Share News

టీడీపీతోనే మార్కాపురం జిల్లా ఏర్పాటు

ABN , Publish Date - Apr 08 , 2024 | 01:49 AM

రానున్న ఎన్నికల్లో టీడీపీ గెలుపుతోనే మార్కాపురం జిల్లా ఏర్పాటు, వెలుగొండ ప్రాజెక్టు పూర్తి సాధ్యమవుతుందని టీడీపీ కూటమి అభ్యర్థి కందుల నారాయణరెడ్డి అన్నారు.

టీడీపీతోనే మార్కాపురం జిల్లా ఏర్పాటు

మార్కాపురం రూరల్‌, ఏప్రిల్‌ 7: రానున్న ఎన్నికల్లో టీడీపీ గెలుపుతోనే మార్కాపురం జిల్లా ఏర్పాటు, వెలుగొండ ప్రాజెక్టు పూర్తి సాధ్యమవుతుందని టీడీపీ కూటమి అభ్యర్థి కందుల నారాయణరెడ్డి అన్నారు. మండలంలోని పెద్ద యాచవరం గ్రామంలో ఆదివారం నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. మార్కాపురం ప్రత్యేక జిల్లాతోనే మార్కాపురం చుట్టుప్రక్కల ప్రాంతాల భూములు రేట్లు పెరిగి రైతులు బాగుపడతారని అన్నారు. వెలిగొండ ప్రాజెక్టును రెండు సంవత్సరాల్లో పూర్తి చేసి పొలాలకు సాగునీరు అందిస్తామని అన్నారు. తాగునీటికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చేస్తామని అన్నారు. ఈ విషయాన్ని గ్రామంలోని ప్రతి ఒక్కరికి వివరిం చాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల తెలుగుదేశం నాయకులు జవ్వాజి రామానుజన్‌ రెడ్డి, కాకర్ల శీను, తాండ్ర వెంకటేశ్వర్లు, పెద్ద యాచవరం గ్రామం తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

రాజుపాలెం నుంచి 30 కుటుంబాల చేరిక

మార్కాపురం: మార్కాపురం నియోజకవర్గంలో రోజురోజుకు టీడీపీలో చేరుతున్న వారి సంఖ్య గణనీ యంగా పెరుగుతోంది. మార్కాపురం మండలం రాజుపాలెం ఎస్సీ పాలెంకు చెందిన 30 కుటుంబాలు వైసీపీని వీడి టీడీపీలో చేరాయి. స్థానిక జవహర్‌ నగర్‌లోని టీడీపీ కార్యాలయంలో ఆదివారం మాజీ ఎమ్మెల్యే, టీడీపీ అభ్యర్థి కందుల నారాయణరెడ్డి సమక్షంలో వీరంతా పార్టీలో చేరారు. కందుల నారాయణరెడ్డి వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారిలో మాకం పిచ్చయ్య, చిన్నగాలయ్య, అచ్చ య్య, ఏసోబు, నాగరా జు, చిన్నయ్య తదితరు లున్నారు. కార్యక్రమం లో టీడీపీ మండల అధ్యక్షుడు జవ్వాజి రామాంజిరెడ్డి, ఏఎంసీ మాజీచైర్మన్‌ కాకర్ల శ్రీనివాసులు, టీడీపీ నాయకులు తాండ్ర వెంకటేశ్వర్లు తదితరు లున్నారు.

తర్లుపాడు : బీసీల అభ్యన్నతి కోసం పాటుపడే పార్టీ టీడీపీ అని ఆ పార్టీ యువ నాయకుడు కందుల రోహిత్‌ రెడ్డి అన్నారు. మండలంలోని మంగళకుంటలో సూపర్‌ సిక్స్‌ పథకాలపై ఇంటింటికి తిరుగుతూ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా సూపర్‌ సిక్స్‌ పథకాల వలన కలిగే ఉపయోగాలను వివరించారు. వైసీపీ ప్రభుత్వం బీసీల పట్ల నిర్లక్ష్య ధోరణి అవలంభించి వారికి అందవలసిన సంక్షేమ పథకాలను కూడా అందు కుండా చేస్తోందన్నారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే బీసీలకు సంక్షేమ పథకా లను అమలు చేస్తామన్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో కందుల నారాయణరెడ్డి, మాగుంట శ్రీనివాసులరెడ్డికి సైకిల్‌గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు ఉడుముల చిన్నపురెడ్డి, మాజీ ఎంపీపీ పులి వేముల ఏసుదాసు, టీడీపీ నాయకులు నంబుల లక్ష్మయ్య, గుర్రపుసాల నరసింహులు, నంబుల తిరు పతయ్య పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

అరాచక పాలనకు అడ్డుకట్ట వేయాలి

మార్కాపురం : రానున్న సార్వత్రిక ఎన్నికలలో జగన్‌ అరాచకపాలనకు ప్రజలు అడ్డుకట్ట వేయాలని టీడీపీ పోల్‌మేనేజ్‌న్మెంట్‌ ఇన్‌చార్జ్‌ కందుల రామిరెడ్డి అన్నారు. పట్టణంలోని 29వ వార్డులో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి నాయకులు ‘ఇంటింటికి మన కందుల’ ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా కందుల రామిరెడ్డి మాట్లాడుతూ అక్రమాలు, అన్యాయాలు, దోపిడీలలో ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ఏపీని బీహార్‌ స్థాయిని దాటించారన్నారు. ఏపీని అభివృద్ధి, సంక్షేమ రంగాలలో ప్రపంచానికి పరిచయం చేసిన ఘనత మాజీముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడికే దక్కుతుందన్నారు. పేదలు ఆర్ధికంగా బలోపేతం కావాలన్నా, యువత భవితకు భరోసా, మహిళలకు రక్షణ, బీసీల అభ్యున్నతి వంటి అంశాలు చంద్రబాబునాయుడుతోనే సాధ్యమన్నారు. రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం చంద్రబాబునాయుడు ప్రకటించిన సూపర్‌సిక్స్‌ పథకాలు ఎంతో ఉపయోగపడతాయన్నారు. కార్యక్రమంలో టీడీపీ వాణిజ్య విభాగం రాష్ట్ర ప్రధాన కార్మదర్శి వక్కలగడ్డ మల్లికార్జున్‌, జిల్లా ప్రధాన కార్యదర్శి తాళ్లపల్లి సత్యనారాయణ, పట్టణ అధ్యక్షుడు షేక్‌ మౌలాలి, బీజేపీ మార్కాపురం నియోజకవర్గ ఇన్‌చార్జి పి.వి.కృష్ణారావు, జనసేన నాయకులు వీరయ్య తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 08 , 2024 | 01:49 AM