Share News

మినుము మునిగింది

ABN , Publish Date - Oct 23 , 2024 | 11:31 PM

పంగులూరు మండలంలో అధిక వర్షాలతో కోత దశలో ఉన్న మినుము మునిగిపోయింది. దీంతో అపార నష్టం వాటిల్లింది. మండలంలో 3,486 ఎకరాలలో మినుమును సాగు చేయగా, కోత దశకు చేరుకున్న సుమారు రెండు వేల ఎకరాలలో చేతి కొచ్చిన పంట నీటిపాలయింది.

మినుము మునిగింది
చినమల్లవరంలో మినుము పైరును మేస్తున్న గొర్రెలు

కోత దశలో కురిసిన వర్షాలు

అపారనష్టమని రైతుల ఆవేదన

పంగులూరు, అక్టోబరు 23 (ఆంధ్రజ్యోతి) : పంగులూరు మండలంలో అధిక వర్షాలతో కోత దశలో ఉన్న మినుము మునిగిపోయింది. దీంతో అపార నష్టం వాటిల్లింది. మండలంలో 3,486 ఎకరాలలో మినుమును సాగు చేయగా, కోత దశకు చేరుకున్న సుమారు రెండు వేల ఎకరాలలో చేతి కొచ్చిన పంట నీటిపాలయింది. అల్పపీడనం కారణంగా కురిసిన వర్షాలకు కోతకొచ్చిన కాయ పంటచేలో మొలకలు రావడంతో పూర్తి నష్టం వాటిల్లిందని రైతులు వాపోతున్నారు. మండలంలోని కొండమూరులో 11 వందల ఎకరాలలో మినుము సాగు చేయగా, రేణంగివరంలో 364, అలవలపాడులో 302, ముప్పవరంలో 239, కొండమంజులూరులో 155, బైటమంజులూరులో 196, కొప్పెరపాడులో 170, కశ్యాపురంలో 111, కొప్పెరపాడులో 170, తక్కెళ్లపాడు, బూదవాడ, మల్లవరం గ్రామాలలో వందల ఎకరాలలో మినుము సాగు చేపట్టారు. పురుగు, తెగుళ్ల కారణంగా అధికంగా మందులు వాడి వ్యయ ప్రయాసలతో పంటను కాపాడుకున్నప్పటికీ అధిక వర్షంతో అంతా నీటిపాలయిందని రైతులు వేదన చెందుతున్నారు.

నష్ట పరిహారం కోసం ఎన్యుమరేషన్‌ చేపట్టాం

మినుము పంట నష్టం అంచనా కోసం బుధవారం నుంచి ఎన్యుమరేషన్‌ చేపట్టామని వ్యవసాయాధికారి సుబ్బారెడ్డి తెలిపారు. 33శాతం పైగా పంట నష్టం జరిగిన రైతుకు ప్రభుత్వ సాయం అందుతుందని ఏవో సుబ్బారెడ్డి తెలిపారు. 1900 ఎకరాలకు పైగా పంట నష్టం జరిగిందని ప్రాథమిక నివేదిక అధికారులకు పం పడం జరిగిందని తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు రైతు సేవా కేంద్ర సిబ్బంది, వీఆర్వోలు పంట నష్టం అంచనాలు తయారు చేస్తున్నట్లు తెలిపారు.

Updated Date - Oct 23 , 2024 | 11:31 PM