Share News

అశోక్‌రెడ్డిపైనే కోటి ఆశలు

ABN , Publish Date - Jul 08 , 2024 | 01:48 AM

ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ముత్తుముల అశోక్‌రెడ్డి, తొలిసారిగా మండల సమస్య లపై చర్చించడానికి వస్తున్నారు.

అశోక్‌రెడ్డిపైనే కోటి ఆశలు

కొమరోలు, జూలై7 : ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ముత్తుముల అశోక్‌రెడ్డి, తొలిసారిగా మండల సమస్య లపై చర్చించడానికి వస్తున్నారు. స్ధానిక మండల పరిషత్‌ కార్యాలయంలో సోమవారం ఉదయం మండల పరిషత్‌ సర్వసభ్య సమావేశం జరుగుతుంది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా ద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి హాజరు కానున్నారు. గత పాలకులు నిర్లక్ష్యంగా వ్యవహరించి మండల అభివృద్ధికి నోచుకోకుండా ఎక్కడి సమస్యలు అక్కడే అటకెక్కాయని మండల ప్రజలు ఆరోపిస్తున్నారు. ఆ సమస్యలను ఒక్క అశోక్‌రెడ్డి మాత్రమే పరిష్కరించే సత్తా ఉందని, గతంలో మాదిరి గానే ప్రస్తుత టీడీపీ ప్రభుత్వంలో కొమరోలు మండల అభివృద్ధిలో ప్రత్యేకశ్రద్ధ తీసుకోనున్నారని ప్రజలు ఆశతో ఉన్నారు.

వెక్కిరిస్తున్న వైద్యశాల సమస్య

మండల కేంద్రంలోని ప్రభుత్వ వైద్యశాలలో 30 పడ కల వైద్యశాలగా గతంలో ఉండేది. దానిని వైసీపీ సర్కార్‌ 10 పడకల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంగా తగ్గించారు. గతంలో ఈ వైద్యశాలలో మహిళలకు ఆపరేషన్లు, శవ పంచనామాలు, ఎక్సరే మిషన్‌ వంటి సేవలు ఇక్కడే ఉండేవి. ఇప్పుడు ఈ సేవలు లేవు. దీంతో వీటి కోసం మండల ప్రజలు 20 కిలోమీటర్ల దూరంలోని గిద్దలూరు, 30 కిలోమీటర్ల దూరంలోని పోరుమామిళ్లకు వెళ్ళాల్సివస్తోంది. కావున కొమరోలు ప్రభుత్వ వైద్యశాలను కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌గా స్థాయిని పెంచేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటారని కోరుతున్నారు. ప్రస్తుతం కొమరోలు వైద్యశాలలో మహిళా వైద్యాధికారిని లేక పావడం, వైద్యశాల అభివృద్ధి కమిటీ ద్వారా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేందుకు చర్యలు తీసుకోకపోవడంపై ప్రత్యేక శ్రద్దతీసుకోవాలి. మీ హయాంలో మంజూరై చివరి దశలో పెండింగులోని మినీస్టేడియం, బీసీ భవనాలు, కాపు భవనాల నిర్మాణాలను పూర్తిచేయించాలని, కొమ రోలు మండలంలోని కొమరోలు, తాటిచర్ల ప్రభుత్వ పశు వైద్యశాలలో వైద్యాధికారులు లేక రైతులు తీవ్ర ఇబ్బం దులు పడుతున్నారు. కొమరోలు మండలం రెడ్డిచర్లలోని హోమియో వైద్యశాలను కొద్దిరోజులైన మండల కేంద్రంలో ప్రత్యేక క్యాంపులను ఏర్పాటు చేయాలని, ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి హయాంలో కొమరోలు నుంచి రాజుపాలెం వరకు డబుల్‌రోడ్డు నిర్మించిన ఘనత వారిదే. అలానే రాజుపాలెం నుంచి గిద్దలూరు వరకు డబుల్‌ రోడ్డును ఏర్పాటుచేసి కొమరోలు ప్రజల చిరకాల వాంఛను నేరవేరుస్తారని కోరుతున్నారు. కొమరోలు పట్టణంలో విద్యుత్‌ సమస్యలతో ప్రజలు తీవ్రఇబ్బందులు పడుతు న్నారు. పట్టణంలో విద్యుత్‌ కనెక్సన్ల ఆధారంగా అదనపు ట్రాన్స్‌ఫ్మార్లు ఏర్పాటుచేయించాలని, గ్రామంలో మరమ్మతులకు గురైన విద్యుత్‌ స్తంభాలను మార్చాలని కోరుతున్నారు. వెలుగు కార్యాలయంలో మహిళలకు రుణాలు ఇచ్చే వీవోలు అధికారులు ఇష్టానుసారంగా డబ్బులు వసులు చేస్తున్నారు. లంచాలను అరికట్టాలంటే ఐకేపీలో సిబ్బందిని, కమిటీలను సంస్థాగత మార్పులు, చేర్పులను ఎమ్మెల్యే సమక్షంలో జరగాలని మండల ప్రజలు కోరుతున్నారు. కొమరోలు గ్రామ పంచాయతీలో పలు సమస్యలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా తాగునీరు, పారిశుధ్యం, అక్రమ కట్టడాలపై ప్రత్యేక అధికారిని ఏర్పాటుచేసి కొమరోలు పంచాయతీ స్ధాయిని పెంచాలని కోరుతున్నారు. మండలంలోని రెవెన్యూ కార్యాలయం, ఇతర ప్రభుత్వ అధికారులు సమయపాలన లేకుండా వారి ఇష్టానుసారం వస్తూపోతు న్నారు వారిని కట్టడిచేయించి ప్రజలకు త్వరగా సమస్యలను పరిష్కరించే దిశగా పరిష్కారం చేయాలి. కొమరోలు ప్రాంతం చాలా వెనుకబడినందున ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డితో మంచి పరిశ్రమను ఏర్పాటుచేసి ఈప్రాంతంలోని నిరుద్యోగసమస్యలను పరిష్కారిస్తారని నిరుద్యోగులు ఆశతో ఎదురుచూ స్తున్నారు. ఈ సమస్యలను మన స్థానికుడైన అశోక్‌రెడ్డి సహృదయంతో పరిష్కరించి మరలా అశోకుడు చేసిన అభివృద్ధిని చూడబోతున్నామని మండల ప్రజలు ఆశాభావం వ్యక్తంచేస్తున్నారు.

Updated Date - Jul 08 , 2024 | 01:48 AM