Share News

టీడీపీలో చేరిన పలువురు నేతలు

ABN , Publish Date - Jan 29 , 2024 | 11:11 PM

అద్దంకి పట్టణంలోని 5వ వార్డుకు చెందిన పలువురు వైసీపీ నేతలు, కార్యకర్తలు ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌ను సోమవారం చిలకలూరిపేటలో కలిసి టీడీపీలో చేరారు. మాజీ వార్డు మెంబర్‌ చిలుకూరి సంధ్యారాణి అనిల్‌ ఆధ్వర్యంలో మౌలాలి, మల్లికార్జున, అంజయ్య, మల్లేశ్వరరావు, హఫీజ్‌, బాషా తదితరులు ఎమ్మెల్యే రవికు మార్‌ను కలిసి తమ సంఘీభావం తెలిపారు.

టీడీపీలో చేరిన పలువురు నేతలు
ఎమ్యెల్యే రవికుమార్‌ను కలిసి సంఘీభావం తెలుపుతున్న అద్దంకి పట్టణంలోని 5వ వార్డు నేతలు

అద్దంకి, జనవరి 29: అద్దంకి పట్టణంలోని 5వ వార్డుకు చెందిన పలువురు వైసీపీ నేతలు, కార్యకర్తలు ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌ను సోమవారం చిలకలూరిపేటలో కలిసి టీడీపీలో చేరారు. మాజీ వార్డు మెంబర్‌ చిలుకూరి సంధ్యారాణి అనిల్‌ ఆధ్వర్యంలో మౌలాలి, మల్లికార్జున, అంజయ్య, మల్లేశ్వరరావు, హఫీజ్‌, బాషా తదితరులు ఎమ్మెల్యే రవికు మార్‌ను కలిసి తమ సంఘీభావం తెలిపారు. వినుకొండలో ఇటీవల వైసీ పీ అల్లరిమూకల దాడిలో గాయపడిన మాజీ మున్సిపల్‌ చైర్మన్‌, అద్దంకి నియోజకవర్గ టీడీపీ పరిశీలకుడు పఠాన్‌ సమీమ్‌ఖాన్‌ను సోమవారం ఎ మ్మెల్యే రవికుమార్‌ పరామర్శించారు.

కొణిదెన వైసీపీ బీసీ నేతల చేరిక

బల్లికురవ, జనవరి 29: వైసీపీ బీసీ సామాజిక వర్గానికి చెందిన కీలక నేత, కొణిదెన గ్రామానికి చెందిన మాజీ జడ్పీటీసీ, మాజీ సర్పంచ్‌ తన్నీ రు ఏడుకోండలు తన అనుచరులతో కలిసి సోమవారం ఎమ్మెల్యే గొట్టిపా టి రవికుమార్‌ను చిలకలూరిపేటలో ఆయన స్వగృహంలో కలిసి సంఘీ భావం ప్రకటించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే వారితో మాట్లాడుతూ టీడీపీ విజయానికి సమిష్టిగా కృషి చేయాలన్నారు. పార్టీ కోసం కష్టపడిన వారందరికి సముచిత స్థానం కల్పిస్తామని చెప్పారు. కొత్త, పాత నేత లందరూ కలిసి గ్రామాలలో టీడీపీ బలోపేతానికి చేపట్టాల్సిన చర్యలపై చర్చించుకోవాలన్నారు.

అలాగే, గొర్రెపాడు గ్రామానికి చెందిన వైసీపీ నేత మక్కెన స్వాములు ఎమ్మెల్యే రవికుమార్‌ను కలిసి సంఘీభావం ప్రకటిం చారు. ఎమ్మెల్యేను కలిసిన కొణిదెన బీసీ నేతల్లో పల్లపు కోటేశ్వరరావు, తన్నీరు ఆంజనేయు లు, నాగేశ్వరరావు, యనమాల లక్ష్మయ్య, కుంచపు నాగేశ్వరరావు, కొండ య్య, వేమవరపు శంకర్‌, గుంజి పిచ్చయ్య, చట్టి పోతురాజు, సత్తి భూసి తదితరులు ఉన్నారు.

పలు కుటుంబాలను పరామర్శించిన ఎమ్మెల్యే రవికుమార్‌

సంతమాగులూరు, జనవరి 29: మండలంలోని ఏల్చూరు గ్రామానికి చెందిన వైసీపీ కార్యకర్తలు ఎమ్మెల్యే రవికుమార్‌ సమక్షంలో సోమవారం టీడీపీలో చేరారు. సంతమాగులూరు మండలంలో పలుగ్రామాలకు చెంది న వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఇప్పటికే ఎమ్మెల్యేను కలసి సంఘీభా వం ప్రకటించారు. కాగా, మండలంలోని పత్తేపురంకు చెందిన చలపతి రావు దశదిన కర్మకు ఎమ్మెల్యే రవికుమార్‌ హాజరై నివాళులర్పించారు. అ దేగ్రామానికి చెందిన అంబటి శ్రీనివాసరావు కుమారుడు చెన్నైలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందగా కుటుంబసభ్యులను పరామర్శించారు. అ దే గ్రామానికి చెందిన దారం పెద కామాన్షయ్య ఇటీవల మృతిచెందగా వారి ఇంటికి వెళ్ళి నివాళులర్పించారు. తంగేడుమల్లికి చెందిన పెళ్ళూరి న రసింహ రోడ్డు ప్రమాదంలోగా యపడగా వారి ఇంటికి వెళ్ళి పరామర్శిం చారు. మిన్నెకల్లుకు చెందిన చిరుమామిళ్ళ కోటేశ్వరమ్మశు క్రవారం మృతి చెందగా వారి కుటుంబసభ్యులను పరిమర్శించారు. గ్రామానికి చెందిన కోట సాహెబ్‌ ఇటీవల మృతిచెందగా వారి ఇంటికి వెళ్ళి పరామర్శించారు.

Updated Date - Jan 29 , 2024 | 11:11 PM