోలీసు లు తమదైన శైలిలో ప్రశ్నించగా యర్రగొండ పాలెం నుంచి ప్రతిరోజు ఒక వ్యక్తి తమకు అందజేస్తాడని చెప్పినట్లు సమా చారం. వీరు ఇచ్చిన సమాచారం మేరకు ఎర్రగొండపాలెం గంజాయి సరఫరా చేసే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది.
పలు మెడికల్ దుకాణాల్లో తనిఖీ
కాగా కంభం పట్టణంలో పలువురు యువకులు మత్తుపదార్థాలు సేవిస్తున్నారనే సమాచారంతో జిల్లాలోని డ్రగ్స్ అధికారులు కంభం పోలీసులు ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఉన్న మెడికల్ దుకాణాల్లో తనిఖీ చేశారు. మత్తు ను కలిగించే పలు మాత్రలను స్వాధీనం చేసుకు న్నారు. ఏదిఏమైనా యువత గంజాయి, మత్తు పదార్థాలకు అలవాటుపడడం పట్టణంలో కలకలం రేపింది.