Share News

పర్చూరుపై మల్లగుల్లాలు

ABN , Publish Date - Feb 06 , 2024 | 11:41 PM

ఉమ్మడి ప్రకా శం జిల్లాలోని పర్చూరు అసెం బ్లీ వైసీపీ ఇన్‌చార్జి వ్యవహారం పై ఆ పార్టీ అధిష్ఠానం మల్లగుల్లాలు పడుతోంది. ప్రస్తుత ఇన్‌చార్జి ఆమంచి కృష్ణమోహన్‌తో సోమవారం మంతనాలు జరిపి న ముఖ్యనేతలు మంగళవారం దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్‌, ఒంగోలుకు చెందిన వ్యాపారవేత్త రవిశంకర్‌లను పిలిచి మాట్లాడారు.

పర్చూరుపై మల్లగుల్లాలు

మద్దిశెట్టి, రవిశంకర్‌లతో సీఎంవో అధికారుల చర్చలు

ఆంధ్రజ్యోతి, ఒంగోలు

ఉమ్మడి ప్రకా శం జిల్లాలోని పర్చూరు అసెం బ్లీ వైసీపీ ఇన్‌చార్జి వ్యవహారం పై ఆ పార్టీ అధిష్ఠానం మల్లగుల్లాలు పడుతోంది. ప్రస్తుత ఇన్‌చార్జి ఆమంచి కృష్ణమోహన్‌తో సోమవారం మంతనాలు జరిపి న ముఖ్యనేతలు మంగళవారం దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్‌, ఒంగోలుకు చెందిన వ్యాపారవేత్త రవిశంకర్‌లను పిలిచి మాట్లాడారు. పర్చూరు ఇన్‌చార్జిగా ఉన్న ఆమంచి అక్కడి నుంచి పోటీకి సిద్ధంగా లేరన్న సమాచారానికి తోడు, ఆయన్ను ఆపార్టీ శ్రేణులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో ప్రత్యామ్నాయం కోసం అధిష్ఠానం పా వులు కదుపుతోంది. సోమవారం ఆమంచితో అధిష్ఠానంలోని ముఖ్యనేతలతోపాటు సీఎం కూడా మాట్లాడారు. అయినా ప్రత్యామ్నాయ అభ్యర్థి కోసం మంగళవారం కూడా ప్రయత్నాలు కొనసాగించడంతో ఆమంచిని పర్చూ రు నుంచి తప్పించటం కానీ, ఆయన పోటీచేయనని చెప్పడం కానీ జరిగిందన్న న మ్మకం ఆపార్టీ శ్రేణుల్లో బలపడిపోయింది.

కాపులనే రంగంలోకి దించాలని..

కమ్మ సామాజికవర్గం ఓటర్లు అధికంగా ఉన్న పర్చూరు నియోజకవర్గం నుంచి కాపు సామాజికవర్గానికి చెందిన వ్యక్తిని రంగంలోకి దింపాలనేది వైసీపీ వ్యూహం. అందుకే సీఎంతో తాను పోటీచేస్తానని చెప్పిన గొట్టిపాటి భరత్‌ను, పోటీకి సిద్ధంగా ఉన్న మరో మాజీ ఇన్‌చార్జి రామనాథంబాబును పక్కనపెట్టి కాపు సామాజికవర్గం వారికోసం అన్వేషిస్తున్నారు. దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్‌ను సిటింగ్‌ స్థానం నుంచి తప్పించి మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాదరెడ్డికి అవకాశం ఇచ్చారు. దీంతో అసంతృప్తితో ఉన్న మద్దిశెట్టిని పర్చూరు నుంచి పోటీచేయమని గతంలో కోరగా ఆయన తిరస్కరించారు. తిరిగి మంగళవారం సజ్జలతో పాటు సీఎంవో ముఖ్య కార్యదర్శి ధనుంజయరెడ్డి కూడా ఆయనతో మాట్లాడినట్లు తెలిసింది. మరోసారి ఆలోచించండి పర్చూరు నుంచి మీరు పోటీచేస్తే బాగుంటుందని చెప్పినట్లు సమాచారం. ఒంగోలు నుంచి కంది రవిశంకర్‌ కూడా సీఎంవో నుంచి పిలుపు రావడంతో వెళ్లారు. ఆయన ఆలస్యంగా అక్కడికి చేరుకోవడంతో అప్పటికే బుధవారం నాటి అసెంబ్లీ సమావేశాలు, కేబినేట్‌ సమావేశానికి సంబంధించిన పనుల్లో నిమగ్నమైన అధిష్ఠానంలోని నాయకులు, సీఎంవో అధికారులు బుధవారం సాయంత్రం కానీ గురువారం కానీ మీరు రావాల్సి ఉంటుంది చెప్పినట్లు తెలిసింది. గతంలా చెప్పిన విధంగా పర్చూరు నుంచి పోటీచేసే అంశంపై మరోసారి ఆలోచించాలని సూచించినట్లు తెలిసింది. అయితే సోమవారం సీఎంను కలిసిన ఆమంచి కృష్ణమోహన్‌... చీరాల నుంచి ఎమ్మెల్యే బలరాం లేక ఆయన కుమారుడు వెంకటే్‌షలు కాకుండా వేరేవారికి అవకాశం ఇవ్వాలన్న తన డిమాండ్‌ను మరోసారి ప్రస్తావించేందుకే పరిమితమైనట్లు భావిస్తున్నారు. అందువల్లనే పర్చూరు విషయంలో కూడా ఆయన కోసం వెంపర్లాడకుండా ప్రత్యామ్నాయ అభ్యర్థికోసం పరిశీలించాలని సీఎం చెప్పిన ఆదేశాలతోనే మంగళవారం ఈ ప్రయత్నాలు జరిగాయని భావిస్తున్నారు.

Updated Date - Feb 06 , 2024 | 11:41 PM