Share News

మార్టూరు రోటరీది ప్రత్యేక స్థానం

ABN , Publish Date - May 29 , 2024 | 10:23 PM

విభిన్న రూపాలలో కార్యక్రమాలను చేపడుతూనే రోటరీ కళా పరిషత్‌ నాటిక పోటీలను నిర్వహించడం కూడా సమాజ సేవలో భాగమని రోటరీ జిల్లా 3020 మాజీ గవర్నర్‌ డాక్టర్‌ ఎస్‌వీఎస్‌ రావు అన్నారు.

మార్టూరు రోటరీది ప్రత్యేక స్థానం
ముగింపు సభలో పాల్గొన్న రోటరీ ప్రముఖులు

అతిథుల ప్రశంస

సమాజసేవలో భాగమే కళా పరిషత్‌

మార్టూరు, మే 29 : విభిన్న రూపాలలో కార్యక్రమాలను చేపడుతూనే రోటరీ కళా పరిషత్‌ నాటిక పోటీలను నిర్వహించడం కూడా సమాజ సేవలో భాగమని రోటరీ జిల్లా 3020 మాజీ గవర్నర్‌ డాక్టర్‌ ఎస్‌వీఎస్‌ రావు అన్నారు. శ్రీకారం రోటరీ కళా పరిషత్‌ ఆధ్వర్యంలో మార్టూరులో జరుగుతున్న 14వ ఉభయ తెలుగు రాష్ట్రాల నాటికల పోటీలు బుధవారం రాత్రితో ముగిశాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభా వేదికపైకి శ్రీకారం అధ్యక్షుడు కందిమళ్ల సాంబశివరావు ఆహుతులను ఆహ్వానించారు. సభకు ఎఫర్ట్‌ సంస్థ డైరెక్టర్‌ జాష్టి వెంకట మోహనరావు అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథి డాక్టర్‌ ఎస్‌వీఎ్‌సరావు మాట్లాడుతూ రోటరీ చరిత్రలో మార్టూరు రోటరీ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుందన్నారు. పల్స్‌ పోలియా, కంటి వైద్య శిబిరాలు, అ నాథలకు సాయం అందించడం, స్కూళ్లలో వసతులు కల్పించడం లాంటి ఎన్నో సేవా కార్యక్రమాలను చేసిన మార్టూరు రోటరీ కళా పరిషత్‌ను అభినందించారు. మరోపక్క కళలను పోషిస్తూ, కళాకారులను గౌరవిస్తూ 14 ఏళ్లుగా కళా పరిషత్‌ను నిర్వహించడం గొప్పవిషయమన్నారు. ఈ సందర్భంగా మార్టూరు రోటరీ సభ్యులను ప్రత్యేకంగా అభినందిస్తూ భవిష్యత్తులో కూడా కళా పరిషత్‌ను కొనసాగించాలని ఆకాంక్షించారు. అనంతరం అధ్యక్ష స్థానాన్ని అలంకరించిన జాష్టి వెంకటమోహనరావు మాట్లాడుతూ సామాజిక బాధ్యతను పెంపొందించాలనే లక్ష్యంతో సభ్యుల సహకారంతో ఏటా కళా పరిషత్‌ను నిర్వహిస్తున్నామన్నారు. ఏడాదికి రూ.6లక్షలకు పైగా వ్యయమైనప్పటికీ సభ్యుల సహకారంతో మరికొంత మంది కళా పోషకులు సహకారంతో నాటికల పోటీలను నిర్వహిస్తున్నామన్నారు. సమాజంలో తమ వంతు బాధ్యతగా రోటరీ క్లబ్‌ వారు నిర్వహిస్తున్న కళా పరిషత్‌ నాటక రంగానికి ప్రోత్సాహంగా చంద్రునికో నూలు పోగు అన్నట్లుగా కొనసాగాలన్నదే రోటరీ సభ్యుల ఆకాంక్ష అన్నారు. అంతకు ముందు డాక్టర్‌ ఎస్‌వీఎస్‌ రావు జ్యోతి ప్రజ్వలన చేయగా శ్రీకారం కార్యదర్శి జాష్టి అనూరాధ నటరాజ విగ్రహం వద్ద పూజా కార్యక్రమాలు చేసిన అనంతరం నాటికల పోటీలను ప్రారంభించారు. కార్యక్రమంలో రోటరీ మాజీ గవరన్నర్‌ ఏఆర్‌ ప్రభాకర్‌, రోటరీ సభ్యులు రావి అంకమ్మ చౌదరి, జాష్టి సాంబశివరావు, కొర్రపాటి కాజారావు, న్యాయవాది గొట్టిపాటి శ్రీనివాసరావు, శానంపూడి లక్ష్మయ్య, తాళ్లూరి సాంబశివరావు, మద్దుమాల కోటేశ్వరరావు, మాదాల సాంబశివరావు పాల్గొన్నారు.

Updated Date - May 29 , 2024 | 10:23 PM